VETA NEWS MEDIA

2026-06-20
Offcanvas
Edit Template

అన్నదాతలను అగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదు వనపర్తి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బి.ఆర్.ఎస్ శ్రేణులతో కలసి వరి,మొక్కజొన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రాలు తాళ్ళ చెరువు,చినగుంటపల్లి,గోపాల్ పేట మరియు వనపర్తి మార్కెట్ యార్డును సందర్శించి రైతుల గోడు విని మార్కెట్ యార్డులో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నెలల తరబడి వేచి చూస్తున్న రైతులను ముప్పతిప్పలు పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. ప్రతిగింజ కొంటాం అన్న మంత్రుల,అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యినాయని విమర్శించారు. రైతుబంధు ఇవ్వకున్న,కరెంటు కోతలు ఉన్నా, సాగునీరు ఇవ్వకున్నా అష్టకష్టాలు పడి పండించిన వరి మొక్కజొన్న ధాన్యములను కొనకుండా రైతులను హరిగోసలు పెడుతున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని హెచ్చరించారు. ట్రాన్స్పోర్టు,హమాలీల కొరత,గన్ని బ్యాగుల కొరత తీర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. యాసంగి పంటలో ఎటువంటి తరుగు ఉండదని తెలిసి కూడా క్వింటాలుకు 10కిలోల తరుగు తీస్తూ రైతులను జలగల లాగ మిల్లర్లు, అధికారులు కుమ్మకై దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం యాసంగిలో రైతులు 65లక్షల 45వేల ఎకరాలలో వరి సాగు చేశారని 1కోటి 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం ఉన్నప్పటికీ కేవలం 15,16లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. మొక్కజొన్న పంటను 16లక్షల 46వేల ఎకరాల లో సాగు జరిగిందని వర్షాభావం వల్ల రైతులు మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇచ్చారని ఎక్కడ చూసినా మొక్కజొన్న కుప్పలు కుప్పలుగా రాశులు కనిపిస్తున్నాయని నేటికి ఒక్క క్వింటాలు మొక్కజొన్న కొనుగోలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. కె.సి.ఆర్ హయాములో రైతులకు సకాలములో యూరియా ,కరెంట్,సాగునీరు అందించి మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతులు వైభోగంగా గ్రామాలలో బొడ్రాయి,పెద్దమ్మ పండుగలు నిర్వహించుకుని సౌభాగ్యంగా ఉన్నారని కొనియాడారు. కనీసం యూరియా అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. అన్నదాతలను అగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వరి మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు లేని పక్షములో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,కె.మాణిక్యం,భాను ప్రకాష్,రఘువర్ధన్ రెడ్డి,రవిప్రకాష్ రెడ్డి,గంధం.పరంజ్యోతి, కౌన్సిలర్స్ మురళీ సాగర్ శ్రీకర్ గౌడ్,సర్పంచు కె. స్వప్న భాస్కర్,బి.బాలరాజు,తిరుపతయ్య, ధర్మా నాయక్, హేమంత్ ముదిరాజ్, వెంకట్ సాగర్,జోహెబ్ హుస్సేన్, మహేశ్వర్ రెడ్డి,చిట్యాల.రాము,మంద రాము, అనుపటి రాము,పోతులపల్లి.రాజు,నందిమల్ల. రమేష్ కవితా నాయక్,నీలస్వామి,గులాం ఖాదర్ ఖాన్,హరీఫ్,ఏ. కే.పాషా తదితరులు ఉన్నారు.

