ఈ నెల 17 వ తేదీన స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి
వనపర్తి జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ని ఆయా బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం క్రింద నమోదైన చెక్ బౌన్స్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారం కొరకు స్పెషల్ లోక్అదాలత్ ను ఈ నెల 18.07.2026 నాడు నిర్వహించడం జరుగుతుంది. కావున కక్షిదారులు ఈ స్పెషల్ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి జి. కళార్చన తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశం లో ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
