డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన
వనపర్తి
వనపర్తి శాసనసభ్యు తూడి మేఘారెడ్డితో బుధవారం వే టు న్యూస్ వారు ఏర్పాటుచేసిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కేవలం గంట వ్యవధిలో 158మంది కాల్స్ చేయగా అందులో 79కాల్స్ కి ఎమ్మెల్యే గారు సమాధానం ఇచ్చారు సమయం అయిపోయినందు వల్ల 79 కాల్స్ మిస్డ్ కాల్స్ గా మిగిలిపోయాయి ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు పలు రోడ్ల సమస్యలు విద్యుత్ సమస్యలు తాగునీటికి సంబంధించి పాటు పలు సమస్యలపై ప్రజలు నేరుగా ఎమ్మెల్యేతో మాట్లాడారు వారు పేర్కొన్న సమస్యలను ఎమ్మెల్యే గారు తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. గంట వ్యవధి పాటు నడిచిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యతిరేక పనులకు సంబంధించి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడం ఎమ్మెల్యే గారి పనితనానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వే టు న్యూస్ సంస్థ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు