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి ఖిల్లా ఘనపూర్ మండలం వెనకీ తండాలో జరిగిన మోహన్ నాయక్ జ్యోతివివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఘనపూర్ మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శేఖర్ గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి గృహం సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి గారి వెంట మండల పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య , మాజీ ఏఎంసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్, మాజీ జెడ్పిటిసి సామ్యా నాయక్, సర్పంచులు రాజు నాయక్, నాగయ్య, భరత్ నాయక్, శంకర్ గౌడ్, చెన్నయ్య, లక్ష్మయ్య, ఆంజనేయులు గౌడ్, గోపాల్, పోలిశెట్టి ప్రతాప్, మల్లేష్, మాధవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి వనపర్తి మండలం రాజపేట పాపే తండాకు చెందిన, వశరాం కుమారుడు కాట్రావత్ సురేష్ – మనీష ల వివాహ కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖశాంతులతో, ఆనందంగా, ఐశ్వర్యాలతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, నాయకులు మాధవరెడ్డి, సర్పంచ్ ఎల్లయ్య, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యా సంవత్సరం ఇంటర్ యధావిధి అడ్మిషన్లు సీఎం ప్రకటన పట్ల వనపర్తి ప్రభుత్వ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం -475 హర్షం వనపర్తి ఈ విద్యా సంవత్సరం ఇంటర్ యధావిధి అడ్మిషన్లు సీఎం ప్రకటన పట్ల వనపర్తి ప్రభుత్వ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం -475 హర్షం ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల అడ్మిషన్లు గత సంవత్సరం మాదిరిగా యధావిధిగా కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మాత్యులు, రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల వనపర్తి జిల్లా ప్రభుత్వ గజిటెడ్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. 10 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యభవిష్యత్తు నిర్ణయంపై ఎలాంటి ఆలోచన చేయకుండా ఇంటర్ విద్య విలీనంపై తొందరపడవద్దని భాగస్వామ్య పక్షాలతో మేధావులతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ విద్యా సంవత్సరంలో యధావిధిగా గత సంవత్సరం మాదిరిగా అడ్మిషన్ నిర్వహించాలని తమ సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని వనపర్తి జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య కార్యదర్శి వెంకటరెడ్డి తెలియజేస్తూ, విద్యార్థుల డ్రాప్స్ కి కారణం ఇంటర్ విలీన మార్గం ఒక్కటే కాదని ,తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క ఆలోచన, ఆర్థిక ,సామాజిక కారణాలు అనేకం ఉన్నాయని వీటి గురించి చర్చించకుండా ఇంటర్ విలీనమే అన్ని సమస్యలకు మార్గమని చెప్పటం ఏకపక్షంగా ఉంటుందని తెలియజేస్తూ ,సీబీఎస్సీ చదువుతున్న స్కూల్లో టెన్త్ తర్వాత 11 వచ్చే ముందు డ్రాప్స్ ఉందో లేదో ఒక సర్వే నిర్వహించాలని కోరారు. అదేవిధంగా సిబిఎస్ స్కూల్ అనేవి మధ్యతరగతి పై వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని , గ్రామప్రాంత విద్యార్థులకు సీబీఎస్సీ స్కూల్స్ , సిలబస్ అందుబాటులో ఉండకపోవటంతోపాటు ఆ సంస్కృతి, సిలబస్ తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరి కాదని తెలిపారు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో రాష్ట్ర పరిధిలో ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సాధించడానికి సరైన మార్గం అవలంబించాలని అవసరమైతే విద్యార్థులు మేధావులతో చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని అప్పిలు చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి విద్యార్థులు ,తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళన గమనించి యధావిధిగా ఇంటర్ అడ్మిషన్లకు అనుమతించడం పట్ల మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా అధికారుల కొంతమంది ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారని ,అదేవిధంగా ఇంటర్ విద్యలో ఒక్క సంఘాన్నే ప్రోత్సహించకూడదని, మెజార్టీ సభ్యులతో కూడిన సంఘాలు కూడా ఉన్న విషయాన్ని ప్రభుత్వం, అధికారులు గమనించాలని కోరారు. ఈ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు సంఘాల యొక్క ఆందోళన ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు చాలా సహకరించాయని వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వనపర్తి జిల్లా తెలంగాణ ప్రభుత్వ గజిటెడ్ అధ్యాపకుల సంఘం 475 , అధ్యక్షులు సి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి తెలిపారు.

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల వనపర్తి శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారి కుమారుడు అజిత్ రెడ్డి వివాహం లక్ష్మి సౌజన్యతో హైటెక్స్ లో ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ శుభకార్యానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు ఎల్.రమణ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి నూతన వధూవరులకు ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ఘనంగా గ్రామదేవతల పండగ పూజలు చేసిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి గ్రామదేవతల పండుగలు గ్రామస్తుల మధ్యన ఐక్యతను పెంపొందిస్తాయని ఈ పండగలు గ్రామస్తుల ఐక్యతను చెబుతాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా గ్రంధాలయాల అధ్యక్షులు గోవర్ధన్ సాగర్ ఆహ్వానం మేరకు పాన్గల్ మండలం మందాపురం గ్రామంలో నిర్వహించిన నాభి శిల పున ప్రతిష్ట కార్యక్రమానికి వారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బండలాగుడు పోటీలకు ఒక ప్రత్యేకత ఉంటుందని ఈ పోటీల్లో పోటీపడే వృషభరాజాలను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారని వృషభరాజాలపై మక్కువ ఉన్న రైతులు మాత్రమే ఇలాంటి పోటీలలో పాల్గొంటారని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మహిళలు యువకులు గ్రామ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Read More »

