చేతి రాత విద్యార్థుల జీవితంపై ప్రభావం చూపుతుంది వనపర్తి విద్యార్థుల అందమైన చేతిరాత వారి భావి జీవితంపై చక్కని ప్రభావం చూపుతుందని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ చంద్రశేఖర్ గారి కోరిక మేరకు న్యూ స్కిల్ అకాడమీ తరుణ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక రోజు ఉచిత చేతిరాత శిక్షణ కార్యక్రమం లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పిల్లల అందమైన చేతిరాత వారిలో క్రమ శిక్షణను,ఏకాగ్రతను, తప్పులు లేకుండా రాసే చిత్తశుద్ధిని అలవాటు చేస్తుందన్న పరిశోధకుల అభిప్రాయాన్ని గుర్తు చేశారు.చక్కని చేతిరాత విద్యార్థులకు మంచి మార్కులను,గురువుల అభిమానాన్ని పొందేలా చేస్తుందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. హరిజనవాడ గెజిటెడ్ హెడ్ మాస్టర్ శ్రీ చంద్రశేఖర్ గారుతమ పిల్లలను ఈ వైపుగా ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన తెలిపారు పాఠశాలల తరుపున తరుణ్ మాస్టర్ ని ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ , ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు .ఈనాటి కార్యక్రమంలో చేతిరాత శిక్షణ నిపుణులు తరుణ్ మాస్టర్, సహాయకులు మీనా,పాఠశాల ఉపాధ్యాయులు రవి కుమార్, అరవింద్,విజయ్ కుమార్, రుక్ముద్దీన్, రంగనాయకమ్మ, నాగరాజు, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Uncategorized
తిరుమలయ్య గుట్టను పర్యటక కేంద్రం చేయాలి వనపర్తి తిరుమలయ్య గుట్టను పర్యటక కేంద్రం చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు. వచ్చేనెల వనపర్తి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మెగా రెడ్డి కు తిరుమలయ్య కొండకు ఐదు కోట్ల కేటాయించి పర్యాటక కేంద్రం చేయాలని తెలిపారు. వనపర్తి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రెండు కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చేత్తో తిరుమలయ్య గుట్టకు కూడా ఐదు కోట్ల నుండి 10 కోట్ల వరకు కేటాయిస్తే వనపర్తి జిల్లాలోని ఒక అపురూపమైన ‘తిరుమల’ ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, టిఆర్ఎస్ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, అఓపా సంగం నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, చందు యాదవ్, బాలరాజు, మరియు భక్తులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
గ్రామ గ్రామాన పండగ వాతావరణం లో “SIR” కార్యక్రమం నిర్వహించాలి వనపర్తి గ్రామాల్లో పండగ వాతావరణంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పెబ్బేరు పట్టణం, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పెబ్బేరు మండలం, శ్రీరంగాపురం మండలం, పెబ్బేరు పట్టణానికి వనపర్తి మండలం వనపర్తి పట్టణానికి చెందిన BLA-2 అవగాహన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఎన్నికల పరంగా అత్యంత కీలకమైనదని, ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త దీనిని అత్యంత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఈ కార్యక్రమం ఒక పండుగలా జరిగేలా ప్రజలను భాగస్వాములను చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవలం BLAలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, సింగిల్ విండో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ తారతమ్యం లేకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమగ్ర ఓటరు జాబితా సవరణకు ఇంకా కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేసిన వారు, ఈరోజు నుంచే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి ప్రతి అర్హుడి వద్ద SIR దరఖాస్తులు నమోదు చేయించాలని సూచించారు . ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితాలో చేరకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. ప్రభుత్వం మనదే కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, సీరియస్‌గా నిర్వహిస్తోందని, ఇందులో నిర్లక్ష్యం వహించే వారికి పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలు దొంగ ఓట్లను నమోదు చేయించేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని, అలాంటి ప్రతి ప్రయత్నాన్ని అప్రమత్తంగా అడ్డుకోవాలని సూచించారు. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మన ఓటును మనం కాపాడుకుంటూనే మన కుటుంబ సభ్యులు, మన గ్రామ ప్రజలు, కాంగ్రెస్ అనుకూల ఓటర్ల ఓట్లను కూడా పరిరక్షించడం ప్రతి కార్యకర్త బాధ్యత” అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి వనపర్తి జిల్లాలో సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో BLA లు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మార్కెట్ యార్డ్ చైర్మన్లు వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి వనపర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించి ఫిర్యాదు దారునికి సమాచార ఇవ్వాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎన్ ఖీమ్య నాయక్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగ అదనపు కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి అట్టి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి నుంచి వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 44 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 11 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పి సీఈవో యాదయ్య, శిక్షణ ఉప కలెక్టర్లు మేడం శ్రావ్య, రజనీకాంత్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 17 వ తేదీన స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి వనపర్తి వనపర్తి జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ని ఆయా బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం క్రింద నమోదైన చెక్ బౌన్స్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారం కొరకు స్పెషల్ లోక్అదాలత్ ను ఈ నెల 18.07.2026 నాడు నిర్వహించడం జరుగుతుంది. కావున కక్షిదారులు ఈ స్పెషల్ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి జి. కళార్చన తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశం లో ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
