VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

Uncategorized

ఫ్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీల నుండి తొలగించే నిర్ణయాన్ని ఉపసంహరించాలి వనపర్తి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్యన్ రమేష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర నాయకులు పుట్ట ఆంజనేయులు, మండ్ల రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,, గతం, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ కేంద్రాలను తక్షణమే రద్దు చేయాలని, ఈ కేంద్రాలను అంగన్వాడీలకు అప్పగిస్తూ వెంటనే ప్రభుత్వం నిర్ణయం చేయాలని, ఐసిడిఎస్ ను బలోపేతం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రతి నెల ఒకటో తేదీన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు వేతనాలు చెల్లించాలని, 15 వేల కాళీ పోస్టుల నీటిని ఒకేసారి భర్తీ చేయాలని ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18 వేల వేతనం పెంచాలని పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు గ్రాడి డ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు, పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్లు అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ ఈ పి 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు, కొత్తగా ఇచ్చిన సెల్ ఫోన్స్ పనిచేయట్లేదు, వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి అన్ని యాప్స్ మరియు సౌకర్యాలతో 5జి నెట్వర్క్ ఫోన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలని, అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రీ ప్రైమరీ విద్య రద్దయి ఎంతవరకు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతంగా చేస్తామని తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, అంగన్వాడి ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం కలెక్టర్ గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాజు సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము యూనియన్ జిల్లా కార్యదర్శి బి కవిత జిల్లా నాయకులు నాగేంద్రమ్మ భాగ్య రమాదేవి కృష్ణవేణి మంజుల మహేశ్వరి విజయ గోవిందమ్మ సుగుణ బాయ్ తదితరులు పాల్గొన్నారు

Read More »

ఖాళీ ఉద్యోగ పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలి వనపర్తి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి.కుతుబ్ డిమాండ్ చేశారు.గురువారం అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి బదులు శాశ్వత నియామకాలు చేపట్టాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎం.డీ.కుతుబ్ మాట్లాడుతూ:-నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షల పునాదులపై పురుడు పోసుకున్న 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో నేటికీ నిరుద్యోగ యువత కలలు నీటి మీద రాతలు వలె మారాయని వాపోయారు. ప్రజాపాలన పేరుతా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన చిత్తశుద్ధితో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక వారి శక్తి యుక్తులు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సహజ సంపద పుష్కలంగా ఉన్న పాలకుల చిత్తశుద్ధి లేని విధానాల ఫలితంగా నూతన పరిశ్రమల ఏర్పాటు ఉద్యోగుల కల్పన నిరుద్యోగ యువత యువకులకు అందని ద్రాక్షగా మారాయని వాపోయారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలు అరికట్టాలని ఫీజులో నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ:- రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం టిఎస్పిఎస్సి శాశ్వత జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత యువకులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుంటూ నిరుద్యోగులను దగా చేస్తుందని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ,ఏఐవైఎఫ్ నాయకులు ఎత్తు విష్ణు, ముస్తఫా,వినోద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

