VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ… క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న యూత్ మరియు స్పోర్ట్స్ వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వనపర్తిలో 2కే రన్ ఉత్సాహంగా నిర్వహించారు. ఈ 2కే రన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా హాజరై అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి జెండా ఊపి రన్ ప్రారంభించారు. బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి బస్ డిపో మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు ఈ 2కే రన్‌ సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 99 డేస్ ప్రజా పాలనలో భాగంగా యువజన మరియు క్రీడల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల పట్ల ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, క్రీడల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు ఒక భాగంగా మారాలని సూచించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని, అందరూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వనపర్తి జిల్లాలో బాక్సింగ్ స్పోర్ట్స్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏ ఎస్ పి రాజేష్ మీనా మాట్లాడుతూ క్రీడలను అలవాటు చేసుకోవడం వల్ల శారీరకంగా దృఢంగా ఉండడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కలిగి ఉండాలని తద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలమని తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన మరియు క్రీడల వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ మరియు స్పోర్ట్స్ వీక్, టూరిజానికి సంబంధించిన పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. యూత్ మరియు స్పోర్ట్స్ వారోత్సవాల్లో భాగంగా ఈ వారం ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి తెలిపారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్, యూత్ పార్లమెంట్, స్వచ్ఛదనం మరియు పచ్చదనం, వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న యువతకు సన్మాన కార్యక్రమాలు వంటివి వారోత్సవాల రోజువారి కార్యక్రమాల్లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ బాలాజీ నాయక్, అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

whatsapp image 2026 05 18 at 8.40.49 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top