VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వివాహ ప్రథనం కార్యక్రమంలో పాల్గొని నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ అధ్యక్షుడు రవి గారి కుమార్తె మౌనిక వివాహ ప్రథనం కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గారి వెంట కౌన్సిలర్ శ్రీకర్ చింటూ, చిట్యాల రాము, గ్రామ మాజీ ఎంపీటీసీ మద్దిలేటి గోవిందు, ఖాదర్ బాషా, కురుమూర్తి, ముజీపు, యుగేందర్, ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

వివాహ ప్రథనం కార్యక్రమంలో పాల్గొని నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి

వనపర్తి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఓటరు మాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) టి. వినోద్ కుమార్ అధికారులకు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించి ఓటరు మాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. గ్రామ పాలన అధికారులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి యుద్ధ ప్రాతిపదికన మాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాల కింద వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ , సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సాధా బైనామా మరియు భూ భారతి దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిశీలించి నివేదికలు సమర్పించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో విచారణలో ఉన్న అన్ని రకాల సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ఓటరు మాపింగ్ పనుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ పాలన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఓటరు మాపింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి Read More »

ఆర్.టి.సి కార్మికులారా అధైర్యపడకండి

వనపర్తి ఆర్.టి.సి కార్మికులు చేస్తున్న మూడవరోజు సమ్మెకు మాజీ మంత్రి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థ రూపకల్పన చేసింది నిజాం నవాబు అని అనాటి నుండి ఆర్.టి.సి కి వేల కోట్ల ఆస్తులు కలిగి ఆర్.టి.సి సంస్థ ఎదిగిందని అన్నారు.అటువంటి ఆర్.టి. సి సంస్థ కె.సి.ఆర్ గారి హయాములో ఆర్.టి.సి కార్మికుల సంక్షేమం కోసం ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ఆర్.టి.సి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడానికి చట్టాన్ని రూపొందించి గవర్నర్ అనుమతి కోసం పంపడం జరిగింది అని నాటి గవర్నర్ కాలయాపన వల్ల సాధ్యం కాలేదని వివరించారు. వేతన సవరణ 44శాతం అందించింది కూడా కె.సి.ఆర్ గారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం కోసం పోరాడడం మన ప్రాథమిక హక్కు అటువంటి ప్రాథమిక హక్కును కూడా నేటి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణగ తొక్కడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్.టి.సి కార్మికులు గతములో సమ్మె చేస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో సంస్థను విలీనం చేస్తామన్న రేవంత్ రెడ్డి మాట నిలుపుకొని వెంటనే ఆర్.టి.సి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆర్.టి.సి కార్మికుల ఆందోళనకు సంపూర్ణంగా అండగా ఉంటూ పోరాటం చేస్తామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

ఆర్.టి.సి కార్మికులారా అధైర్యపడకండి Read More »

తెలంగాణ పాలిటి వరప్రదాయిని కాళేశ్వరం

వనపర్తి కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన పి.సి.ఘోష్ కమిషన్ నివేదిక నిబంధనలకు విరుద్ధంగా ఉందని కమిషన్ సిఫార్సుల మేరకు కె.సి.ఆర్,హరీష్ రావు గారిపై చర్యలు తీసుకోకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. రెండున్నర ఏండ్ల నుండి కాలయాపన తప్పా అభివృద్ధి పథకాలు అమలు చేసింది లేదని కేవలం కెసిఆర్ మీద ఆరోపణలు చేయడానికి పాలన సాగించినట్లు ఉందని ఘాటుగా విమర్శించారు. గోదావరి జలాలు ఆంధ్రాకు తరలించడం కోసం రేవంత్ గురువు చంద్రబాబు నాయుడుకు లబ్ది చేయడానికి మేడిగడ్డ రిపేర్ చేయడం లేదని ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్న రేవంత్ చర్యలను గట్టు,శ్రీధర్ ఖండించారు. ఇప్పటికైనా కక్ష్య సాధింపు చర్యలు మానుకొని ఇచ్చిన420, హామీలు ,ఆరు గ్యారంటీలు కోసం కృషి చేయాలని హితవు పలికారు. ఈ నావేశములో నందిమల్ల.అశోక్,పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్,స్టార్.రహీమ్,సయ్యద్. జమీల్,,సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము,రాజానగరం.సత్యనారాయణ,గంధం.కృష్ణ,తోట.శ్రీను ఉన్నారు.

