VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

తెలంగాణ రాష్ట్రంలోని మహిళాల అభ్యున్నతే పరమావధిగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెబ్బేరు మండల కేంద్రంలోని సహారా ఫంక్షన్లో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి హాజరై మాట్లాడారు గత నియంత ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు సేవ చేసేందుకే తాను ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం ఫైల్ పైనే సంతకం చేశారని ఎమ్మెల్యే చెప్పారు. కేవలం వనపర్తి నియోజకవర్గంకు సంబంధించి ఇప్పటివరకు 30 కోట్ల 29 లక్షల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని ఆయన తెలిపారు రేషన్ కార్డులు లేక అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ కార్డులను అందజేస్తుందని కేవలం వనపర్తి నియోజకవర్గం లో 37,500 కొత్త రేషన్ కార్డులను ప్రజలకు అందజేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. రేషన్ కార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం పంపిన చేసిన బతుకమ్మ చీరలను మహిళలు ఏ ఒక్కరు ధరించలేదని కేవలం అవి వ్యవసాయ పొలాల్లో అడవి పందులు రాకుండా ఉండేందుకు కట్టుకునేందుకే పనికి వచ్చాయని ఆయన అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలు నాణ్యవంతంగా ఉండడంతో మహిళలు సంతోషంగా ధరించి వస్తున్నారని ఆయన అన్నారు. 200 రూపాయల ఉచిత కరెంటు ఇచ్చి నిరుపేదలకు కరెంటు కష్టాలు దూరం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలకు చైర్మన్లుగా, ఆర్టీసీ బస్సులకు ఓనర్లుగా, సోలార్ ప్లాంట్లకు ఓనర్లుగా, ఎన్నో రకాలుగా మహిళలను చైతన్యవంతం చేస్తూ వారి ఆర్థిక పురోభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సూపర్ మార్కెట్లు రైస్ మిల్లులు గోదాముల సైతం మహిళల నిర్వహణతో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేడు మహిళల గురించి నాడు ఏ ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వలేదని ఇంట్లో కూతుర్ని ఇబ్బందులు పెట్టేవారు రాష్ట్రంలోని మహిళలను ఏ విధంగా మంచిగా చూస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసి కళ్ళు మండుతున్నాయని కుళ్ళుకొని చేస్తున్నారని అలాంటివారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలే బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు, ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, పెబ్బేరు మండల అధ్యక్షుడు రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 05 31 at 6.06.15 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top