కాంగ్రెస్ ప్రభుత్వ పథకా ప్రయోజనాన్ని ప్రతి ఇంటికి చేరేలా ప్రచారం నిర్వహించాలి వనపర్తి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా బలమైన సంకల్పంతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ డాక్టర్ మల్లు రవి చేపట్టిన రథయాత్ర సోమవారం వనపర్తి జిల్లాలోకి జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి పెబ్బేరు పట్టణంలో బస్సు యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు బస్సులో ప్రయాణం చేస్తూ పెబ్బేరు పట్టణంలోని వీధుల గుండా పర్యటించారు. అనంతరం సుభాష్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి ఎంతగానో తోడుపాటునందిస్తుందని ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి అండగా నిలబడుతుందన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వడ్డీ లేని రుణాలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు చైర్మన్లుగా పాటు పాఠశాలల్లో విద్యార్థులకు వంట ఏజెన్సీలుగా మహిళలే ఉండటం స్కూల్ విద్యార్థులకు మహిళలే స్కూల్ డ్రెస్లను కుట్టించి ఇవ్వడం ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేయడం మహిళా భాగస్వామ్యంతో సోలార్ ప్లాంట్ లో ఏర్పాటు మహిళలకు డీజిల్ బంకుల ఏర్పాట్లు రైతు రుణమాఫీరైతు భరోసా భూమిలేని నిరుపేదలకు రైతు ఆత్మీయ భరోసా సన్న వడ్లకు బోనస్ అన్నదాతలకు రాయితీపై వ్యవసాయ ఉపకరణానికి సంబంధించిన అన్ని పనుముట్ల పంపిణీతమ సొంత ఇంటి కల నెరవేరక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు రేషన్ కార్డుల పంపిణీ ఉచిత సన్న బియ్యం పంపిణీ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు పెబ్బేరుల 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీలలో ప్రతి వార్డులో సిసి రోడ్ల నిర్మాణం లాంటి అనేక పథకాలను చేపట్టి నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇట్టి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మన నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు చేపట్టిన రథయాత్ర కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లాలలో ముగించుకుని నేడు వనపర్తికి రావడం ఆనందదాయకమని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, మండలాధ్యక్షులు యాపర్ల రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి, జిల్లా డిసిసిబి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, బోయల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్, గోపాల్పేట మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు సత్యశీల రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగంధర్ రెడ్డి, మణిగిల్ల తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Uncategorized
ఎ ఎస్ ఐ సుబ్బరాజు సేవలు అభినందనీయం వనపర్తి పోలీస్ శాఖలో దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు సేవలందించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎ ఎస్ ఐ సుబ్బరాజును సాహితీ కళా వేదిక సభ్యులు సోమవారం వనపర్తిలో ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ పనిని దైవంగా భావించి వృత్తి ధర్మాన్ని చిత్త శుద్ధితో నిర్వహించారని, ఏనాడు విధుల పట్ల నిర్లక్ష్యం చూపలేదని కొనియాడారు.మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన తన ఉద్యోగ జీవితంలో ఉత్తమ వ్యక్తిత్వంతో బాధ్యతాయుతంగా పని చేశారని అన్నారు.ఆయన పోలీస్ శాఖకు అందించిన సేవలకుగాను ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు జిల్లా యంత్రాంగం పక్షాన ఉత్తమ సేవా పురస్కారాలు కూడా అందుకున్నారని వివరించారు. కళా వేదిక ప్రతినిధులు సుబ్బరాజు దంపతులను శాలువ జ్ఞాపికలతో సత్కరించారు. ఈనాటి కార్యక్రమంలో ఆర్డి ఎస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్,ప్రధానోపాధ్యాయులు గణేష్ కుమార్,వ్యాఖ్యాత బైరోజు చంద్ర శేఖర్,బండారు శ్రీనివాస్, ఓమేష్,రుకునందన్,ఎడ్విన్,మింటా రోస్ థామస్ తదితరులు పాల్గొన్నారు.