బిజెపి పాలనలో కష్టజీవుల బతుకు అధోగతి: సిపిఐ వనపర్తి బిజెపి 12 ఏళ్ల పాలనలో దేశం పరిస్థితి, కష్టజీవుల బతుకు అధోగతి పాలైందని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పెరిగిన ధరలకు నిరసనగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాన్ని సిపిఐ నేతలు కార్యకర్తలు ముట్టడించారు. ధర్నా చౌక్ నుంచి నేతలు కార్యకర్తలు ఎర్రజెండాలు ఎర్ర షర్టులు ఎర్ర చీరలు ధరించి భారీ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్కు చేరుకున్నారు. ముట్టడి సందర్భంగా నేతలు కార్యకర్తలు గేట్లు తోసుకొని లోపలికి వెళ్లకుండా ప్రధాన గేటు వేసి అడ్డుకున్నారు. కార్యకర్తలు గేటు ముందు బైఠాయించి నిరసన కొనసాగించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన నచ్చజెప్పి తమ ప్రసంగాలను కొనసాగించారు. నరేంద్ర మోడీ 12 ఏళ్ల క్రితం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, స్విస్ బ్యాంకు నుంచు నల్లధనం తెచ్చి ప్రతి రైతు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని, ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పైగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను భారీగా పెంచాలని ఫలితంగా రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు అంటాయని, సామాన్యుడు నిత్యవసర వస్తువులను కొని తినలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరలు తగ్గించాలని విపక్షాలు ప్రజలు గగ్గోలు పెడుతున్న పట్టించుకోవడం లేదని ధరలు తగ్గించే దాకా పోరాటం చేస్తామన్నారు. ధరల పెంపుతో సామాన్యుల కష్టాన్ని దోచి సంపన్నులకు సంపద పెంచుతున్నారని, కార్మిక చట్టాలను కాలరాచారని, వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి రైతుల కడుపు కొట్టేందుకు పూనుకున్నారని విమర్శించారు. రైతుల ఏడాది పోరాటంతో తోకమడిచి నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నారన్నారు. ప్రజల కనీస అవసరాల విషయంలో కూడా ప్రజలు పొదుపు పాటించాలని చెబుతున్న నరేంద్ర మోడీ రోజుకో దేశం తిరుగుతూ ప్రజాసమము దుర్వినియోగం నీళ్లలా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. దేశ సార్వభౌమత్వానికి చేటు తెచ్చే విధంగా ట్రంప్ కు భయపడుతున్నారు అన్నారు. తక్కువ ధరకు రష్యా చమురు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కొనవద్దని మోడీకి ట్రంప్ హుకుం జారీ చేస్తున్న బెదిరించలేని అసహయ స్థితిలో మోడీ ఉన్నారన్నారు. దేశభక్తి హిందూ మతం ముసుగులో ఇచ్చిన హామీల నుంచి ప్రజల సమస్యల నుంచి దృష్టి మరలచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు కనీస ఓటు హక్కును కూడా సర్ పేరుతో కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు గమనించి ప్రతిఘటించి బిజెపికి బుద్ధి చెప్పాలన్నారు. వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా నేతలు కళావతమ్మ, చంద్రయ్య, కృష్ణవేణి, గీత, మోష అబ్రహం ,రాబర్ట్, శ్రీహరి ,పృధ్వి నాదం, భాస్కర్, రవీందర్,డంగు కుర్మయ్య, వంక గోపాల్, గోపాలకృష్ణ, జయమ్మ,శ్రీదేవి, కురువమ్మ,డంగ్గులక్ష్మి,శిరీష, ఎం.కురుమయ్య,పెంటయ్య,చిన్న నారాయణ,శివకుమార్,కాకం బాలస్వామి, లక్ష్మీనారాయణ, శ్యాంసుందర్, సహదేవుడు, కాశన్న,మహేష్, వెంకటమ్మ, శంకరమ్మ,కుతుబ్, వంశీ, ఎర్ర కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి దక్కిన అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం వనపర్తి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డికి అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం లభించడం వనపర్తి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. సమాజంలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, యువతను రక్తదానం వైపు ప్రోత్సహించడంలో ఎమ్మెల్యే చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేక మంది రోగులకు ప్రాణదానంగా నిలిచే రక్తాన్ని అందించగలిగారు. రక్తదాన ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో ఎమ్మెల్యే గారి నాయకత్వం, యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు చేసిన కృషి విశేష ప్రశంసలు అందుకుంది ఈ నేపథ్యంలో గౌరవనీయ గవర్నర్ గారి చేతుల మీదుగా అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి ఆహ్వానం అందడం మరింత గర్వకారణంగా మారింది. మానవతా విలువలను చాటిచెప్పే ఈ గుర్తింపు వనపర్తి ప్రజలందరికీ ఆనందాన్ని కలిగిస్తుండగా, భవిష్యత్తులో కూడా రక్తదాన ఉద్యమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తూ ప్రాణాలను కాపాడే సేవా కార్యక్రమాలకు కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన, యువకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు

Read More »

ప్రజా నాయకుణ్ణికి అశేష జనవాహిని అభినందనల వెల్లువ వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు వారి స్వగృహంలో మాజీ ఎం.పి,మాజీ ఎంఎల్.ఏ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కళ సాహితీ వేదిక,ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి రావులకు శుభాకాంక్షలు తెలిపారు.గాయకులు రామ్ రెడ్డి,సత్తార్ గారు పాటలు పాడి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రావుల చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు వారు మరింత ప్రజాసేవలో ఉండి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ కౌన్సిలర్ నందిమల్ల.శారదఅశోక్ “శ్రీ చౌడేశ్వరి వృద్ధాశ్రమం”లో వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆశ్రమ నిర్వాహకులు ఎస్.వెంకటేశ్వరమ్మ,రాము , వృద్ధులు గతములో ఆశ్రమానికి రావుల చేయూత అందజేశారని వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలుస రమేష్ గౌడ్,వాకిటి.శ్రీధర్,నందిమల్ల.అశోక్,గంధం. బాలపీర్,గంధం.పరంజ్యోతి,విజయ్ కుమార్,గులాం ఖాదర్ ఖాన్,పలుస.శంకర్ గౌడ్,వేణు రెడ్డి,నందిమల్ల. రమేష్,గంధం.నాగరాజు,నాగనమోని.మన్నెం,నీలస్వామి,గులాం ఖాదర్ ఖాన్,ఉంగ్లం.తిరుమల్, వెంకట్ సాగర్,జోహెబ్ హుస్సేన్,సూర్యవంశం.గిరి,అరీఫ్,సయ్యద్. జెమిల్, ఫజల్,సమద్,పాషా,ఎర్ర.శ్రీనివాసులు,కుమార్, శిరీవాటి.శంకర్,ఖాదర్,వెంకటేష్ తదితరులు ఉన్నారు

Read More »

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి – క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేరుకోండి వనపర్తి ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించాలని, తన ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వనపర్తి మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా బుధవారం స్థానిక కల్యాణసాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతి డ్రైవరు నేను చాలా బాగా నడిపిస్తాను అనే ధీమాతోనే ఉంటారని కానీ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు నిర్లక్ష్యానికి మూల్యం ఎంతటిదో తెలుస్తుందన్నారు. దేశంలో ప్రతి 4 నిమిషాలకు రోడ్డు ప్రమాదం ద్వారా ఒకరి ప్రాణం పోతుందని తెలియజేశారు. అందుకే వనపర్తి జిల్లాలో ప్రమాదాల నివారణ కొరకు వాహనదారులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ పోలీసులు రోడ్డు పై తనిఖీలు నిర్వహించినప్పుడు పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అపోహ పడతారని, కానీ రోడ్డు భద్రత అనేది వాహనదారుల ప్రాణాలు కాపాడటానికే తప్ప ఇబ్బందులకు గురి చేయడానికి కాదనీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగి ప్రతి రోజు దేశంలో కనీసం 15 మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జనవరి, 2026 నుండి పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల సమన్వయంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ ప్రాణం తో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడేవిధంగా వాహనం నడిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా మున్సిపల్ కమిషనర్ మునావర్ అలీ, డి.ఎస్.పి గిరిధర్, బసంతి ఫౌండేషన్ నిర్వాహకులు అజయ్ నాయుడు, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్లు, సి.ఐ లు, ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్లు మహిళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Read More »

సామాన్యుల రెక్కల కష్టాలు సంపన్నులకు దోచిపెడుతున్న మోడీ: రమేష్ వనపర్తి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల రెక్కల కష్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సంపన్నులకు దోచి పెడుతున్నారని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ ఆరోపించారు. మంగళవారం సిపిఐ ఆఫీస్ లో మాట్లాడుతూ.. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపకం నిత్యవసర వస్తువుల ధరలన్నీ చుక్కలంటాయని, సామాన్యుడు కొని తిని బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కష్టజీవుల వేతనాలు ఆదాయం ఆదాయం పెరగకపోగా ధరలు మాత్రం పెరిగాయని కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉప్పు పప్పు నూనెలు సబ్బులు దుస్తులు అన్ని వస్తువులు, కూరగాయల ధరలు సైతం పెరిగాయి అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటం లేదని విధిలేక వారి శ్రమను తక్కువ ధరకే అమ్ముకుంటున్నారన్నారు. తక్కువ వేతనానికే పనిచేస్తుండగా పని గంటలు మాత్రం ఎనిమిది నుంచి పదికి పెంచడం దుర్మార్గమన్నారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుందని వనపర్తి కలెక్టరేట్ వద్ద నేడు ఉదయం 11 గంటలకు ధర్నా ఉంటుందని పోరాటాలతో మోదీ మెడలు వంచేందుకునియోజకవర్గ వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, లక్ష్మీనారాయణ, విజయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Read More »

భూదాన భూములను అన్యాక్రాంతం నుంచి రక్షించాలి: అవినాష్ వనపర్తి దేశంలో రాష్ట్రంలో భూదాన భూములను అన్యాక్రాంతం నుంచి రక్షించి సర్వోదయం మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి అవినాష్ పిలుపునిచ్చారు. వనపర్తి లో రమేష్ అధ్యక్షతన సర్వోదయమండలి జిల్లా మహాసభలు నిర్వహించారు. ముఖ్య అతిథులు అతిథులుగా, జాతీయ ప్రధాన కార్యదర్శి అవినాష్, జాతీయ ట్రస్సీ కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ షేక్ హుస్సేన్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్ పాల్గొని మాట్లాడారు. గాంధీ స్ఫూర్తితో ఆచార్య వినోబావే భూదాన ఉద్యమం ప్రారంభించి దేశంలో 14 ఏళ్ళు పాదయాత్ర చేసి 46 లక్షల ఎకరాలను సేకరించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 లక్షల 40 వేల ఎకరాలు ఉండగా తెలంగాణలో 1లక్షా76 వేల ఎకరాల భూదాన భూములు ఉన్నాయన్నారు. అందులో కొంత భూమిని పేదలకు పంచారని, పలుచోట్ల భూదాన భూములు అన్యాక్రాంతమయ్యాయి అన్నారు. భూములు ఇచ్చిన వారి వారసులు కూడా భూదాన భూములను పేదల నుంచి దౌర్జన్యంగా ఆక్రమించారన్నారు. తెలంగాణ రాష్ట్రం పోచంపల్లిలో రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూములను భూదానం చేసి పూర్తి నిచ్చారన్నారు. హైదరాబాద్ లో కోట్ల రూపాయలు విలువ చేసే భూదాన భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. భూదాన యజ్ఞ బోర్డుతో కొందరు మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ 33 జిల్లాల్లో భూదాన భూములను గుర్తించి వాటిని పేదలకు పంచేందుకు జిల్లా కమిటీలు గ్రామ గ్రామాన కమిటీలు వేసి పోరాడాలన్నారు. రక్తం చుక్క పడకుండా వినోబాభావే భూములను సేకరించారని, అవి అన్యాక్రాంతం కావటం బాధాకరమన్నారు. వనపర్తి జిల్లాలో 4450 ఎకరాల భూదాన భూములు ఉన్నాయని చాలా మేరకు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. సర్వోదయం అంటేనే అందరి అభివృద్ధి సంక్షేమం సమానాక్కులు కల్పించడం అన్నారు. జిల్లాలో భూములు కాపాడేందుకు జిల్లా కమిటీ కృషి చేయాలని అవసరమైతే రాష్ట్ర జాతీయ కమిటీల సహకారం కూడా తీసుకోవాలన్నారు. జాతీయ ట్రస్ట్ తెలంగాణ ఇంచార్జ్ షేక్ హుస్సేన్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్, కళావతమ్మ, శ్రీదేవి, జయమ్మ, గోవిందమ్మ, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షుడిగా రమేష్జిల్లా మహాసభల్లో సర్వోదయమండలి జిల్లా అధ్యక్షుడిగా రమేష్, ప్రధాన కార్యదర్శిగా రాబర్ట్, ప్రతినిధిగా గోవిందమ్మ, ఉపాధ్యక్షులుగా రాజశేఖర్, సహాయ కార్యదర్శి గా లింగన్న, కోశాధికారిగా లక్ష్మీనారాయణ, మహిళా అధ్యక్షురాలుగా శ్రీదేవి, కార్యదర్శిగా జయమ్మ, యువజన సంఘం అధ్యక్షుడిగా కే మహేష్, కార్యదర్శిగా వంశీ, కమిటీ సభ్యులుగా శ్రీరామ్ కమలమ్మ యూసఫ్ సత్యమ్మ లని అనుకున్నారు.