తెలంగాణ పాలిటి వరప్రదాయిని కాళేశ్వరం Read More »

ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్ష ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు

వనపర్తి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్ష ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదిఅని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా” సతీష్ యాదవ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని 30% తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని, ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులను రద్దుచేసి, ఇతర జోన్లకు బదిలీ చేసే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనే పలు డిమాండ్లను నెరవేర్చి వారికి న్యాయం చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేశారు.మై బూస్ బీఎస్పీ జిల్లా నాయకులు, కొత్త గొల్ల శంకర్ టిడిపి నాయకులు, డి ఎస్ పి జిల్లా నాయకులు, రాజ్ కుమార్ లోక్సత్త జిల్లా నాయకులు, రామస్వామి బీసీ నాయకులు, రవి నాయుడు బిజెపి నాయకులు. బొడ్డుపల్లి సతీష్ బి ఆర్ ఎస్ నాయకులు, వెంకటేశ్వర్లు సామాజిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్ష ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు Read More »

కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు శ్రీ భగీరథ మహర్షి

వనపర్తి కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు శ్రీ భగీరథ మహర్షి అని నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి కొనియాడారు. గురువారం శ్రీ భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని స్థానిక భగీరథ చౌరస్తాలో ఏర్పాటుచేసిన వేడుకలకు నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐ డి ఓ సి ఆవరణలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భగీరథ మహర్షి జయంతి వేడుకలకు సైతం హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు శ్రీ భగీరథ మహర్షి అని కొనియాడారు. ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధిస్తే.. వారిని భగీరథునితో పోలుస్తారని, కఠోర శ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడని కొనియాడుతారని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భగీరథ మహర్షి మహాజ్ఞాని అని, పరోపకారానికి, దీక్షకు, సహనానికి ప్రతిరూపమని ఎంత కష్టాన్నైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించే వారని అన్నారు. భగీరథ జయంతి సందర్భంగా సగరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డిసిసిబి మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, సగర సంఘం నాయకులు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు శ్రీ భగీరథ మహర్షి Read More »

పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి

వనపర్తి అపర భగీరథుడు మహర్షి భగీరథుని జయంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలకు మారు పేరు భగీరథుడని కఠోర సాధనతో గంగను నేల మీదకు తెచ్చిన మహానుభావుడు భగీరథుడు అని కొనియాడారు. ప్రజల దాహార్తి తీర్చే మంచినీటి పథకానికి కె.సి.ఆర్ గారు మిషన్ భగీరథ అని నామకరణం చేసి స్పూర్తిగా నిలిచారని అన్నారు. మహనీయుల జయంతి కార్యక్రమాలకు కె.సి.ఆర్ హయాంలో ప్రత్యేక నిధులు కేటాయించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని అన్నారు. నివాళులు అర్పించిన వారిలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్,కౌన్సిలర్.మురళీ సాగర్,విష్ణు సాగర్,మర్రికుంట.శ్రీనివాస్,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు.

పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి Read More »

ప్రమాద బాధితుని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి ఘనపూర్ మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన అశోక్ చారి ఇటీవల ప్రమాదానికి గురై శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది అశోక్ చారిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు అనంతరం వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా సూచించారు. మాజీ మంత్రి వెంట నందిమల్ల అశోక్,మాజీ సర్పంచ్ నిర్మలమ్మ,కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్,సయ్యద్.జమీల్,నాగన్న యాదవ్,మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రమాద బాధితుని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

ప్రజా ప్రభుత్వంలో రైతులకు, మహిళలకు సమున్నత స్థానం

వనపర్తి ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోందని, సన్నారకం వరి ధాన్యానికి బోనస్ కల్పించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంటు సభ్యులు మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పెద్దమందడి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వీరు ఐకెపి ఆధ్వర్యంలో పెద్దమందడి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వెల్టూరు గ్రామంలో ఏర్పాటుచేసిన రెండు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వడ్ల సంచిని తూకంపై పెట్టి కాంటా చేసి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోందని, సన్నారకం వరి ధాన్యానికి బోనస్ కల్పించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. వరి ధాన్యం అమ్మకానికి వచ్చిన రైతులకు తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి టాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. రైతులకు వారం రోజుల్లో నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇచ్చి రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తోందని తెలిపారు. రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.వెల్టూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన పలువురు లబ్ధిదారులకు ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేశారు. ఇల్లు లేని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తూ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, మాజీ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, డి ఆర్ డి ఓ ఉమాదేవి, డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాధ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో రైతులకు, మహిళలకు సమున్నత స్థానం Read More »

పేదింటి అమ్మాయి వివాహానికి మాజీ మంత్రి గారి ఆత్మీయ కానుక

వనపర్తి వనపర్తి పట్టణాన్నికి చెందిన పేదింటి అమ్మాయి ఎన్.అమూల్య(విశ్వకర్మ) వివాహం ఈ నెల 26న జరగనుంది.ఇట్టి విషయాన్ని నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన నిరంజన్ రెడ్డి గారు ఎన్.అమూల్యను ఆశీర్వదించి పుస్తే మెట్టే మరియు నూతన వస్త్రాలు అందించారు. ఆత్మీయ కానుక అందుకున్న అమూల్య కుటుంబ సభ్యులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో పలుస.రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్,కౌన్సిలర్.శ్రీకర్ గౌడ్,బంగారు.అనిల్,మోహనా చారి,ప్రసాదా చారి,చాణక్య చారి,నాగరాజు,రాము తదితరులు ఉన్నారు.

పేదింటి అమ్మాయి వివాహానికి మాజీ మంత్రి గారి ఆత్మీయ కానుక Read More »

Scroll to Top