ఈనెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి
వనపర్తి
పిడిఎస్యు, ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం AISF కార్యాలయంలో ప్రెస్ మీట్ ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గణేష్ SFI జిల్లా అధ్యక్షులు మల్లేష్ AISF జిల్లా ఉపాధ్యక్షులు వంశీ PDSU జిల్లా అధ్యక్షులు దినేష్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అన్నారు . రాష్ట్రంలో 27, వేల ప్రభుత్వ పాఠశాలలను 4 . వేలకు కుదించాలని ఆలోచన మానుకోవాలి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందించాలి మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి అక్షయపాత్ర ఇస్కన్, మన్న సంస్థకు కాకుండా మహిళ సంఘాలకు అప్పగించాలి.ప్రైవేట్ కార్పొరేట విద్య వ్యాపారాన్ని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం చేయాలి. ఖాళీగా ఉన్న టీచర్ ఎంఈఓ డిఈఓ మరియు కలెక్ట్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి జీవో నెంబర్ 7 8 9 లను రద్దు చేయాలి ఇంటర్ కాలేజ్ లకు మధ్యాహ్నం భోజనం పథకాన్ని తక్షణమే ప్రారంభించి నిధులు కేటాయించాలి.అద్ధ్య భవనాలలో నడుస్తున్న పాఠశాలలు, హాస్టల్లో గురుకులాలు లకు సొంతవానాలు నిర్మించాలి ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసి అధునాతన భవనాలను నిర్మించాలి విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి బడి బస్సులు నడపాలి ఉచిత బస్పాసులు ఇవ్వాలి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్సు కాస్మోటిక్ ఛార్జీలు పెంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి ప్రతి పాఠశాలకు కరెంటు ఇంటర్నెట్ త్రాగునీరు వంట షెడ్లు మరుగుదొడ్లు సౌకర్యాన్ని కల్పించాలి. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి ఐసీసీ కమిటీలు నియమించాలి. విద్య హక్కు చట్టం అమలు చేసి పేద విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించాలి. రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్ విద్యా రంగానికి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసి ఐదు లక్షల విద్య భరోసా కార్డులు ఉచిత ల్యాప్టాప్ లో అందించాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా తెరిచిన పుస్తకాలు యూనిఫామ్ నోట్ బుక్స్ విక్రయ కేంద్రాలను మూసివేయాలి. NEP2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో AISFనాయకులు ప్రసాద్ PDSU నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు
