VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి 

మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కవులు, సాహితీవేత్తలు సమావేశమై మే 28న మొట్టమొదటి వనపర్తి శాసనసభ్యులు సురవరం.ప్రతాప్ రెడ్డి 130వ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని వనపర్తి మాజీ మంత్రి స్వగృహంలో సన్నాహక సమావేశం నిర్వహించారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు. శ్రీ సురవరం.ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాలలో ముఖ్య వక్తలుగా సాగునీటిరంగ నిపుణులు శ్రీ వి.ప్రకాష్,శ్రీ శ్రీధర్ రావు దేశ్ పాండే మరియు ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు.గిరిజా మనోహర్ బాబు పాల్గొంటారని అదేవిధంగా ఈ ఉత్సవ సమావేశములో ప్రస్తావించే పలు అంశాల గురించి చర్చించారు అని అశోక్ తెలిపారు. ఈ సన్నాహక సమావేశములో సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస.శంకర్ గౌడ్ సాహితీవేత్తలు వీరయ్య , బలరామ్ ,నారాయణ రెడ్డి ,బైరోజు. చంద్రశేఖర్ ,మల్యాల.బాలస్వామి ,సత్తార్ ,చంద్రశేఖర్ ,కిరణ్ గారు జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్, జోహెబ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

whatsapp image 2026 05 19 at 11.04.01 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top