VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి


దేశంలో రాష్ట్రంలో భూదాన భూములను అన్యాక్రాంతం నుంచి రక్షించి సర్వోదయం మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి అవినాష్ పిలుపునిచ్చారు. వనపర్తి లో రమేష్ అధ్యక్షతన సర్వోదయమండలి జిల్లా మహాసభలు నిర్వహించారు. ముఖ్య అతిథులు అతిథులుగా, జాతీయ ప్రధాన కార్యదర్శి అవినాష్, జాతీయ ట్రస్సీ కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ షేక్ హుస్సేన్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్ పాల్గొని మాట్లాడారు. గాంధీ స్ఫూర్తితో ఆచార్య వినోబావే భూదాన ఉద్యమం ప్రారంభించి దేశంలో 14 ఏళ్ళు పాదయాత్ర చేసి 46 లక్షల ఎకరాలను సేకరించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 లక్షల 40 వేల ఎకరాలు ఉండగా తెలంగాణలో 1లక్షా76 వేల ఎకరాల భూదాన భూములు ఉన్నాయన్నారు. అందులో కొంత భూమిని పేదలకు పంచారని, పలుచోట్ల భూదాన భూములు అన్యాక్రాంతమయ్యాయి అన్నారు. భూములు ఇచ్చిన వారి వారసులు కూడా భూదాన భూములను పేదల నుంచి దౌర్జన్యంగా ఆక్రమించారన్నారు. తెలంగాణ రాష్ట్రం పోచంపల్లిలో రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూములను భూదానం చేసి పూర్తి నిచ్చారన్నారు. హైదరాబాద్ లో కోట్ల రూపాయలు విలువ చేసే భూదాన భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. భూదాన యజ్ఞ బోర్డుతో కొందరు మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ 33 జిల్లాల్లో భూదాన భూములను గుర్తించి వాటిని పేదలకు పంచేందుకు జిల్లా కమిటీలు గ్రామ గ్రామాన కమిటీలు వేసి పోరాడాలన్నారు. రక్తం చుక్క పడకుండా వినోబాభావే భూములను సేకరించారని, అవి అన్యాక్రాంతం కావటం బాధాకరమన్నారు. వనపర్తి జిల్లాలో 4450 ఎకరాల భూదాన భూములు ఉన్నాయని చాలా మేరకు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. సర్వోదయం అంటేనే అందరి అభివృద్ధి సంక్షేమం సమానాక్కులు కల్పించడం అన్నారు. జిల్లాలో భూములు కాపాడేందుకు జిల్లా కమిటీ కృషి చేయాలని అవసరమైతే రాష్ట్ర జాతీయ కమిటీల సహకారం కూడా తీసుకోవాలన్నారు. జాతీయ ట్రస్ట్ తెలంగాణ ఇంచార్జ్ షేక్ హుస్సేన్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్, కళావతమ్మ, శ్రీదేవి, జయమ్మ, గోవిందమ్మ, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా రమేష్
జిల్లా మహాసభల్లో సర్వోదయమండలి జిల్లా అధ్యక్షుడిగా రమేష్, ప్రధాన కార్యదర్శిగా రాబర్ట్, ప్రతినిధిగా గోవిందమ్మ, ఉపాధ్యక్షులుగా రాజశేఖర్, సహాయ కార్యదర్శి గా లింగన్న, కోశాధికారిగా లక్ష్మీనారాయణ, మహిళా అధ్యక్షురాలుగా శ్రీదేవి, కార్యదర్శిగా జయమ్మ, యువజన సంఘం అధ్యక్షుడిగా కే మహేష్, కార్యదర్శిగా వంశీ, కమిటీ సభ్యులుగా శ్రీరామ్ కమలమ్మ యూసఫ్ సత్యమ్మ లని అనుకున్నారు.

whatsapp image 2026 06 08 at 7.09.37 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top