VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు,కవి,రచయిత, వ్యాఖ్యాత బస్వోజు సుధాకరాచారికి విశ్వకర్మ లెజండరీ అవార్డు ప్రదానం చేసారు. ఆదివారం రాత్రి హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పదవ వార్షికోత్సవంలో నిర్వాహకులు ,కార్యక్రమ ముఖ్య అతిథులు హైదరాబాదు ఎ.సి.పి కిరణ్ కుమారు, వికారాబాదు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇడుకోజు వెంకటాచారి, సంస్థ వ్యవస్థాపకులు విశ్వనాథుల పుష్పగిరి తదితరుల చేతుల మీదుగా సుధాకరాచారి విశ్వకర్మ లెజండరీ అవార్డును అందుకున్నారు. సుధాకరాచారి ఉపాధ్యాయునిగా,పద్యకవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షునిగా విశేషమైన సేవలందిస్తున్నందుకు గాను నిర్వాహకులు అవార్డును ప్రదానం చేసారు. ఈ సందర్భంగా వారు సుధాకరాచారి పద్యరచనా వైభవాన్ని ప్రస్తుతిస్తూ పద్యానికి పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. సుధాకరాచారిని కవులు పండితులు,ఉపాధ్యాయులు పలువురు అభినందించారు.

whatsapp image 2026 06 01 at 1.36.57 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top