బి.రాములును పరామర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి
వనపర్తి
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనపర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బి. రాములు ని మంగళవారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రాములు గారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. రాములు కి ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. రాములు గారు త్వరగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.