మేఘన హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే వనపర్తి వనపర్తి పట్టణం గాంధీ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మేఘన ఆసుపత్రిని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దిన దిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ఇలాంటి ఆస్పత్రులు ఎంతో అవసరమని, అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వచ్చే వారికి సకాలంలో వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వైద్యాన్ని వ్యాపార భావంతో కాకుండా సేవా భావంతో చేయాలని భగవంతుడి తర్వాత భగవంతుండ చూసేది కేవలం వైద్యులను మాత్రమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, వనపర్తి పట్టణ అధ్యక్షుడు కదిరి రాములు, పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాపర్ల రాంరెడ్డి, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తో సాధికారత : NFIW వనపర్తి చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం తోనే మహిళా సాధికారత సాధ్యమని NFIW జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి గీత అన్నారు. గురువారం వనపర్తి జిల్లా ఆఫీసులో ఎన్ఎఫ్ఐడబ్ల్యు 72వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.NFIW జెండాను ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ ఆవిష్కరించారు. నేతలు మాట్లాడుతూ. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో కేవలం 33% రిజర్వేషన్ కు చట్టం చేశారని, బిజెపి ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో కలిపి పార్లమెంటులో బిల్లు పెట్టి అమలు కాకుండా అడ్డు కొట్టిందని, విడిగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. బిజెపి విధానాలు మాటల్లో మహిళలకు అనుకూలంగా చేతల్లో వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు.దేశంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలపై హత్యాచారాలు, హత్యలు, అకృత్యాలు, వేధింపులు నానాటికి పెరుగుతున్నాయని, చాలా తక్కువ కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతుండటంతో నేరాలు పెరిగిపోతున్న అన్నారు. మహిళలు సంఘటితమై నిందితులకు శిక్షలు పడేదాకా పోరాడాలి అన్నారు. బండి భగీరథ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఇతర పార్టీలు ప్రజా సంఘాలు పోరాటంతోనే అరెస్టు చేశారన్నారు. లింగ వివక్ష తగ్గలేదని ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేస్తున్నారని వారిని పుట్టనివ్వాలి ఎదగనివ్వాలి చదవని ఇవ్వాలని, మగ పిల్లలకు దీటుగా, కొన్నిసార్లు చదువు వివిధ రంగాల్లో వారి కంటే బాలికలు పై చేయి సాధిస్తున్నారన్నారు. మగ పిల్లల కంటే ఆడపిల్లలే పుట్టింటికి మెట్టినింటికి గౌరవం చేస్తున్నారన్నారు. ఆస్తుల కోసం మగ పిల్లలు తల్లిదండ్రులను వేధిస్తున్నారని ఆడపిల్లలు బాధ్యతగా తల్లిదండ్రులను పోషిస్తున్నారని ఈ విషయం పెద్దలు గ్రహించాలన్నారు. మహిళలు వంటింటి కుందేళ్లుగా మారోద్దని అన్యాయం జరిగినప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాడినప్పుడే హక్కులు దక్కుతాయని, న్యాయం జరుగుతుందన్నారు. ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జెండా కింద గ్రామ గ్రామాన మహిళలు ఏకమై మహిళలపై ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.NFIW జిల్లా ఇన్చార్జ్ రమేష్,NFIW జిల్లా ప్రధాన కార్యదర్శి గీత, వనపర్తిపట్టణ కో కన్వీనర్ శిరీష, నేతలుశ్రీదేవి, వెంకటమ్మ, సాయి లీల, నాగమణి, వార్డు మెంబర్ సుజాత, శాన్వి, బబ్బి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే వనపర్తిని మోడల్‌గా తీర్చిదిద్దుతా వనపర్తి రాష్ట్రంలోనే వనపర్తిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. ప్రజాపాలన 99 ప్రగతి ప్రణాళిక వార్డు సభ కార్యక్రమాన్ని గురువారం కర్రెమ్మ గుడి వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎమ్మెల్యే నామినేషన్ దాఖలు చేయకముందే తాను ప్రజలకు సెల్ఫ్ డిక్లరేషన్ ప్రకటించానని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి ఆస్తులు కూడగట్టుకోవడానికి రాలేదని, ప్రజలకు సేవకుడిగా పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. అధికారం ఉందనే అహంకారంతో పేదల భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ట్రస్ట్ భూములు, గుట్టలను ఆక్రమించుకోవడం అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఆస్తులను కాపాడటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యమని ఎమ్మెల్యే మేఘా రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సహకారంతో వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెడతామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికై అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 7 2023న ప్రభుత్వం ఏర్పాటు అయినా వెంటనే మొదటగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు మొదటి సంతకం చేసిందన్నారు. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటివరకు 30.29 కోట్ల రూపాయలు ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ధర చెల్లించడం జరిగింది అన్నారు. ఆరోగ్య భీమాను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని అదేవిధంగా జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు పై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వము విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, అల్పాహారం, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు 6000 మంది కొత్త టీచర్లకు నియామకం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో రూ. 207 కోట్ల వ్యయంతో 500 పడకల ఆసుపత్రి మంజూరీ చేసినట్లు చెప్పారు. ఐ.టి. టవర్, పాలిటెక్నిక్ కళాశాల భవనానికి పూర్వ వైభవం తీసుకురావడానికి 10 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో సి.సి రోడ్లు వేయడం జరిగిందని, మరో 30 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. త్వరలో వనపర్తి మహిళలకు డీజిల్ బంక్ మంజూరు కాబోతుందని, 546 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే మంజూరు అయ్యాయని, ప్లాట్లు లేని నిరుపేదలకు 1000 ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ప్రభుత్వానికి తాను ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా అన్ని పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పుర కౌన్సిలర్లు శరవంద, వెంకటేశ్వర్లు, పాకనాటి కృష్ణ, మురళి సాగర్, నిర్మలమ్మ, అయేషా సిద్ధిఖ, సౌమ్య, ధనలక్ష్మి, మున్సిపల్ కమిషనర్, మెప్మా, సానిటేషన్ ఇన్స్పెక్టర్, పలువురు పాల్గొన్నారు.
ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ బలమైన ప్రధానా: సిపిఐ వనపర్తి ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న నరేంద్ర మోడీ బలమైన ప్రధాని ఎలా అవుతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ ప్రశ్నించారు. బుధవారం రాత్రి జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతం అధ్యక్షతన వనపర్తి సిపిఐ ఆఫీసులో జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. దేశాన్ని పాలించిన గత ప్రధానులు 55 వేల లక్షల కోట్లు అప్పులు చేసి ఎన్నో ప్రాజెక్టులు, పరిశ్రమలు నిర్మించి ప్రజలకు ఉపాధి చూపించారన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో రెండు లక్షల 50 వేల లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఒక్క ప్రాజెక్టు పరిశ్రమ నిర్మించి యువతకు ప్రజలకు ఉపాధి కల్పించకపోగా, సామాన్యులపై పెట్రోలు డీజిల్ వంటగ్యాస్ వాణిజ సిలిండర్ల ధరలను పెంచారన్నారు. ఫలితంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారాయి అన్నారు. 2014 ముందు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారని అంతర్జాతీయ మార్కెట్లో ఆనాడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర108 డాలర్లు ఉండగా రూ. 65 కే లీటర్ పెట్రోల్ లభించింది అన్నారు. అయినప్పటికీఆనాడు బిజెపి ఆయనను బలహీనమైన ప్రధాని అని విమర్శించిందని, నేడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 98 డాలర్లు ఉందని కానీ పెట్రోల్ ధర మాత్రం రూ. 118 కి పెంచారన్నారు. ప్రజలపై భారం మోపిన నరేంద్ర మోడీ బలమైన ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. రష్యా చమురు తక్కువ ధరకు భారతదేశం కొంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొనవద్దని బెదిరిస్తే కొనటం లేదని, ఇతర దేశాల నుంచి ఎక్కువ ధరకు కొన్ని చమురు భారం ప్రజలపై మోపారని అలాంటప్పుడు మోదీ బలమైన ప్రధానిగా బిజెపి ప్రచారం చేయటం బూటకమన్నారు. దేశభక్తి, మత విశ్వాసాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేస్తున్నారని ప్రజలు గ్రహించి బిజెపికి బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని, రైతు భరోసా చెల్లించాలని, వరి మొక్కజొన్న పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లను రాజకీయాలకతీతంగా అర్హులకు ఇవ్వాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ కృష్ణవేణి గీత శ్రీరామ్ రమేష్ రాబర్ట్ మోష అబ్రహం కుతుబ్ గోపాల్ భరత్ నరసింహ శెట్టి తదితరులు పాల్గొన్నారు.
డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన వనపర్తి వనపర్తి శాసనసభ్యు తూడి మేఘారెడ్డితో బుధవారం వే టు న్యూస్ వారు ఏర్పాటుచేసిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కేవలం గంట వ్యవధిలో 158మంది కాల్స్ చేయగా అందులో 79కాల్స్ కి ఎమ్మెల్యే గారు సమాధానం ఇచ్చారు సమయం అయిపోయినందు వల్ల 79 కాల్స్ మిస్డ్ కాల్స్ గా మిగిలిపోయాయి ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు పలు రోడ్ల సమస్యలు విద్యుత్ సమస్యలు తాగునీటికి సంబంధించి పాటు పలు సమస్యలపై ప్రజలు నేరుగా ఎమ్మెల్యేతో మాట్లాడారు వారు పేర్కొన్న సమస్యలను ఎమ్మెల్యే గారు తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. గంట వ్యవధి పాటు నడిచిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యతిరేక పనులకు సంబంధించి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడం ఎమ్మెల్యే గారి పనితనానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వే టు న్యూస్ సంస్థ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు
అశాస్త్రీయ కనీస వేతనాల పెంపుపై పునాసమీక్షించాలి వనపర్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాల పెంపు హేతుబద్ధంగా లేదని అశాస్త్రియ వేతనాల పెంపు నిర్ణయం పున సమీక్షించి కార్మికులకు కనీస వేతనాలు 26 వేలకు పెంచాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి)రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ఎంసిఎచ్ ఆసుపత్రులలో విడివిడిగా పారిశుద్ధ్య,సెక్యూరిటీ,పేషంట్ కేర్,విభాగాల కార్మికుల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ:-తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడినగా 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాల పెంపు పట్ల హర్షంవ్యక్తం చేస్తున్నమని అయితే పెంచిన వేతనాలు ప్రజల ఆర్థిక కనీస అవసరాలు తీరే విధంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీస వేతన సలహా మండలి సిఫార్సులు ప్రభుత్వం బయట పెట్టాలని అన్నారు.కనీస వేతన మండలి సిఫార్సులు ప్రకారం అన్ స్కిల్డ్ కార్మికులకు 20వేల 250 రూపాయల నుండి పని నైపుణ్యం బట్టి నాలుగు కేటగిరీలగా 28 వేల వరకు కనీస వేతనాలు పెంపు నిర్ణయించాలని ఉన్నప్పటికీ సిఫార్సు అంశాలకు విరుద్ధంగా ఆశాస్త్రీయంగా వేతనాల పెంపు నిర్ణయం ఉన్నదని దీనితో కార్మికులు తీవ్రమైన ఆర్థిక నష్టంతో పాటు శ్రమ దోపిడికి గురి చేసే ద్వంద విధానాలు దాగి ఉన్నాయని విమర్శించారు. కనీస వేతనం 26 వేలకు పెంచాలని కార్మికులు కార్మిక సంఘాలు దశాబ్దం తరబడి అనేక ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తాజాగా పెంచిన కనీస వేతనాలతో కార్మికులకు పెద్దగా ఎలాంటి లబ్ధి చేకూరాదని అన్నారు. కనీస వేతనాలపై ఈనెల ఐదవ తేదీన వనపర్తి జిల్లా కేంద్రంలో సెమినార్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ కనీస వేతన మండలి బోర్డు సభ్యులు ఎం.డి యూసుఫ్, యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, ఇతర ముఖ్య అతిథులు, వక్తలుగా హాజరవుతున్నారని తెలిపారు. కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొని సెమినార్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులు గంధం శ్రీను, నరసింహ,లింగం శేట్టి, నరేందర్,అనిల్,రవి,శ్యాం, షాబాద్,మహేష్, ఆంజనేయులు,శ్రీహరి, అశోక్,ఆనంద్,కిషోర్, భరత్,కళావతి,ఇందిరా,పార్వతమ్మ, కవిత,భాగ్యమ్మ,సంతోష, మంజుల,పెంటమ్మ,నాని,లక్ష్మి ప్రమీల,రాములమ్మ,శ్వేత తదితరులు పాల్గొన్నారు.
బి.రాములును పరామర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి వనపర్తి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనపర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బి. రాములు ని మంగళవారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రాములు గారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. రాములు కి ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. రాములు గారు త్వరగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనే పరమావధిగా పనిచేస్తాం వనపర్తి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన కలలు కన్న స్వప్నాలను సాకారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి నిమిషం పనిచేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం వనపర్తి పట్టణం లోని మెడికల్ కళాశాల చౌరస్తాలో ఏర్పాటుచేసిన జయశంకర్ గారి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన ఎందరో యువకుల కుటుంబాలను సైతం గుర్తుంచుకొని వారికి చేదోడు వాదోడుగా నిలబడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు గత పాలకులు తెలంగాణ విప్లవగలం గద్దర్ గారిని ఎన్నో రకాలుగా అవమానపరిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కూతురు వెన్నెలమ్మకు సముచిత స్థానాన్ని కట్టబెట్టి గౌరవించుకుంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకొని జై తెలంగాణ అంటూ నిమదించిన శ్రీకాంతాచారి తల్లి గారికి మహిళా కమిషన్ సభ్యురాలుగా స్థానం కల్పించి గౌరవించుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన అందెశ్రీ గారిని ఎన్నో అవమానాల పాలు చేశారని అలాంటి అందర్శ్రీ గారు రాసిన గీతానికి నేడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ సుష్మాస్వరాజ్ గారు మీరా కుమారి గారు ఈ ముగ్గురమ్మల కృషితోన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల ఊబిగా మార్చేశారని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట కోసం తెలంగాణ తల్లిగా పేరుందిన సోనియా గాంధీ గారు ప్రకటిస్తే గత ప్రభుత్వ పాలనలోని కొందరు దొంగలు తామే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ప్రగల్బాలు పలుకుతున్నాడు విడ్డూరమని విమర్శించారు. సోనియా గాంధీ గారి కాళ్లు మొక్కిన నాయకులు నేడు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకుండా పదేళ్లు అవమానపరచారని ఆయన గుర్తు చేశారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారుల సంక్షేమం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఉద్యమకారులకు కావలసిన అంశాలపై దృష్టి సారించి పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవీరమే పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కదిరే రాములు వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు యువకులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు