VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

వనపర్తి

రోడ్డు ప్రమాదంలో యువకుడు సింగనమోని దినేష్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నకొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన పలువురిని కలచివేసింది. ఈ విషాదకర ఘటనతో బాధలో ఉన్న కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వనపర్తి పట్టణంలోని చింతల హనుమాన్ దేవాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగనమోని దినేష్ మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే సందర్శించారు. వనపర్తి మండలం మెట్టిపల్లి గ్రామానికి చెందిన శీను, సరిత దంపతుల కుమారుడైన దినేష్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. పుత్రవియోగంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి బాధను పంచుకుంటూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అనంతరం ఇదే ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న పెబ్బేరు పట్టణానికి చెందిన గణేష్‌ను ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన ధైర్యాన్ని అందిస్తూ, గణేష్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామనే భరోసా కల్పించారు.ఒక కుటుంబానికి ఆధారంగా నిలవాల్సిన యువకుడు అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దినేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన గణేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

whatsapp image 2026 10 22 at 11.35.32 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top