చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు పోరాడాలి : రమేష్
వనపర్తి చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు, నాలుగు లేబర్ కోడెల రద్దుకు పోరాడాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. గోపాల్‌పేట మండల కేంద్రం బస్టాండ్ లో 141 వ సిపిఐ మండల శాఖ నిర్వహించిన మేడే వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కార్మికులను 18 నుంచి 20 గంటలు పని చేయించే వారన్నారు. 8 గంటలకు తగ్గించాలని కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్తో చికాగోలో కార్మికులు ఉద్యమించారన్నారు. అమెరికా పాలకులు జరిపిన కాల్పుల్లో పలువురు కార్మికులు అమరులయ్యారని వారి పోరాట ఫలితంగా 8 గంటల పని దినం అమలులోకి వచ్చిందన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎనిమిది గంటలకు 12 గంటలకు పెంచి, నాటి అమరుల పోరాటాన్ని త్యాగాన్ని పరిహాసం చేసిందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా విభజించి చట్టాలను నిర్వీర్యం చేసిందన్నారు. ఫలితంగా కార్మికులు సమ్మె చేసే హక్కు సంఘం పెట్టుకొని హక్కును కూడా కోల్పోయారన్నారు. బిజెపి ప్రభుత్వం కార్మిక ద్రోహి అని కార్మిక లోకం దీనికి వ్యతిరేకంగా లేబర్ కోడలు రద్దయ్యేదాకా పోరాటం సాగించాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జె చంద్రయ్య, సిపిఐ మండల కార్యదర్శి మంగలి శాంతన్న,పొలికెపాడు గ్రామ శాఖ కార్యదర్శి బుచ్చన్న, నేతలు కురుమూర్తి, అన్న స్వామి, నాగన్న, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు పోరాడాలి : రమేష్ Read More »