నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వనపర్తి ఖిల్లా ఘణపురం మండలం సల్కేలాపురం గ్రామానికి చెందిన గొల్ల చెన్నయ్య గారి కుమారుడు శ్రీకాంత్ యాదవ్ వివాహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయంలో వివాహ మహోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పెద్దల సమక్షంలో జరిగే వివాహ వేడుకలు కలకాలం అన్యోన్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వనపర్తి ఖిల్లా ఘణపురం మండలం సల్కేలాపురం గ్రామానికి చెందిన గొల్ల చెన్నయ్య గారి కుమారుడు శ్రీకాంత్ యాదవ్ వివాహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయంలో వివాహ మహోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పెద్దల సమక్షంలో జరిగే వివాహ వేడుకలు కలకాలం అన్యోన్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీల పోరాటం
నాగర్ కర్నూల్ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు పోరాటం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి పేర్కొన్నారు. నేపాల్ లో జెఎన్ జీ ఉద్యమం. తమిళనాడులో టీవీకే అధికారంలోకి రావడాన్ని గమనిస్తే తెలంగాణలోనూ మెజారిటీ ప్రజలైన బీసీలు పోరాడితే 2029లో అధికారం దక్కడం ఖాయమని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి బుధవారం రోజున ఒక ప్రకటనలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపా, భరాస పార్టీలు సామాజిక న్యాయం పాటించడం లేదని, బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం లేదని పేర్కొన్నారు. జనగణనలో బీసీ కుల గణన చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహిళా బిల్లుల్లో బీసీలకు సబ్ కోటా పెట్టకుండా 40 కోట్ల మంది బీసీ మహిళలను భాజపా అవమానించిందని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ అన్నారు.
రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీల పోరాటం Read More »
రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు
రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు వనపర్తి రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తో మాట్లాడిన డిసిసి చీఫ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిఐకెపి సెంటర్స్, దళారులు తరువు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని రైతులు శివసేన రెడ్డికి విన్నవించారు.వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి చరవాణి ద్వారా సమాచారాన్ని చేరవేసి.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిందిగా కోరడమైనది. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తుంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్ణీతమైన తేమ శాతం ప్రకారం కొనుగోలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేయాలని అధికారులకు సూచించారు. దళారులు మోసం చేసిన రైతులకు తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అందుకు ముందస్తు ప్రణాళికలతో కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తనతకుండా చూడాలని తెలిపారు.
రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు Read More »
రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీల పోరాటం Veta News Wanaparthy : బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారిరాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు పోరాటం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి పేర్కొన్నారు. నేపాల్ లో జెఎన్ జీ ఉద్యమం. తమిళనాడులో టీవీకే అధికారంలోకి రావడాన్ని గమనిస్తే తెలంగాణలోనూ మెజారిటీ ప్రజలైన బీసీలు పోరాడితే 2029లో అధికారం దక్కడం ఖాయమని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి బుధవారం రోజున ఒక ప్రకటనలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపా, భరాస పార్టీలు సామాజిక న్యాయం పాటించడం లేదని, బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం లేదని పేర్కొన్నారు. జనగణనలో బీసీ కుల గణన చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహిళా బిల్లుల్లో బీసీలకు సబ్ కోటా పెట్టకుండా 40 కోట్ల మంది బీసీ మహిళలను భాజపా అవమానించిందని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ అన్నారు
Grow commercial crops and get maximum profits
