డోలాహరణ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
వనపర్తి పట్టణం 9వ వార్డుకు చెందిన చీర్ల జయమ్మ – చీర్ల శ్రీనివాసులు సాగర్ గార్ల ఆహ్వానం మేరకు శ్వేత సాగర్ ప్రణయ్ సాగర్ ల డోలాహరణ కార్యక్రమం సోమవారం వారి నివాసానికి వెళ్లి ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టు శ్రీనివాస్ హాజరై కుటుంబ సభ్యులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయురారోగ్యాలతో, విద్యా విజ్ఞానాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, గంధం బాల పీరు, నీల స్వామి వెంకట్ సాగర్, ప్రేమ్ నాథ్ రెడ్డి, ఇమ్రాన్, శేఖర్, చిట్యాల రాము, మంద రాము, హలీం, కుమార్, తోట శీను, సిరివాటి శంకర్, ముని కుమార్,చీర్ల శ్రీనివాసులు,బెదడు కుమార్, చీర్లశాంతయ్య,గోవర్ధన్ సాగర్,భగీరథ శ్రీను,సూర్య నారాయణ,రవి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
