జీవితాంతం గుర్తుంచుకుంటాం ఓటేసి రుణం తీర్చుకుంటాం వనపర్తి తాము ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నామని పూరి గుడిసెల్లో ఉంటూ, మట్టి మిద్దెల్లో ఉంటూ, రేకుల షెడ్డుల్లో ఉంటూ వర్షం కురుస్తున్న కవర్లు కప్పుకుని పిల్లలను తడవకుండా చూసుకున్న రోజులు నేడు గుర్తొస్తున్నాయి సార్ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు సోమవారం ఉదయం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కడుకుంట్ల గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించు కొని గృహప్రవేశాలు చేపట్టిన 22 మంది లబ్ధిదారుల ఇళ్ల గృహప్రవేశాలకు వెళ్లి వారికి నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలియజేశారు . ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తాము బాగుపడతామని భావించామన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్లను గ్రామాలలో కట్టించి ఇస్తారని పదేళ్లుగా కళ్ళల్లో వత్తులు వేసుకొనీ ఎదురు చూసామని వాపోయారు. అయినా ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు రాలేదని ఎన్నో హామీలు చెప్పిన నాయకులు నమ్ముకున్న ప్రజలను మోసం చేశారే తప్ప అండగా నిలువ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల లోనే ఈరోజు వరకు 50 ఇండ్లు మంజూరయ్యాయని అందులో 36 ఇల్లు పూర్తయ్యాయని, మరో 14 ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే గారు ప్రొసీడింగ్లులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడం నాడైనా నేడైనా కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని వచ్చే సంవత్సరం వరకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారని ఆయనను కలకాలం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారుల ఇల్లకు వెళ్లిన ఎమ్మెల్యే దంపతులకు నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలియజేశారు. తమ సొంత ఇంటి కల నెరవేర్చిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కి, రాష్ట్ర ముఖ్యమంత్రి కి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు . కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటేష్, వనపర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవికిరణ్, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
బస్వోజు సుధాకరాచారికి విశ్వకర్మ లెజండరీ అవార్డ్ వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు,కవి,రచయిత, వ్యాఖ్యాత బస్వోజు సుధాకరాచారికి విశ్వకర్మ లెజండరీ అవార్డు ప్రదానం చేసారు. ఆదివారం రాత్రి హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పదవ వార్షికోత్సవంలో నిర్వాహకులు ,కార్యక్రమ ముఖ్య అతిథులు హైదరాబాదు ఎ.సి.పి కిరణ్ కుమారు, వికారాబాదు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇడుకోజు వెంకటాచారి, సంస్థ వ్యవస్థాపకులు విశ్వనాథుల పుష్పగిరి తదితరుల చేతుల మీదుగా సుధాకరాచారి విశ్వకర్మ లెజండరీ అవార్డును అందుకున్నారు. సుధాకరాచారి ఉపాధ్యాయునిగా,పద్యకవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షునిగా విశేషమైన సేవలందిస్తున్నందుకు గాను నిర్వాహకులు అవార్డును ప్రదానం చేసారు. ఈ సందర్భంగా వారు సుధాకరాచారి పద్యరచనా వైభవాన్ని ప్రస్తుతిస్తూ పద్యానికి పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. సుధాకరాచారిని కవులు పండితులు,ఉపాధ్యాయులు పలువురు అభినందించారు.
మహిళాభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం వనపర్తి తెలంగాణ రాష్ట్రంలోని మహిళాల అభ్యున్నతే పరమావధిగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెబ్బేరు మండల కేంద్రంలోని సహారా ఫంక్షన్లో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి హాజరై మాట్లాడారు గత నియంత ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు సేవ చేసేందుకే తాను ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం ఫైల్ పైనే సంతకం చేశారని ఎమ్మెల్యే చెప్పారు. కేవలం వనపర్తి నియోజకవర్గంకు సంబంధించి ఇప్పటివరకు 30 కోట్ల 29 లక్షల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని ఆయన తెలిపారు రేషన్ కార్డులు లేక అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ కార్డులను అందజేస్తుందని కేవలం వనపర్తి నియోజకవర్గం లో 37,500 కొత్త రేషన్ కార్డులను ప్రజలకు అందజేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. రేషన్ కార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం పంపిన చేసిన బతుకమ్మ చీరలను మహిళలు ఏ ఒక్కరు ధరించలేదని కేవలం అవి వ్యవసాయ పొలాల్లో అడవి పందులు రాకుండా ఉండేందుకు కట్టుకునేందుకే పనికి వచ్చాయని ఆయన అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలు నాణ్యవంతంగా ఉండడంతో మహిళలు సంతోషంగా ధరించి వస్తున్నారని ఆయన అన్నారు. 200 రూపాయల ఉచిత కరెంటు ఇచ్చి నిరుపేదలకు కరెంటు కష్టాలు దూరం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలకు చైర్మన్లుగా, ఆర్టీసీ బస్సులకు ఓనర్లుగా, సోలార్ ప్లాంట్లకు ఓనర్లుగా, ఎన్నో రకాలుగా మహిళలను చైతన్యవంతం చేస్తూ వారి ఆర్థిక పురోభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సూపర్ మార్కెట్లు రైస్ మిల్లులు గోదాముల సైతం మహిళల నిర్వహణతో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేడు మహిళల గురించి నాడు ఏ ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వలేదని ఇంట్లో కూతుర్ని ఇబ్బందులు పెట్టేవారు రాష్ట్రంలోని మహిళలను ఏ విధంగా మంచిగా చూస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసి కళ్ళు మండుతున్నాయని కుళ్ళుకొని చేస్తున్నారని అలాంటివారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలే బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు, ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, పెబ్బేరు మండల అధ్యక్షుడు రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
వర్ష కాల పార్లమెంట్ సమావేశాలలో ఆర్డినెన్స్ ద్వారా ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహింపు తీసుకురావాలి వనపర్తి లక్షలాది మంది ఉపాధ్యాయులను ప్రభావితం చేస్తున్న టెట్ సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు విషయంలో వర్షకాల పార్లమెంట్ సమావేశాలలో ఆర్డినెన్స్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలలాధి ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలాలని పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా కేంద్ర ప్రభుత్వం ను కోరారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించిన సమీక్షా పిటిషన్‌పై గౌరవనీయ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఇటీవల తలెత్తిన పరిణామాలపై తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ తీర్పు, సంవత్సరాలుగా అంకితభావంతో, చిత్తశుద్ధితో పాఠశాలల్లో సేవలందిస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉపాధ్యాయులలో విస్తృత అసంతృప్తిని, తీవ్రమైన మనోవేదనను సృష్టించింది. ప్రస్తుత ఉపాధ్యాయులు, ప్రభుత్వ నియమాలు మరియు నోటిఫికేషన్ల ప్రకారం సమర్థ అధికారులచే నిర్వహించబడిన సరైన ప్రక్రియను అనుసరించి నియమించబడ్డారు. వారిలో చాలామంది తమ జీవితంలోని అత్యంత కీలకమైన సంవత్సరాలను విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, గ్రామీణ, పట్టణ మరియు వెనుకబడిన ప్రాంతాలలోని విద్యార్థులకు సమానంగా సేవ చేయడానికి అంకితం చేశారు.లక్షలాది మంది ఉపాధ్యాయులు సంవత్సరాల తరబడి సేవ చేసినప్పటికీ, ప్రస్తుత చట్టపరమైన పరిస్థితి కారణంగా పూడ్చలేని నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. వారి సేవా నిబంధనల చుట్టూ నెలకొన్న ఆకస్మిక అనిశ్చితి, పాఠశాలల పనితీరును మరియు మొత్తం విద్యా వాతావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య మానవతా మరియు పరిపాలనా స్వభావం కలది, అందువల్ల దీనికి ప్రభుత్వం నుండి తక్షణ జోక్యం అవసరం. గతంలో ఇలాంటి పరిస్థితులను, ఉద్యోగులను రక్షించడానికి మరియు సంస్థాగత స్థిరత్వాన్ని కాపాడటానికి విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శాసనపరమైన చర్యల ద్వారా పరిష్కరించడం జరిగిందని శంకర్ గౌడ్ అన్నారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో తగిన ఆర్డినెన్స్ లేదా శాసన సవరణను తీసుకురావడం ద్వారా ప్రభావిత ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరతున్నాము. అటువంటి చర్య విద్యా రంగంలో కొనసాగింపు మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తూనే ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడుతుంది. ఉపాధ్యాయ వర్గం యొక్క ఆందోళనల పట్ల సున్నితంగా ఉండే ప్రభుత్వం, ఈ విషయంలో కరుణతో మరియు నిశ్చయంగా వ్యవహరిస్తుందని విశ్వసిస్తున్నాము. ఉపాధ్యాయ వృత్తి ఎల్లప్పుడూ దేశ నిర్మాణానికి కట్టుబడి ఉంది మరియు వారికి న్యాయం, భద్రత లభించాలి. అయితే, లక్షలాది మంది బాధిత ఉపాధ్యాయులకు సకాలంలో ఉపశమనం కల్పించకపోతే, వారు తమ హక్కులు మరియు జీవనోపాధిని కొల్పోవల్సివస్తుంధి. కావున కేంద్ర ప్రభుత్వం వచే పార్లమెంట్ సమావేశాలలో ఆర్డినెన్స్ ద్వారా లక్షల మంది ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహింపు తీసుకురావాలి అన్నీ కోరుతున్నాము.
