కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డుల పాలక మండలిని ప్రకటించిన ప్రభుత్వం
వనపర్తి
ఖిల్లా ఘణపురం, పెద్దమందడి గోపాల్పేట ఉమ్మడి మండల అన్నదాతల వ్యవసాయ మార్కెట్ యార్డుల సమస్యలు తొలగించేందుకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే గారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఖిల్లా ఘణపురం, పెద్దమందడి, గోపాల్పేట ఉమ్మడి మండలాలకు మార్కెట్ యార్డులను మంజూరు చేసింది ఈ క్రమంలో శనివారం ఆయా మార్కెట్ యార్డులకు సంబంధించిన పాలకమండలి పేర్లను ప్రకటించింది ప్రభుత్వం పాలక మండలి పేర్లను ప్రకటించిన సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఖిల్లా ఘణపురం, పెద్దమందడి మండల మార్కెట్ యార్డ్ అధ్యక్షులుగా క్యామ నవనీత W/o క్యామరాజు ఖిల్లా ఘణపురం ని, ఉపాధ్యక్షులుగా కొత్త కాపు వెంకటేశ్వర్ రెడ్డి s /o బాల్ రెడ్డి దొడగుంటపల్లి ని అధికారికంగా ప్రకటించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాలకమండలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