వాణిజ్య పంటలను సాగు చేసి అత్యధికంగా లాభాలు పొందండి వనపర్తి వనపర్తి :: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం స్థానిక దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా ఉద్యానవనాలు , పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల మార్పిడిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో పాటు ప్రణాళికా సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ 140 కోట్ల మంది జనాభా కలిగిన భారత దేశంలో ప్రజలకు అవసరమైన మేరకు ఆయిల్ గింజలు, పప్పు దినుసులు లేవని వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొవటానికి మన ఫోరెన్సిక్ నిల్వలు బయటి దేశాలకు వెళ్లి పోతున్నాయని చెప్పారు. అందుకే మన దేశంలోనే ఆయిల్ గింజలు సాగు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. నూనె గింజల్లో అత్యధికంగా ఆయిల్ వచ్చే పంట కేవలం పామాయిల్ పంటకే ఉందని, అత్యధికంగా లాభసాటి పంట ఏదైనా ఉందంటే అది పామాయిల్ పంట అని కొనియాడారు. అందుకే రైతులు వరి పంట కాకుండా పామాయిల్, పప్పు గింజలు, కూరగాయల వైపు దృష్టి మళ్లించాలని సూచించారు. తన 90 ఎకరాల పొలంలో 75 ఎకరాలు పామాయిల్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం మొక్కకు సబ్సిడీ నుంచి ఎరువులు, డ్రిప్, గుంతలు తవ్వడానికి, 4 సంవత్సరాల పాటు అంతర్ పంట సాగుకు సైతం ప్రభుత్వం సబ్సిడీనిస్తుందని అన్నారు. రైతులు పామాయిల్ పంట సాగు చేసి దాదాపు 30 సంవత్సరాల పాటు అత్యధికంగా లాభాలు పొందాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ రైతులు తమ భూములను సారవంతంగా ఉంచుకొని వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు అవగాహన కల్పించడానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రైతు భూ సారా కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు రైతు ఉత్పత్తిదారుల సంస్థ (Former Producer Organisation) లో సభ్యత్వం తీసుకోవాలని తద్వార కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే అనేక పథకాలకు అర్హత సాధిస్తారని సూచించారు. అదేవిధంగా ప్రతి రైతు కిసాన్ క్రెడిట్ కార్డు పొందటం, సహకార సంఘంలో సభ్యత్వం తీసుకోవడం వంటివి చేయాలని చెప్పారు. పామాయిల్ పంట వేసుకునేందుందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి పామాయిల్ సాగు చేస్తున్న రైతుల వద్దకు తీసుకువెళ్లి అవగాహన కల్పిస్తామని చెప్పారు. రైతులు వరి మాత్రమే కాకుండా ఇతర పంటల సాగు వైపు దృష్టి సారించాలని కోరారు. రైతు కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, ప్రత్యేక నోడల్ అధికారి ప్రసాద్ రావు, మాజీ జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ కృపాకర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి, వీణా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయ్ భాస్కర్, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.
Grow commercial crops and get maximum profits Read More »
అన్నదాతలకు అధైర్యం వద్దు
వనపర్తి అన్నదాతలు ఎవరు కూడా అధైర్య పడరాదని, వారు సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శ్రీరంగాపూర్ , పెబ్బేరు మార్కెట్ యార్డులో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించవచ్చునని దళారుల మాటలు నమ్మే మోసపోకూడదు అని ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రానివ్వకుండా నిర్వాహకులు ప్రత్యేక దృష్టి దృష్టి సారించాలన్నారు.ధాన్యాన్ని విక్రయించిన అన్నదాతల పేర్లను వెంటనే నమోదు చేయాలని వారికి ధాన్యం విక్రయ సొమ్మును వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన వారికి సూచించారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, పెబ్బేరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు, శ్రీరంగాపురం మండల నాయకులు శ్రీహరి రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
అన్నదాతలకు అధైర్యం వద్దు Read More »
పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై జూన్ నాటికి నిర్ణయం
cfg vvvv vహైదరాబాద్, మే 2 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఫిట్‌మెంట్‌పై జూన్ నాటికి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తక్షణమే పీఆర్సీ నివేదిక అందించాలని అధికారుల కమిటీని ఆదేశించారు. శనివారం తన నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను చాలా వరకు పరిష్కరించామన్నారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. పీఆర్సీ సహా నాలుగు అంశాలపై స్పష్టత ఇచ్చిన సీఎం.. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులను జూన్ 1లోగా అందజేస్తామన్నారు. పదవీ విరమణ చేసిన
పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై జూన్ నాటికి నిర్ణయం Read More »
ప్రజల నెత్తిన బిజెపి గ్యాస్ బండ.. తక్షణం ఉపసంహరించాలి: సిపిఐ
వనపర్తి వాణిజ్య సిలిండర్ ధరను రూ. 993 కు పెంచి వినియోగదారుల బిజెపి పాణిజ్య గ్యాస్ బండ వేసిందని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ విమర్శించారు. శనివారం సిపిఐ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. 19 కిలోల సిలిండర్ రూ. 2321 ఉండేదని ఏకంగా రూ. 993 పెంచడంతో రూ. 3315కు పెరిగిందన్నారు. ఒకేసారి సిలిండర్ పై ఇంత ధర పెంపు బిజెపి పాలనలోనే జరిగిందన్నారు. ఇది పరోక్షంగా ప్రజలపైనే భారం పడుతుందన్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఉపయోగించి హోటల్లు రెస్టారెంట్లు టీ దుకాణాల తినుబండారాలు తయారు చేస్తారని, గ్యాస్ ధరపించడంతో వాటి రేట్లు అమాంతం పెంచేసి అవకాశం ఉందన్నారు. వనపర్తి జిల్లాలో మామూలు హోటల్లో అధికంగా ఉంటాయని ఎక్కువమంది గ్యాస్ ను ఉపయోగిస్తారని వారు తయారు చేసే ఉత్పత్తులపై ధర పెంచుతారు అన్నారు. ఈ ధర రూ. 10 ఉందని అమాంతము 15కి పెరిగే అవకాశం ఉందన్నారు. టిఫిన్లు ధరలు రూ. 50 నుంచి 60 ఉన్నాయని రూ. 80 కి పెంచే అవకాశం ఉందన్నారు. తన ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఆసుపత్రులకు వెళ్లేవారు అనివార్యంగా ఓటర్లు రెస్టారెంట్ లోనే భోజనం టిఫిన్ చేయాల్సి వస్తుందని వారందరిపై భారం పడుతుందన్నారు. బిజెపి చెప్పే మాటలకు చేతలకు పొంతనలేదన్నారు. పెంచటం లేదంటూనే ధరలు పెంచుతూ సామాన్యులను నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ సరఫరా లో కేంద్ర విఫలమైందని వాడి ధరలు కూడా పెంచే ఆలోచనలో ఉందన్నారు. వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు కూడా ఎంతో దూరంలో లేదన్నారు. ధరలు పెంచమంటూనే పెంచి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను సమీకరించి ప్రతిఘటించి తీరుతామన్నారు. పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తక్షణం రూ. 2215 కు తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, సీనియర్ నేత పృథ్వినాదం, శేఖర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల నెత్తిన బిజెపి గ్యాస్ బండ.. తక్షణం ఉపసంహరించాలి: సిపిఐ Read More »
ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివి
వనపర్తి ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివని, రెండింటిని సమానంగా ముందుకు తీసుకుపోవడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జెడ్పి సీఈవో యాదయ్య, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కార్యక్రమానికి ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధి పొందుతున్న వారి వివరాలను తెలియజేసారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణ మాఫీ పథకం ద్వారా 29,455 మంది రైతులకు రూ. 201 కోట్ల లబ్ది చేకూర్చడం జరిగింది అన్నారు. రైతు భరోసా కింద 83,964 మంది రైతులకు రూ. 91 కోట్ల పెట్టుబడి సాయం అందించమన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 26,678 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ. 286 కోట్లు వారి ఖాతాల్లో వేసినట్లు తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో 74,846 రేషన్ కార్డులు ఉండగా వాటిలో 35,837 కార్డులు ప్రజా ప్రభుత్వం లో కొత్తగా జారీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గం లో 30,812 లబ్ధిదారులకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించి కరెంటు బిల్లుల భారం తగ్గించిందాన్నారు. అదేవిధంగా నియోజకవర్గం లో మొత్తం 3978 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంతం ఇంటి కల నెరవేర్చమన్నారు. కార్యక్రమం లో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, పెబ్బేరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, సిపిఓ హరికృష్ణ, డిఆర్డిఓ ఉమాదేవి, జిల్లా స్థాయి అధికారులు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివి Read More »

