VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

పోలీసు కార్యాలయాల పనితీరే ప్రజల విశ్వాసానికి పునాది. రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, నాణ్యత ఉంటేనే పోలీసు శాఖపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది. ప్రతి కేసును వేగవంతంగా, చట్టబద్ధంగా పూర్తి చేస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి సర్కిల్ కార్యాలయాన్ని ” వార్షిక తనిఖీలలో ” భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి,ఐపీఎస్ సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ గారికి వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, వనపర్తి సీఐ, సుగంధ రత్నం గార్లు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్ , క్రైం డైజెస్టర్ రికార్డు , ప్రభుత్వ ప్రాపర్టీ రిజిస్టర్, విలేజ్ రోస్టర్, పిటిషన్ రిజిస్టర్ లను UI, పీట్, గ్రేవ్ కేసుల పైలను క్షుణ్ణంగా పరిశీలించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి,లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను వనపర్తి సీఐ, సుగంధ రత్నం ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. సర్కిల్ కార్యాలయాల పనితీరు జిల్లా పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రతి రికార్డును నిబంధనలకు అనుగుణంగా నవీకరిస్తూ, కేసుల దర్యాప్తును నాణ్యతతో, నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి, పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, సాక్ష్యాధారాలను పటిష్టంగా సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, డిజిటల్ నమోదులు, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ “త్వరిత సేవలు పారదర్శక పోలీసింగ్ ప్రజల విశ్వాసమే మన విజయానికి కొలమానం అనే లక్ష్యంతో ప్రతి అధికారి విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, వనపర్తి సీఐ, సుగంధ రత్నం, డిసిఆర్భి ఎస్సై, శివకుమార్, వనపర్తి సర్కిల్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 07 10 at 4.52.05 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top