Read More »

సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి వనపర్తి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత పని మీద సబ్ రిజిస్టర్ కార్యాలయాన్నికి వచ్చిన సందర్భంగా రిజిస్టార్ చంద్రశేఖర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కార్యాలయ పనితీరు గూర్చి వివరించి ఇంకా కొన్ని మౌలిక వసతులు అందుబాటులోకి రావాలని వివరించారు. రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ ఆధ్వర్యములో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డినీ సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హంగులతో రాష్ట్ర స్థాయిలో ఆదర్శవంతమైన కార్యాలయాన్ని నిర్మిస్తామని అన్నారు. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రైటర్స్ మరియు వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరించి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెంట కూతురు తేజస్విని , నాయకులు వాకిటి.శ్రీధర్, నందిమల్ల అశోక్,సయ్యద్.జహంగీర్,బాగ్యరాజ్,అరుణ్ యాదవ్,ఇమ్రాన్,ముని కుమార్,అలీమ్ తదితరులు ఉన్నారు.

Read More »

యువత చెడు వ్యసనాలకు బానిసలుగా కాదు…చెడు రాజకీయాలను చెండాడే సైనికులవ్వాలి వనపర్తి దేశ గతిని మార్చే యువత శక్తి చెడు వ్యసనాలకు బానిసలుగా కాకుండా నీతి నిజాయితీ సేవా దృక్పథానికి కలంఖంగా మారిన చెడు రాజకీయ వ్యవస్థను చెండాడే సైనికులు దేశ యువత కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె.విజయరాములు పిలుపునిచ్చారు. సోమవారం అమరచింత మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) వనపర్తి జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయరాములు మాట్లాడుతూ:- పాలకులు దశాబ్దాల తరబడి యువతను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా మాత్రమే ఉపయోగిస్తూ యువత ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత యువత శక్తి యుక్తులు నిర్వీర్యం చేసే విధానాలను అవలంబించడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.60 శాతం పైగా యువత ఉన్న ఏకైక దేశం భారత్ అని అన్నారు.యువత నైపుణ్యాలను గుర్తించి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా బానిసలుగా మారుస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని 12 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కులం,మతం,ప్రాంతీయ విద్వేషాలతో యువత మెదల్లను కల్మషం చేస్తున్నారని అన్నారు.జాతీయ సమగ్ర యువజన విధానం ప్రకటించాలని, యువతకు ఎలాంటి బ్యాంకు షూరిటీలు లేకుండా స్వయం ఉపాధి రుణాలు అందివ్వాలని, ప్రతి నియోజకవర్గంలో నూతన పరిశ్రమలు నెలకొల్పి స్థానికుల యువతీ యువకులకు 80 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ప్రాథమిక హక్కులైన విద్యా వైద్యం ఉపాధి హక్కులకై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్,ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. డి.కుతూబ్, ఏఐవైఎఫ్ నాయకులు నరసింహ, మహిముద్,శ్రీకాంత్,రవి, చంద్రయుడు,నరేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

Scroll to Top