పెళ్లికొడుకుకు నూతన వస్త్రాలు అందించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన కొమ్ము ఆంజనేయులు వివాహం సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శనివారం పెళ్లికుమారుడు ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మండల అధ్యక్షుడు వెంకటస్వామి, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి వివాహ ఏర్పాట్లు, కుటుంబ విశేషాలను అడిగి తెలుసుకున్నారు . నూతన దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో కొనసాగాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షిస్తూ పెళ్లికొడుకుకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గంగా రవి, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన దొడ్డి కొమురయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్ తో కలిసి హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. సామాజిక న్యాయం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్, సిపిఓ హరికృష్ణ, డి ఐ ఈ ఓ నరేంద్ర, డిడబ్ల్యు ఓ సుధారాణి, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఏదుల రిజర్వాయర్ ముంపు బాధితులకు రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ వనపర్తి వనపర్తి నియోజకవర్గంలోని ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో ముంపుకు గురైన కొంకలపల్లి గ్రామానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల 34 లక్షలను మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు సత్తి చేసిన కార్యక్రమంలో సంబంధిత లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి తమ పొలాలు, ఇండ్లు కోల్పోయి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చిందని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గత పాలకులు తమ సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అందజేయడం ఆనందదాయకమని, తమకు న్యాయం జరుగుతోందనే నమ్మకం కలిగిందని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు మాట్లాడుతూ ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు పొలాలు, ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ముంపు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, గోపాల్పేట ఉమ్మడి మండల మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు సత్య శీలా రెడ్డి, రేవల్లి మండల అధ్యశులు సుల్తాన్ గ్రామ సర్పంచ్ బాలనాగయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు పర్వతాలు, లోడి రఘు, ఆర్డిఓ ఎంఆర్ఓ, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
ఎన్టీఆర్ లలితకళాతోరణం భవనం పూర్వ వైభవం తీసుకురండి. వనపర్తి వనపర్తి పట్టణంలో పాత బస్టాండ్‌లో ఉన్నా ఎన్టీఆర్ లలితకళాతోరణం భవనం గతం లో సాహితి, కూచిపూడి, యోగా, కరాటే, సంగితం, ఎన్నో సమాజిక కార్యక్రమాలు జరిగేవి, గత 8 సంవత్సరాల నుండి మునిసిపాలిటీకి సంబంధి చిన్నా, పాతసామానులు, బ్లీచింగ్ బ్యాగులు, సున్నం సంచులు, గదులలో ఉంచా దాము వల్లన కార్యక్రమాల కు సమస్య గా ఉంధి. కావున ఎన్టీఆర్ లలితకళాతోరణం భవనంలో ఉన్నా మున్సిపాలిటీ. సామానులు ఖాళీ చేహించి లలితకలాతోరణం భవనం సాహితీ , కళలు, యోగా, కరాటే సామాజిక కార్యక్రమాలకు నిర్వాహణకు అప్పగిణిచాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, యోగా మాస్టర్ ఓంకార్, స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీ నీరజా దేవి, కరాటే మాస్టర్ శేఖర్, కలసి మున్సిపల్ కమీషనర్ నిరంజన్ కి , వార్డు కౌన్సిలర్ బ్రహ్మ కి వినతి పత్రం అందచేసారారు.
ఈనెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి వనపర్తి పిడిఎస్‌యు, ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం AISF కార్యాలయంలో ప్రెస్ మీట్ ఈ సందర్భంగా పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గణేష్ SFI జిల్లా అధ్యక్షులు మల్లేష్ AISF జిల్లా ఉపాధ్యక్షులు వంశీ PDSU జిల్లా అధ్యక్షులు దినేష్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అన్నారు . రాష్ట్రంలో 27, వేల ప్రభుత్వ పాఠశాలలను 4 . వేలకు కుదించాలని ఆలోచన మానుకోవాలి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందించాలి మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి అక్షయపాత్ర ఇస్కన్, మన్న సంస్థకు కాకుండా మహిళ సంఘాలకు అప్పగించాలి.ప్రైవేట్ కార్పొరేట విద్య వ్యాపారాన్ని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం చేయాలి. ఖాళీగా ఉన్న టీచర్ ఎంఈఓ డిఈఓ మరియు కలెక్ట్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి జీవో నెంబర్ 7 8 9 లను రద్దు చేయాలి ఇంటర్ కాలేజ్ లకు మధ్యాహ్నం భోజనం పథకాన్ని తక్షణమే ప్రారంభించి నిధులు కేటాయించాలి.అద్ధ్య భవనాలలో నడుస్తున్న పాఠశాలలు, హాస్టల్లో గురుకులాలు లకు సొంతవానాలు నిర్మించాలి ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసి అధునాతన భవనాలను నిర్మించాలి విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి బడి బస్సులు నడపాలి ఉచిత బస్పాసులు ఇవ్వాలి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్సు కాస్మోటిక్ ఛార్జీలు పెంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి ప్రతి పాఠశాలకు కరెంటు ఇంటర్నెట్ త్రాగునీరు వంట షెడ్లు మరుగుదొడ్లు సౌకర్యాన్ని కల్పించాలి. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి ఐసీసీ కమిటీలు నియమించాలి. విద్య హక్కు చట్టం అమలు చేసి పేద విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించాలి. రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్ విద్యా రంగానికి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసి ఐదు లక్షల విద్య భరోసా కార్డులు ఉచిత ల్యాప్టాప్ లో అందించాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా తెరిచిన పుస్తకాలు యూనిఫామ్ నోట్ బుక్స్ విక్రయ కేంద్రాలను మూసివేయాలి. NEP2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో AISFనాయకులు ప్రసాద్ PDSU నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు