కోట మైసమ్మ దేవత ఆరాధనకు రావుల చేయూత
వనపర్తి
హమాలీ యూనియన్ (పాత గంజి) కార్మికులు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కోట మైసమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు మాజీ పార్లమెంటు సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి పండుగ నిర్వహణకు ఆర్థిక సహాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా అందించిన నగదును నాయకులు నందిమల్ల అశోక్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, సయ్యద్ జమీల్ కలిసి హమాలీ యూనియన్ అధ్యక్షుడు బాబుకు అందజేశారు. కార్మికుల సంక్షేమం, సంప్రదాయాల పరిరక్షణ పట్ల రావుల చంద్రశేఖర రెడ్డి గారి సహకారం అభినందనీయమని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
