VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్యన్ రమేష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర నాయకులు పుట్ట ఆంజనేయులు, మండ్ల రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,, గతం, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ కేంద్రాలను తక్షణమే రద్దు చేయాలని, ఈ కేంద్రాలను అంగన్వాడీలకు అప్పగిస్తూ వెంటనే ప్రభుత్వం నిర్ణయం చేయాలని, ఐసిడిఎస్ ను బలోపేతం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రతి నెల ఒకటో తేదీన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు వేతనాలు చెల్లించాలని, 15 వేల కాళీ పోస్టుల నీటిని ఒకేసారి భర్తీ చేయాలని ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18 వేల వేతనం పెంచాలని పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు గ్రాడి డ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు, పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్లు అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ ఈ పి 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు, కొత్తగా ఇచ్చిన సెల్ ఫోన్స్ పనిచేయట్లేదు, వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి అన్ని యాప్స్ మరియు సౌకర్యాలతో 5జి నెట్వర్క్ ఫోన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలని, అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రీ ప్రైమరీ విద్య రద్దయి ఎంతవరకు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతంగా చేస్తామని తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, అంగన్వాడి ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం కలెక్టర్ గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాజు సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము యూనియన్ జిల్లా కార్యదర్శి బి కవిత జిల్లా నాయకులు నాగేంద్రమ్మ భాగ్య రమాదేవి కృష్ణవేణి మంజుల మహేశ్వరి విజయ గోవిందమ్మ సుగుణ బాయ్ తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 06 11 at 5.02.41 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top