ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ యోగా సాధన చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి యోగాతో ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించగలరని.. కాబట్టి నిత్యం యోగా సాధన చేయడం అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో యోగా శిక్షకురాలు సుగుణ సుమారు 40 నిమిషాల పాటు యోగా సాధన చేయించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ అందరికీ “యోగా డే” శుభాకాంక్షలు తెలిపారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం మన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. యోగా ఒక్కరోజు నిర్వహించి మానేసే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగా లేదా ఏదైనా శారీరక వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలని సూచించారు. శారీరక దృఢత్వం ప్రతి ఒక్కరికీ అవసరమని, రాబోయే రోజుల్లో యోగాతో పాటు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో కీలకమని, ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.నషా ముక్త్ భారత్ ఏర్పాటు కై ప్రతిజ్ఞ నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో ఉమాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, డీఎస్పీ గిరి ప్రసాద్, యోగ శిక్షకురాలు సుగుణ, జిల్లా రవాణా అధికారి, ఆయుష్ శాఖ అధికారులు వసుంధర , విశ్వశాంతి ప్రతినిధులు, గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్ సరస్వతి, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధికోసమై కృషి చేయాలి వనపర్తి తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధి కోసమై కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు అన్నారు. ఆదివారం జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నూతనంగా మెడికల్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఉద్యమ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలైన తెలంగాణ ఏర్పాటు చేసుకున్న నీళ్లు నిధుల విషయంలో కొంతవరకు సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకొని 12,13 ఏళ్లయిన నియామకాల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని జయశంకర్ సార్ ముఖ్య ఆశయం నియామకాలే అన్నారు. జయశంకర్ సార్ జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసి పోరాడిన గొప్ప వ్యక్తి అని, ఆంధ్ర పాలకులు ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఎన్ని నిర్బంధాలు విధించిన ఆయన ఉద్యమంలో వెను తిరగలేదని విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు చైతన్యాన్ని రగిలించిన మహానుభావుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో నిస్వార్ధంగా తెగించి పోరాటం చేసిన ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించిందని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం ఇస్తామని వాగ్దానం చేసిందని ఇప్పటికీ మూడేళ్లు గడుస్తున్నా కొలిక్కి రాలేదని కమిటీల పేరుతో కాలయాపన జరుగుతుందని ఈ విషయంపై వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యమకారులను పారదర్శకంగా గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని ఇది కూడా జయశంకర్ సార్ ఆశమే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఖాదర్ పాషా, యాదగిరి, సత్యం సాగర్,రమేష్,లతీఫ్, యోగానంద రెడ్డి, తిరుపతయ్య యాదవ్, నిరంజన్ వలి,రాము,ఆనంద్ శర్మ, రామాంజనేయులు,బండలయ్య, గువ్వల చెన్నయ్య, చీర్లజనార్ధన్, టప్ప మురళి,కిరణ్ కుమార్,షఫీ,గోపాలకృష్ణ, మురళి,రమేష్,రతన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సూగురు ఉపసర్పంచ్ వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి పెబ్బేరు మండలం సూగురు గ్రామానికి చెందిన గ్రామ ఉపసర్పంచ్ ఉషాన్ వివాహానికి హాజరై నూతన వధూవరులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేసారు. అనంతరం కుటుంబ సభ్యులని, గ్రామ ప్రజల యోగ క్షేమాలు అడిగారు. గ్రామ మాజీ సర్పంచ్ వెంకట సేసమ్మ వేణుగోపాల్ యొక్క ఆరోగ్య పరిస్థితులను గ్రామ సర్పంచ్ యాదమ్మ పర్శరాం ద్వార తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వేణుగోపాల్ తో తనకు ఉన్న సంబంధాలను నెమరు వేసుకున్నారు. వేణు గోపాల్ కుమారుడి కి గుండె కు స్టంట్ వేసిన విషయాలను, తగు జాగ్రత్తలను తెలియజేసారు. కార్యక్రమం లో మండల అధ్యక్షులు వనం రాములు సోషల్ మీడియ కన్వీనర్ వడ్డె రమేష్,హనుమన్న, శ్రీను, మూర్తి,పులి, జయన్న, మధు యూత్ హర్ష, దశరథ్, రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు