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు కొంటాం – రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వనపర్తి రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆదివారం అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, సివిల్ సప్లై అధికారి, వ్యవసాయ, కోపరేటివ్, తహసీల్దార్లు, మిల్లర్లు, ఐ. కె.పి. సహకార సంఘాల వడ్లు కొనుగోలు కేంద్రాల సభ్యులతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించి వరి కొనులు ప్రక్రియను సమీక్షించారు. రైస్ మిల్లులో ధాన్యం త్వరగా దించుకోకుండా రోజుల తరబడి లారీలు ఆగిపోవడం, కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయకపోవడం పై వివరాలు అడిగారు. లారీల్లో తెచ్చిన వడ్లు నాణ్యత లేవని, తాలు, చెత్త ఎక్కువగా ఉండటం వల్ల ఎఫ్.సి.ఐ కి నాణ్యమైన బియ్యం తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, అందుకే రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నట్లు మిల్లర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ రైతులు సైతం సహకరించి తూర్పారబట్టిన వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని నాణ్యమైన వడ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోలు చేసి డబ్బులు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేయడంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్లు వచ్చిన లారీలను త్వరగా ఖాళీ చేసి పంపించాలని, రోజుల తరబడి మిల్లుల వద్ద ధాన్యం లారీలు పెట్టుకోవద్దని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, అకాల వర్షాలు ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి రబీ కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, సివిల్ సప్లై అధికారి కాశి విశ్వనాథ్, డి.సి.ఓ రాణి, తహసీల్దార్లు, మిల్లర్లు, ఐ.కే.పి, సహకార సంఘం కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More »

ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి వనపర్తి పెబ్బేరు మండలం తోమాలపల్లి శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని దేవతా మూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి సన్మానించారు అనంతరం వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ధ్వజస్తంభ,బొడ్రాయి స్థాపనలతో గ్రామ ప్రజలు ఐక్యతగా మెలిగి సుఖసంతోషాలతో, సౌభాగ్యంగా ఉంటారని అన్నారు. మాజీ మంత్రి వెంట బి.ఆర్.ఎస్ నాయకులు,ఆహ్వాన కమిటీ సభ్యులు ఉన్నారు.

Read More »

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మారథాన్ కార్యక్రమం వనపర్తి జనగణన 2027 లో భాగంగా ప్రజలు స్వీయ గణన (Self Enumeration) ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మారథాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. బాలుర జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన మారథాన్ పాలిటెక్నిక్ కళాశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కారణంగా 2021 లో నిర్వహించాల్సిన జనగణన ప్రక్రియ ఆలస్యమైందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా డిజిటల్ విధానంలో జనగణన చేపడుతున్నట్లు తెలిపారు. మే 11 నుండి జూన్ 10 వరకు జిల్లాలో సుమారు 13 వేల మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొని వివరాలు సేకరిస్తారని చెప్పారు. ప్రజలు స్వీయ గణన (Self Enumeration) ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. సరైన సమాచారం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. ప్రజల వివరాలు పథకాల నమోదులో ఎక్కడ వినియోగించడం జరగదని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు తెలియజేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జనగణన విజయవంతానికి మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఎస్పి గిరిబాబు, సిపిఓ హరికృష్ణ, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రతి చివరి ధాన్యపు గింజ వరకు కొంటాం వనపర్తి ఆరుగాలం శ్రమించి పండించిన పంటను చివరి దాన్యపు గింజ వరకు కొంటామని రైతులు ఎక్కడ అధైర్య పడాల్సిన అవసరం లేదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో FPO (రైతు ఉత్పత్తిదారుల సంఘం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సమైక్య, PACS, మెప్మా, ల తో పాటు FPO లను సైతం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వీరాయపల్లిలో వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొనుగోలు నిరంతరాయంగా కొనసాగుతున్న వలన అక్కడక్కడ లారీలు, గన్ని బస్తాల సమస్య ఉన్న అధికారులు వెంటనే పరిష్కరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అన్నదాతలు ఎలాంటి ఆందోళనలకు గురికాకూడదనీ మీరు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాజప్రకాష్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి. డైరెక్టర్లు వెంకటయ్య, వెంకటరామిరెడ్డి, బాల్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సత్యారెడ్డి మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు, నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు

Read More »

Scroll to Top