VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

పెబ్బేరు

యూట్యూబర్ నరసింహపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని పెబ్బేరు మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. వారు బుధవారం బీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పెబ్బేరు బీఆర్ఎస్ నాయకులు అతిఉత్సాహంతో, ఎవరి మెప్పుకోసమో వెళ్లి యూట్యూబర్ నరసింహపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా, కాంగ్రెస్ నాయకులే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, అది వారి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేర్పించిందే తప్ప, అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదని వారు స్పష్టం చేశారు. తమ పార్టీకి, నాయకులకు ఎప్పుడూ అభివృద్ధిలో పోటీ పడటమే తెలుసునని, ఇలాంటి చిల్లర రాజకీయాలు, కక్షసాధింపులు తమ పార్టీ విధానం కాదని కాంగ్రెస్ నాయకులు తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొంతం దయాకర్ రెడ్డి, కౌన్సిలర్లు శివ సాయి, తాటికొండ కృష్ణ, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, నాయకులు నరేందర్, కారుపాకుల వెంకట రాములు, సత్యనారాయణ, రాములు యాదవ్, రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, రామన్ గౌడు, వెంకటయ్య గౌడ్, ఆశన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 10 21 at 6.13.31 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top