మరో గొప్ప పురస్కారం అందుకున్న అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ డా”సతీష్ యాదవ్ వనపర్తి తమిళనాడు రాష్ట్రం ఊటీ లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ achive ment అవార్డ్ ను ఆయన పొందారు. ఉత్తమంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను, ర్యాంకర్లను ప్రోత్సహిస్తున్నందుకు గుర్తింపుగా dr APJ అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ achive ment అవార్డ్ ను ఇంటర్ నేషనల్ పీస్ కౌన్సిల్ ఆర్గనేషన్ వారు శనివారం ఊటీ లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. పలు విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను సన్మానించి వారిని ప్రోత్సహిస్తున్నందుకు అలాగే తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు సహాయం చేయడం గుర్తించిన కొందరి రిఫరెన్స్ తో ఈ అవార్డు అందుకున్న డా” సతీష్ యాదవ్. ఇప్పటికే సమాజ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ కూడా పొందిన సతీష్ యాదవ్ కు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా….. వనపర్తి ప్రజలకు, మిత్రులకు, పత్రికా, మీడియా మిత్రులకు సతీష్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీఫ్ జడ్జ్ డాక్టర్ ప్రభు రంగరాజన్, డాక్టర్ జార్జ్ పీటర్, అధ్యక్షుడు డాక్టర్ కిమ్, U.N.I.P.C సంస్థ కోఆర్డినేటర్స్ఉ, మ్మడి పాలమూరు జిల్లా మాజీ రిజిస్టర్ డా” మల్లారెడ్డి ,ఉబ్బలి విశ్వనాథం పాల్గొన్నారు
యూరప్ లోని ప్రఖ్యాత ESCP బిజినెస్ స్కూల్లో డ్యుయల్ మాస్టర్ డిగ్రి విజయవంతంగా పూర్తి చేసిన తూడి నవనీత్ రెడ్డి వనపర్తి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తనయుడు నవనీత్ రెడ్డి గారు యూరప్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలో ఏకకాలంలో డ్యూయల్ మాస్టర్ డిగ్రి పూర్తి చేశారు.ESCP Business Schoolలో విధ్యనభ్యసించిన ఆయన మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(MBA) పట్టాను ప్రాన్స్ లో , మాస్టర్ ఆఫ్ సైన్(MSc) పట్టాను జర్మనీలో పూర్తి చేశారు. రెండు దేశాల్లోని విద్యా ప్రమాణాలను సమర్థవంతంగా అధిగమిస్తూ ఆయన ఈ ఘనత సాధించారు. ఈనెల 19న ప్రాన్స్ లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో నవనీత్ రెడ్డి తల్లిదండ్రులు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి- శారద దంపతులు, సోదరుడు మనోజ్ రెడ్డి పాల్గొన్నారు .1819లో స్థాపించబడిన ESCP Business School ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా గుర్తింపు ఉంది. ఇట్లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో డ్యూయల్ మాస్టర్ డిగ్రి పూర్తి చేయడం ద్వారా నవనీత్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో తన విద్యా ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆకాంక్ష కలిగిన విద్యార్థులకు నవనీత్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నరు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు వనపర్తి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశ యువతకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని వనపర్తి డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వనపర్తి డిసిసి చీఫ్ శివసేన రెడ్డి అధ్యక్షతన ఘనంగా వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ శ్రేణుల మధ్య రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమం సామాజిక న్యాయం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. దేశ ప్రజల సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజా సమస్యల పరిరక్షణకు సంబంధించిన పోరాటం యువతకు స్ఫూర్తినిచ్చి ప్రేరణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా శ్రేయస్సు కోసం మరింత కృషి చేస్తున్న నాయకుడు భావితరాల భవిష్యత్తు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీనాన్ని నాయకుల ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు వారి సహాయకులకు, అభాగ్యులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తైలం శంకర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరే రాములు, అధికార ప్రతినిధులు కోళ్ల వెంకటేష్, శరవంద, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సహదేవ్, బి. కృష్ణ, చీర్ల జనార్ధన్ సాగర్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంగళగౌరి ఆశీస్సులతో ప్రజలంతా సౌభాగ్యంగా ఉండాలి వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యములో వనితా క్లబ్ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నెలరోజులపాటు తమ, తమ స్వగృహాలలో “మణిద్వీప వర్ణన పారాయణం”చేసుకొని నేడు మంగళగౌరి దేవి సామూహిక కుంకుమార్చన,అభిషేక పూజలు దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబడ్డాయి. నిర్వాహకుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇట్టి పూజ కార్యక్రమములో పాల్గొని ప్రజలంతా సౌభాగ్యంగా,సుభిక్షంగా,ఆయురారోగ్యాలతో,అష్టాయిశ్వర్యలతో ఉండాలని మహిళలు మణిద్వీప వర్ణన పారాయణం మరియు గౌరీదేవి కుంకుమార్చన, అభిషేక పూజలు నిర్వహించడం అభినందనీయమని,ఆర్యవైశ్య సామాజిక సేవా సమితి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావడం నిజంగా అభినందనీయం అని కొనియాడారు. నిర్వాహకులు నిరంజన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గట్టు.శశి,రజిత,రాధిక ,ప్రశాంతి,మంజుల,రాఘవేంద్ర,హరీష్,కార్తీక్ లను మాజీ మంత్రి సన్మానించారు. మాజీ మంత్రి వెంట వాకిటి.శ్రీధర్, పలుస.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్,నాగన్న యాదవ్, దేవర్ల.నరసింహ,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ వనపర్తి “మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టే సామాజిక శాపం. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి యువతను సరైన మార్గంలో నడిపించాలి. ప్రజల సహకారంతో వనపర్తి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం, దివ్యాంగులు, వృద్ధులు , ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ డైరెక్టర్, హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జూన్ 17 నుండి 26 వరకు నషా ముక్త్ సప్తః వారోత్సవాల సందర్బంగా వారం రోజులు అవగాహన కార్యక్రమాలలో భాగంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ “నషా ముక్త్ భారత్ అభియాన్” పోస్టర్ ను జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం మరియు దేశ భవిష్యత్తును కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, యువతను సరైన మార్గంలో నడిపించడం మరియు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావడం అత్యంత అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ,బాలాజీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి కె. సుధారాణి గారు,జిల్లా బాలల పరిరక్షణ అదికాకరి, రాంబాబు, జిల్లా సంక్షేమ సూపరిండెంట్ అరుంధతి, చైల్డ్ ప్రొటెక్షన్ డీసీపీయూ అధికారులు . ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు న్యాయం పోలీసులకు బాధ్యత బాధితుల్లో భరోసా పెంచేలా సేవలందించాలి : జిల్లా ఎస్పీ సునిత రెడ్డి వనపర్తి పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసు శాఖ తనకు అండగా ఉందనే నమ్మకంతో తిరిగి వెళ్లాలి. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ప్రతి పోలీసు అధికారికి ప్రధాన బాధ్యతని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి పోలీస్టేషన్ ” వార్షిక తనిఖీలలో ” భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా పోలీస్టేషన్ చేరుకున్న ఎస్పీ గారికి పోలీసు అధికారులు పూల మొక్కలందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…పెద్దమందడి పోలీస్టేషన్ పరిధిలో గంజాయి, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తునందు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన సమయంలో దర్యాప్తు చేసి కోర్టుల నందు చార్జిషీటు దాఖలు చేసినప్పుడు బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది మాట్లాడుతూ పోలీసుశాఖ అందించిన కిట్ ఆర్టికల్స్ ను పరిశీలించి వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే సిబంది నిర్వహిస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయ అని తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలనని స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి అడిగి తెలుసుకొని గ్రామ పోలీస్ అధికారులు గ్రామాలను పూర్తిగా సమాచారం సేకరించి నేరాలు నిర్ములించాలని తెలిపారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో వాలీబాల్ ఆడారు ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు , కొత్తకోట సీఐ,రాంబాబు , పెద్దమందడి ఎస్సై,జలంధర్ రెడ్డి , డిసిఆర్బి ఎస్సై, తిరుపతి రెడ్డి,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాలల దోపిడీ.. తనిఖీలు చేసి కేసులు పెట్టాలి : రమేష్ వనపర్తి జిల్లాలో ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తనిఖీలు చేసి పాఠశాలల దూపిడిని అరికట్టాలని డీఈఓ ఆఫీస్ సూపరిండెంట్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలు దోచుకుంటున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఎల్కేజీ కి రూ. 20వేల నుంచి రూ. 40 వేలు, ఆరవ తరగతి నుంచి 10 వరకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వసూలు చేస్తున్నారన్నారు. వేర్వేరు కంపెనీల పేరు చెప్పి పాఠ్యపుస్తకాలను పాఠశాలల్లో అధిక ధరలకు విద్యార్థులకు అంటగడుతున్నారని, పాఠశాల యూనిఫారాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. పలు పాఠశాలలకు అనుమతులు లేవని, ప్రభుత్వం నిర్దేశించిన సౌకర్యాలు క్రీడామైదానాలు గదులు లేకున్నా ఫీజులు మాత్రం తగ్గించటం లేదన్నారు. పాఠశాలలను డీఈవో తనిఖీ చేసి దోపిడీ చేస్తున్న పాఠశాలలపై కేసులు పెట్టాలన్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేయకుండా ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఫీజుల పట్టికను పెట్టాలని జిల్లా కలెక్టర్ ఫీజులను నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోపిడీ ఇలాగే కొనసాగితే విద్యార్థులను సమీకరించి పాఠశాలల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, ఉదయ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.