సామాన్యుల రెక్కల కష్టాలు సంపన్నులకు దోచిపెడుతున్న మోడీ: రమేష్
వనపర్తి
డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల రెక్కల కష్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సంపన్నులకు దోచి పెడుతున్నారని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ ఆరోపించారు. మంగళవారం సిపిఐ ఆఫీస్ లో మాట్లాడుతూ.. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపకం నిత్యవసర వస్తువుల ధరలన్నీ చుక్కలంటాయని, సామాన్యుడు కొని తిని బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కష్టజీవుల వేతనాలు ఆదాయం ఆదాయం పెరగకపోగా ధరలు మాత్రం పెరిగాయని కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉప్పు పప్పు నూనెలు సబ్బులు దుస్తులు అన్ని వస్తువులు, కూరగాయల ధరలు సైతం పెరిగాయి అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటం లేదని విధిలేక వారి శ్రమను తక్కువ ధరకే అమ్ముకుంటున్నారన్నారు. తక్కువ వేతనానికే పనిచేస్తుండగా పని గంటలు మాత్రం ఎనిమిది నుంచి పదికి పెంచడం దుర్మార్గమన్నారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుందని వనపర్తి కలెక్టరేట్ వద్ద నేడు ఉదయం 11 గంటలకు ధర్నా ఉంటుందని పోరాటాలతో మోదీ మెడలు వంచేందుకునియోజకవర్గ వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, లక్ష్మీనారాయణ, విజయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
