జమ్ములమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మృగశిర కార్తీ సందర్భంగా 23వ వార్డులో జమ్ములమ్మ ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గతములో దేవాలయ నిర్మాణాన్నికి 5లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధికి కృషి చేశామని భవిష్యత్తులో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తామని అన్నారు. పట్టణ ప్రజలు జమ్ములమ్మ దేవత ఆశీషులతో పాడిపంటలతో సుఖసంతోషాలతో సౌభాగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. నిరంజన్ రెడ్డి కి నాయకులు మెకానిక్.శ్రీను,ఉంగ్లం. తిరుమల్ ,నందిమల్ల.శారదా అశోక్ ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల.అశోక్ సబ్బిరెడ్డి.యుగంధర్ రెడ్డి, శ్రీనివాస్పూర్.నరసింహ,వీర సాగర్,సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము, పెద్దముక్కల.రవి,ఇమ్రాన్,మునికుమార్,చెన్నారెడ్డి, సబ్బిరెడ్డి. రవీందర్ రెడ్డి, ఎంట్ల.శ్రీను, గౌనికాడి.యాదయ్య,తోట.శ్రీను,కుమ్మరి.రామస్వామి తదితరులు ఉన్నారు.
Uncategorized
వ్యవసాయ కార్మిక మహాసభలు జయప్రదం చేద్దాం వనపర్తి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ నేల 20న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేస్తూ భారీ బహిరంగ నిర్వహించడం జరుగుతుంది వనపర్తి జిల్లా కార్మిక వర్గం వెయలాది మంది కార్మికులు పాల్గోని జయప్రదం చేయాలనీ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన CITU జిల్లా విస్తృతస్థాయి సమావేశాము CITU జిల్లా అధ్యక్షులు R N రమేష్ అధ్యక్షతన CITU జిల్లా కార్యాలయంలో ప్రారంభము అయుంది ఈ సమావేశంను ఉద్దేశించి CITU జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, CITU జిల్లా అధ్యక్షులు R N రమేష్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన విబి-జి రామ్ జి చట్టం వ్యవసాయ కార్మికులకు గొడ్డలిపెట్టుగా ఉందని అన్నారు. రెండు రెక్కలే ఆస్తిగా, చెమట చుక్కలే పెట్టుబడిగా, గొడ్డు చాకిరి చేసి మొత్తం సమాజానికి తిండి అందిస్తున్న శ్రామిక వర్గం, వ్యవసాయ కార్మికులు అని అన్నారు. అలాంటి వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ దేశంలో కార్మికులను వ్యవసాయ కార్మికులను మోసం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి అణిచివేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి, వ్యవసాయ కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకి ఈ దేశ సంపదను కట్టబెడుతున్నారు అన్ని అన్నారు. ఈ దేశంలో కార్మికులకి వ్యవసాయ కార్మికులకు తిండి, బట్ట, ఇల్లు, సాగు భూమి, కనీస వేతనం, ఉపాధి, విద్య, వైద్యం, అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 20న ఉమ్మడి మహబూబ్ నగర్ పట్టణంలో మున్సిపల్ టౌన్ హాల్ నుంచి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వరకు వేలాది మంది కార్మికులతో ఎర్రజెండా దండు భారీ ప్రదర్శన, అనంతరం భారీ బహిరంగ సభ జరుగుతుందని ఈ సభకి త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తారని, ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి కర్మిక వర్గం, వనపర్తి జిల్లా కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పుట్ట ఆంజనేయులు సునీత సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ రాజు, బాలగౌడ్, జిల్లా నాయకులు D కురుమయ్య, A బుచ్చన్న, వెంకటయ్య, నందిమాళ్ళ రాములు, జానకి రాముడు, చెన్నమ్మ, దేవమ్మ, సత్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి వనపర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, జెడ్పి సీఈవో యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగ కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 77 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 5 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యా వ్యాపార మాఫియా దోపిడికి అడ్డుకట్ట వేయాలి వనపర్తి రాజ్యాంగ ప్రాథమిక హక్కులో భాగమైన ఉచిత విద్యను అంగడి సరుకుగా మార్చి కొత్త కొత్త టెక్నాలజీ పేర్లతో పవిత్రమైన విద్య వ్యవస్థను స్వార్థపూరిత కుట్రలతో విద్యను వ్యాపారం చేసిన విద్య మాఫియా దోపిడీలపై ప్రభుత్వం తక్షణమే అడ్డుకట్ట వేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి.కుతూబ్ డిమాండ్ చేశారు. ఆదివారం అమరచింత మండల కేంద్రంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)అమరచింత మున్సిపల్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎం.డి కుతూబ్ మాట్లాడుతూ కేజీ నుండి పేజీ వరకు ఉచిత విద్య అనే పాలకుల నినాదం కేవలం మాటలకే పరిమితం అయ్యాయని, విద్య హక్కు చట్టంలోని సూత్రాలు, ఫీజుల నియంత్రణ జీవోలు కేవలం పరిపాలన శాఖల పేపర్లకు మాత్రమే పరిమితం చేశారని మండిపడ్డారు.నాణ్యమైన విద్య పేరుతో ప్రవేట్ కార్పోరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అడ్డు అదుపు లేకుండా ఫీజులు దండుకుంటున్న విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతు వేసవిలోనే ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులకు టార్గెట్లు పెట్టి ఇంటింటా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై, ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా గెలుస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఎన్ని కేసులు నమోదు చేశారో, ఎన్ని విద్య సంస్థలు సీజ్ చేశారో తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు జలగళ్ల ఫీజుల దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. జీవో నెంబర్ ఒకటి ప్రకారం ఏ ఒక్క ప్రైవేటు విద్యా సంస్థ నడవడం లేదని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు దోపిడీ ఆపకపోతే ప్రత్యక్ష దాడులకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మహమూద్,దయాకర్, అరుణ్,మల్లేష్ యాదవ్, శ్రీకాంత్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరంగాపురం మండల కేంద్రంలో కిరాణం & జనరల్ స్టోర్ ప్రారంభించిన మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి శ్రీరంగాపురం మండల కేంద్రంలో తెరాస నాయకుడు జలీలు (మాజీ ఎంపిటిసి) గారి కిరాణం అండ్ జనరల్ స్టోర్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కిరాణం షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గారి వెంట ఆర్ .వెంకట్ స్వామి మండల అధ్యక్షులు బిఆర్ఎస్, ఆర్. పృథ్వి రాజు సీనియర్ నాయకులు, గౌడ నాయక్, విజయ్ కుమార్ రెడ్డి సర్పంచ్, సుదర్శన్ రెడ్డి, రాధాకృష్ణ, మహేశ్వర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ, పర్వతాలు బక్కయ్య కృష్ణయ్య విష్ణు, కాజా, శివ సాగర్ గుంటి వెంకటేష్ ఎర్ర కృష్ణయ్య రాజు కిరాణం షాప్ ప్రొప్రైటర్ జలీల్ కుటుంబ సభ్యులు మరియు శ్రీరంగాపురం మండల *బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒంటరి అయినా చిన్నారి(భవ్య శ్రీ )కి ఆర్థిక సహాయం వనపర్తి వనపర్తి జిల్లా పెద్దమందడి జిల్లా పరిషత్ పాఠశాల 2005- 2006 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తోటి స్నేహితురాలి కూతురికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందించారు. పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన (రేణుక ) పెద్దమందడి మండల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-06 లో పదో తరగతి చదివారు . నెల క్రితం అనారోగ్యంతో అమె మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు ఒంటరి అయిన తన స్నేహితురాలి కూతురి కి తమ వంతు ఏమైనా సహాయం చేయాలని అనుకున్నారు. రేణుక కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్న స్నేహితులు, తమతో పాటు చదువుకున్న స్నేహితురాలి కూతురు భవ్య శ్రీ కి స్నేహితులు అందరూ కలిసి జమ చేసుకున్న 50,000/వేల రూపాయలను ఆర్థిక సహకారాన్ని అందించారు.ఈ నగదు మొత్తాని (భవ్య శ్రీ )పేరు మిద బ్యాంకు లో ఫిక్స్ డిపాజిట్ చెయ్యలని నిర్ణంచారు. భవిష్యత్తులో కూడా (రేణుక)కూతురు (భవ్య శ్రీ )చదువుల విషయంలో ఎలాంటి సహకారం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చిన్నారిని ధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో 2005-06 బ్యాచ్ స్నేహితులు అందరు పాల్గొన్నారు.
కోట మైసమ్మ దేవత ఆరాధనకు రావుల చేయూత వనపర్తి హమాలీ యూనియన్ (పాత గంజి) కార్మికులు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కోట మైసమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు మాజీ పార్లమెంటు సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి పండుగ నిర్వహణకు ఆర్థిక సహాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా అందించిన నగదును నాయకులు నందిమల్ల అశోక్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, సయ్యద్ జమీల్ కలిసి హమాలీ యూనియన్ అధ్యక్షుడు బాబుకు అందజేశారు. కార్మికుల సంక్షేమం, సంప్రదాయాల పరిరక్షణ పట్ల రావుల చంద్రశేఖర రెడ్డి గారి సహకారం అభినందనీయమని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రతి నెల ఒకటో తేదీని వేతనాలు చెల్లించాలి_మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి వనపర్తి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్( CITU) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హనీప్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షడు, కార్యదర్శి, ఆర్యన్ రమేష్, మండ్ల రాజు మాట్లాడుతూ,, రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇచ్చిన మాట ప్రకారం గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,కనీస వేతనం 26,000 ఇవ్వాలి,51 జీవో ను రద్దచేయాలని,మరణించిన కార్మికుల కుటుంబానికి దహన సంస్కారాలకు 30 వేల రూపాయలు ఇవ్వాలని,గ్రామపంచాయతీ నిధుల నుండి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించాలని,కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని ,ఆన్లైన్లో లేని కార్మికుల పేర్లు వెంటనే ఆన్లైన్లోచేయాలని ,పెండింగ్ వేతనాలుచెల్లించాలని,కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఈఎస్ఐపిఎఫ్ బీమా సౌకర్యం కల్పించాలని పనిచేస్తున్న ప్రతి గ్రామపంచాయతీ కార్మికునికి శానిటేషన్ వస్తువులు సభ్యులు నూనెలు చెప్పులు దుస్తులు ఇతర సామాగ్రి ఇవ్వాలని,ప్రజా ప్రతినిధుల వేధింపులు అరికట్టాలని ఆక్రమ తొలగింపులను నిలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే రానున్న కాలంలో కార్మికులను సమీకరించి ప్రభుత్వమేన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు అనీఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జి పుష్ప నారాయణ శీను రామచంద్రయ్య చెన్నమ్మ విజయలక్ష్మి ఎల్లయ్య సుగ్రీవుడు పుల్లయ్య రాములు సిఐటియు జిల్లా నాయకులు మధు, తదితరులు పాల్గొన్నారు
వనపర్తి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి వనపర్తి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించేందుకు వనపర్తి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తకోట పట్టణంలో 2కే రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తకోట చౌరస్తా వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అతిథులు, ఏటీఆర్ కన్వెన్షన్ వరకు నిర్వహించిన 2కే రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజలందరితో కలిసి యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన బాల కార్మిక, బాల్య వివాహాల నిర్మూలన అవగాహన పోస్టర్లను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నియంత్రణ విషయంలో అత్యంత సీరియస్‌గా ఉన్నారని, ఈగల్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డ్రగ్స్‌ను అరికట్టడం ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం అధికారులకు అందించాలని, సమాచారాన్ని గోప్యంగా ఉంచబడుతుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చివరి రోజున డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. డ్రగ్స్ అనే మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై పర్యవేక్షణ ఉంచి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వనపర్తి జిల్లాను పూర్తిగా డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. యువత తెలియకుండానే డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సేవించేవారు, లేదా సరఫరా చేసేవారికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యా సంస్థలు, గ్రామాలు, కాలనీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, కొత్తకోట మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ సునీత పల్లవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రశాంత్, పోలీసు శాఖ అధికారులు, కొత్తకోట వాకింగ్ అసోసియేషన్ల సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
పుట్టు చీర కార్యక్రమానికి హాజరై చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి కొత్తకోటలోని ఆర్‌కే గార్డెన్‌లో శ్రీమతి మాలతి నరసింహ రెడ్డి గార్ల ఆహ్వానం మేరకు నిర్వహించిన పుట్టు చీర కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విద్యా విజ్ఞానాలతో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు, ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు