సంసార జీవితం లో ఉంటే సామాన్యుల బాధలు తెలిసేవి : సిపిఐ
వనపర్తి
ప్రధాని మోదీ సంసార జీవితం గడిపితే బంగారం అవసరం, ధరల పెరుగుదల భారం తెలిసేదని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు శ్రీరామ్ అన్నారు. సోమవారం గోపాల్పేట బస్టాండ్ లో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు రూ.3.50కు పెంపు, వాణిజ్య సిలిండర్ ధర రూ. 993 కు పెంచటానికి వ్యతిరేకంగా ధర్నా చేసి నిరసన తెలిపారు. సిపిఐ నేతలు, ఆటోల డ్రైవర్లు ఆటోకు తాళ్లు కట్టి కొంత దూరం లాగుతూ డీజిల్ కొనలేక భవిష్యత్తులో ఆటోలను తాళ్లతో లాగాల్సిందేనని సంకేతాలు ఇచ్చారు. మాట్లాడుతూ.. బంగారం కొనొద్దని, పెట్రోల్ డీజిల్ వాడకల్లో పొదుపు పాటించాలని ప్రధాని ప్రజలకు సలహాలు ఇస్తున్నారని, సంసార జీవితం గడిపితే బంగారు అవసరం, సామాన్యులకు పెట్రోల్ డీజిల్ అవసరం ఎంతో తెలిసేదని ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో లబ్ధికి ప్రపంచంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కడ పెరిగిన భారతదేశంలో పెంచమని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్ డీజిల్ ధర పెంచి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. దీనివల్ల రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతాయని సామాన్యుడు కొనలేని దుర్భర స్థితి ఏర్పడుతుందన్నారు. పెట్రోల్ డీజిల్ పై సంకాలను తగ్గిస్తే వాడి ధరలు పెంచాల్సిన అవసరమే లేదని సుంకాలను తగ్గించి పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రష్యా భారతదేశానికి తక్కువ ధరకు సమరును సరఫరా చేస్తామని చెబుతున్న ట్రంప్ కు భయపడి కొనకుండా ధరలు పెంచి పేదలపై భారం వేసారన్నారు. మళ్లీ వారం రోజుల్లో పెట్రోల్ లీటర్ పై మరోరూ. 10 పెంచేందుకు సిద్ధమవుతున్నారని పోరాడి నిలువరించాలన్నారు. అధికారం ఉందా లేకున్నా సిపిఐ పేదల పక్షాన పోరాడుతుందన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం సంపన్నుల కుమ్ముగాచి సామాన్యులపై భారం వేసి కార్మిక కర్షక హక్కులను హరిస్తోందన్నారు. సామాన్యుల సమస్యలను పట్టించుకోకుండా మతం పేరుతో యువత ప్రజలను మభ్యపెట్టి జైశ్రీరామ్ నినాదంతో అధికారంలో కొనసాగేందుకు పాచికలు కదుపుతున్నారని జాగ్రత్తగా ఉండి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, జె. చంద్రయ్య, గోపాల్పేట మండలం కార్యదర్శి మంకలి శాంతన్న, సహాయ కార్యదర్శి కురుమూర్తి,పొలికెపాడు గ్రామ శాఖ కార్యదర్శి బుచ్చన్న నేతలు ఆటో డ్రైవర్లు రాములు బాలకృష్ణ చంద్రశేఖర్ రఘు వెంకటేష్, బండారు వెంకటయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు.