అమ్మాయిలు బాల్య వివాహాలను వ్యతిరేకించాలి.. రక్తహీనతపై అవగాహన కలిగి ఉండాలి వనపర్తి అమ్మాయిలు బాల్యవివాహాలను వ్యతిరేకిస్తూ, సమాజంలో అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహా (కిషోర బాలికల సంఘాలు)కు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బాలికలు ప్రధాన మంత్రి, స్పీకర్, ఎంపీల పాత్రలను ఎంతో ఉత్సాహంగా పోషిస్తూ పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించారు. మహిళా సంక్షేమం, మహిళల ఆరోగ్యం, అభివృద్ధి, వరి కొనుగోలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సామాజిక అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ కిషోర బాలికల కోసం ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. సమాజంలో ఐక్యత చాలా ముఖ్యమని, బాలికల కోసం మాక్ పార్లమెంట్ నిర్వహించడం మంచి సాధనగా అభివర్ణించారు. సమావేశంలో విద్యార్థినులు మహిళల్లో రక్తహీనత, సమాజంలో జరుగుతున్న పలు సమస్యలపై ప్రశ్నలు అడగడం అభినందనీయమని అన్నారు. పార్లమెంట్‌లో చర్చించినట్లుగా ప్రతి ఒక్కరూ రక్తహీనత పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంగా మరియు బలంగా ఉండాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా స్ఫూర్తి పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, వాటిపై గళం వినిపించాలని అన్నారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. గత మూడు సంవత్సరాల్లో జిల్లాలో 60 బాల్య వివాహాలు జరిగినట్లు తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహ సమాచారం తెలిసినా వెంటనే 1098 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని కోరారు. విద్యార్థినులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ బాలికలు మధ్యలో చదువులు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. బాలికలకు విద్యనే అత్యంత ప్రాధాన్యత కావాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను సాధించాలని అన్నారు. ప్రస్తుత కాలంలో బాలికలకు అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని అవగాహనతో అధిగమించాలని సూచించారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ పోక్సో చట్టంపై అవగాహన ఉండాలని తెలిపారు. ప్రతి విషయాన్ని ప్రశ్నించే అలవాటు పెంపొందించుకోవాలని, ఏ రంగంలో ఉన్నా ఉత్తమ స్థానాన్ని సాధించాలని అన్నారు. అలాగే అవసరమైన సందర్భాల్లో ధైర్యంగా “నో” చెప్పే అలవాటు కూడా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్ చెక్కులను, ఎఫ్ పి ఓ సంఘాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా బాలికల సంరక్షణకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో డిఆర్డిఓ ఉమాదేవి, డీఎస్పీ బాలాజీ నాయక్, డి సి ఓ రాణి, డి ఐ ఓ జ్యోతి, డి డబ్ల్యు ఓ సుధారాణి, డిఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి, డి ఐ ఈ ఓ నరేంద్ర, కేజీబీవీ అధికారిని, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, విద్యార్థులు, స్నేహ సంఘాల బాలికలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వేగంగా అడ్మిషన్లు పొందుతున్న వనపర్తి పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పొంది చదువుకోవడం వల్ల కలిగే లాభాల గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరిన విద్యార్థికి అడ్మిషన్ ఫీజు లేకుండా అడ్మిషన్ పొందడం, ఉచిత విద్య, స్కాలర్షిప్స్, ఉచిత పుస్తకాలు, ఈ సంవత్సరం నుండి మిడ్ డే మీల్స్ జూన్ నెల 12వ తారీఖున మొదట విడతగా 64 కళాశాలలో ప్రారంభమవుతుందని, నెల చివరి వరకు అన్ని కళాశాలలో టిఫిన్ తో పాటు మిడ్ డే మిల్స్ స్టార్ట్ అవుతుందని, విద్యార్థులపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, ఇతర సౌకర్యాలు విద్యార్థులు పొందాలని సూచిస్తూ, కళాశాలలో చదివిన విద్యార్థులు మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారని ప్రవేటు కళాశాల దీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు నిలుస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ, పెబ్బేరు ప్రభుత్వ కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు సి కృష్ణయ్య , పెబ్బేరు ఎస్సీ వాడలో ఇంటింటి ప్రచారం చేస్తూ, పదో తరగతి పాసైన విద్యార్థుల అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది.
వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటా వనపర్తి వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఆడపడుచుకు నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మహిళా వారోత్సవాల కార్యక్రమంలో మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో శాసన సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికై అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 7 2023న ప్రభుత్వం ఏర్పాటు అయినా వెంటనే మొదటగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు మొదటి సంతకం చేసిందన్నారు. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటివరకు 30.29 కోట్ల రూపాయలు ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ధర చెల్లించడం జరిగింది అన్నారు. ఆరోగ్య భీమాను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని అదేవిధంగా జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు పై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వము విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, అల్పాహారం, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు 6000 మంది కొత్త టీచర్లకు నియామకం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్లు చెప్పారు జిల్లాలో రూ. 207 కోట్ల వ్యయంతో 500 పడకల ఆసుపత్రి మంజూరీ చేసినట్లు చెప్పారు. ఐ.టి. టవర్, పాలిటెక్నిక్ కళాశాల భవనానికి పూర్వ వైభవం తీసుకురావడానికి 10 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో సి.సి రోడ్లు వేయడం జరిగిందని, మరో 30 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అందుకే ఏ సంక్షేమ పథకం అయినా మహిళలే ప్రాతినిధ్యం వహించే విధంగా రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. త్వరలో వనపర్తి మహిళలకు డీజిల్ బంక్ మంజూరు కాబోతుందని, 546 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే మంజూరు అయ్యాయని, ప్లాట్లు లేని నిరుపేదలకు 1000 ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ప్రభుత్వానికి తాను ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా అన్ని పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ గృహ ప్రవేశానికి తన స్వంత డబ్బులతో లబ్ధిదారులకు పట్టు బట్టలు పెట్టీ గృహ ప్రవేశం చేయిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మహిళలకు సూపర్ మార్కెట్, రైస్ మిల్లు, గోదాములు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం శాసన సభ్యుల చేతుల మీదుగా మహిళా సంఘాల సభ్యులకు రూ. 3.40 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్కును, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో వనపర్తి జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ కిమ్యానాయక్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కదిరి రాములు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్లు, ఎన్ ఎస్ యు ఐ అనుబంధ సంఘాల నాయకులు, మహిళల యువకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
తెలంగాణ వైతాళికులు,,బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం వనపర్తి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి మొట్టమొదటి ఎం. ఎల్.ఏ సురవరం ప్రతాప్ రెడ్డి గారి 130వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో నిష్ణాతులు,తెలుగు భాష పరిరక్షకుడు, సంఘ సంస్కర్త,సాహితీవేత్త, న్యాయవాది సురవరం.ప్రతాప్ రెడ్డి గారు అని కొనియాడారు. సురవరం గారి జీవిత చరిత్ర సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమములో సాహితీ వేత్తలు,బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా సురవరం జయంతి ఉత్సవాలు వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సురవరం.ప్రతాప్ రెడ్డి 130జయంతి ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దాచ.సులోచనమ్మ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబడ్డాయి. జ్యోతి ప్రజ్వలన చేసిన గౌరవ నిరంజన్ రెడ్డి సభను ప్రారంభించారు. ముఖ్యతిదులుగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,సాగునీటి రంగనిపుణులు వి.ప్రకాష్, గన్నమరాజు.గిరిజా మనోహర్ బాబు,తంగెళ్ల.శ్రీదేవి రెడ్డి పాల్గొన్నారు. స్వాగత ఉపన్యాసకులు కె.వీరయ్య,సభా పరిచయం పలుస.శంకర్ గౌడ్ చేయగా వ్యాఖ్యాతగా బైరోజు.చంద్రశేఖర్ ఉన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి మేధావి సాహితీవేత్త న్యాయవాది తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు అని అన్ని రంగాలలో నిష్ణాతులు వారని కొనియాడారు. సాగునీటి నిపుణులు ప్రకాష్ గారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు సవివరంగా వివరించారు. బి.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రాథమిక హక్కులు అంశంపై మాట్లాడుతారు. మనోహర్ బాబు గారు సురవరం.ప్రతాప్ రెడ్డి గారి జీవిత విశేషాలు తెలిపారు. తంగెళ్ల.శ్రీదేవి రెడ్డి మహిళా సాధికారిత అంశంపై మాట్లాడారు. ప్రారంభం నుండి తెలంగాణ సాధించే వరకు జరిగిన పరిణామాలు కె.సి.ఆర్ హయాములో కొనసాగిన సంక్షేమం తదితర అంశాలపై స్వయంగా రాసిన వ్యాసాల కూర్పును పుస్తక రూపములో తెచ్చిన సాహితీవేత్తలు ముఖ్య అతిథుల చేత ఆవిష్కరింప చేశారు.ఈ కార్యక్రమములో సాహితీవేత్తలు,మహిళా రచయితలు,బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మల్లయ్య దేవుడి పండగ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనపర్తి పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో గురువారం ప్రారంభమైన మల్లయ్య దేవుడి పండగల కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మల్లయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో నిర్వహించుకునే ఇలాంటి పండగల ద్వారా గ్రామస్తుల మధ్య ఐక్యత నెలకొంటుందని, ఇలాంటి పండుగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాపర్ల రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ అరుణ జయపాల్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు