పెట్టుబడి దారీ దోపిడీ వ్యవస్థను కూల్చి సమసమాజం,సోజలిజం సాధించడమే సుందరయ్యకు ఘనమైన నివాళి
వనపర్తి
సిపిఎం పార్టీ నిర్మత పుచ్చల పల్లి సుందరయ్య 41వ వర్ధంతి నీ సిపిఎం పెబ్బేరు మండల కమిటీ ఆధ్వర్యంలో హమాలీ సంఘం కార్యాలయంలో సిపిఎం నాయకులు ఆర్ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు . సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల రాజు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల రాజు మాట్లాడుతూ , పుచ్చలపల్లి సుందరయ్య 1913 మే 1న నెల్లూరు జిల్లా అలగానిపాడు లో భూస్వామ్య కుటుంబంలో జన్మించారని భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం, దోపిడి రాజ్యం పెట్టుబడిదారీ సమాజం రద్దు కోసం పనిచేశారని అన్నారు. సోషలిజం స్థాపనకు ఎనలేని కృషి చేశారన్నారు. 1985 మే 19న అనారోగ్యంతో మరణించారన్నారు ఆయన జీవించినంత కాలం నిరాడం వరకు నిరాడంబరతకు పెట్టింది పేరని పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా 1952 నుండి 1954 వరకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 17 సంవత్సరాలు శాసనసభ్యులుగా పని చేశారని తను సైకిల్ పైనే ప్రయాణం చేసే వార నీ కొనియాడారు. కుల వివక్ష అంతం కోసం కుటుంబంతోనే పోరాటం ప్రారంభించి సమాజంలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమిచారన్నారు.1932 లోనే అలగానిపాడు లో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించారన్నారు. కార్మికులను ,పేదలను దోపిడీకి గురిచేస్తున్న పెట్టుబడి దారి వ్యవస్థను కూల్చీ సోషలిజం స్థాపించడమే సుందరయ్య గారికీ ఘనమైన నివాళి అని అన్నారు . భారత దేశంలో సంపద కొంతమంది దగ్గర పోగుబడుతున్నది.90శాతం మంది పేదలుగా, నిరుపేదలుగా జీవనం కొనసాగిస్తున్నారు . నిరుద్యోగ సైన్యం పెంచి పోషించే వ్యవస్థ పెట్టుబడి దారి వ్యవస్థ అన్నారు . మహిళాలను ఆటబొమ్మలుగా చూయించేది ,అత్యాచారాలు జరగడం సహజమే అనే ధోరణి ఈ వ్యవస్థలో ఉన్నదన్నారు . కులం ,మతం పేరుతో సమాజాన్ని నిలువున చీల్చింది పెట్టుబడి దారి వ్యవస్థ అని మండి పడ్డారు . పెట్రోల్ ,డీజిల్ ,ఆదాచేయండి ,బంగారం కొనుగోలు చేయకండి అంటూ స్వయానా ప్రధాని ప్రచారం చేయడం వెనుక దాగివున్న ఉన్న అసలు రహస్యం సంక్షోభమే అన్నారు .పెట్టుబడి దారి వ్యవస్థ ఆర్థిక అసమానతలు ,సామజిక ,రాజకీయ అసమానతలు పెంచి పోషించే దుర్మార్గపు వ్యవస్థ అన్నారు . ఈ వ్యవస్థ మార్పుకోసం నేటి యువత ,కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలనీ ఆయన పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఊసన్న హమాలి యూనియన్ అధ్యక్షులు ఆంజనేయులు గంగాధర్ వెంకటేష్ రాజు నరసింహ బిసన్న తదితరులు పాల్గొన్నారు
