VETA NEWS MEDIA

2026-11-03
Offcanvas
Edit Template

వనపర్తి

ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగం సమాజానికి స్ఫూర్తిదాయకమని, వారి సేవలను ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసు వీరుల సేవలను స్మరించుకున్నారు.
అమరుల కుటుంబాలకు అండగా నిలవడం మనందరి బాధ్యతఅన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినప్పటికీ సమాజ భద్రత కోసం వారు చేసిన త్యాగం ఎప్పటికీ గౌరవప్రదమైనదని గుర్తుచేశారు. అమరుల కుటుంబాల త్యాగాన్ని సమాజం ఎప్పటికీ మరువకూడదని, వారి సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా, వారు చూపిన సేవా స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నిండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే మేఘారెడ్డి అమర వీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, డీఎస్పీ గిరిబాబు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 10 21 at 1.15.37 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top