VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

తాము ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నామని పూరి గుడిసెల్లో ఉంటూ, మట్టి మిద్దెల్లో ఉంటూ, రేకుల షెడ్డుల్లో ఉంటూ వర్షం కురుస్తున్న కవర్లు కప్పుకుని పిల్లలను తడవకుండా చూసుకున్న రోజులు నేడు గుర్తొస్తున్నాయి సార్ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు సోమవారం ఉదయం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కడుకుంట్ల గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించు కొని గృహప్రవేశాలు చేపట్టిన 22 మంది లబ్ధిదారుల ఇళ్ల గృహప్రవేశాలకు వెళ్లి వారికి నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలియజేశారు . ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తాము బాగుపడతామని భావించామన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్లను గ్రామాలలో కట్టించి ఇస్తారని పదేళ్లుగా కళ్ళల్లో వత్తులు వేసుకొనీ ఎదురు చూసామని వాపోయారు. అయినా ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు రాలేదని ఎన్నో హామీలు చెప్పిన నాయకులు నమ్ముకున్న ప్రజలను మోసం చేశారే తప్ప అండగా నిలువ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల లోనే ఈరోజు వరకు 50 ఇండ్లు మంజూరయ్యాయని అందులో 36 ఇల్లు పూర్తయ్యాయని, మరో 14 ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే గారు ప్రొసీడింగ్లులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడం నాడైనా నేడైనా కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని వచ్చే సంవత్సరం వరకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారని ఆయనను కలకాలం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారుల ఇల్లకు వెళ్లిన ఎమ్మెల్యే దంపతులకు నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలియజేశారు. తమ సొంత ఇంటి కల నెరవేర్చిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కి, రాష్ట్ర ముఖ్యమంత్రి కి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు . కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటేష్, వనపర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవికిరణ్, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 06 01 at 4.12.31 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top