మార్కెట్ జర్నల్ బాడీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే
వనపర్తి
వనపర్తి మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు అభివృద్ధి, రైతులకు అందిస్తున్న సేవలు, మార్కెట్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. మార్కెట్ వ్యవస్థ పారదర్శకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.. మార్కెట్ ఆదాయం, వ్యయాల వివరాలు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డులను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ అధ్యక్షులుగా డైరెక్టర్లుగా తమ పదవి కాలం వారికి ఎమ్మెల్యే గారు శాలువాలతో సన్మానించ అభినందించారూ ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, డైరెక్టర్లు కృష్ణయ్య, గోపాల్ నాయక్, సురేష్, ఓమేష్, లతీఫ్, శారద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు
