సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం
వనపర్తి
వనపర్తి మొట్టమొదటి ఎం.ఎల్.ఏ సురవరం.ప్రతాప్ రెడ్డి గారి 130వ జయంతినీ ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి సాహితీవేత్తలతో కలసి వారి స్వగృహంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి,సాహితీవేత్త,న్యాయవాది సురవరం.ప్రతాప్ రెడ్డి గారి జీవిత చరిత్రను ఆవిష్కరించడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. తన రచనలతో కేంద్ర సాహితీ అవార్డు పొందిన మహానీయుడు సురవరం అని సామాజిక రుగ్మతలకు ఎదురొడ్డి నిలిచిన మహానుభావులు అదేవిధంగా దళిత దండోరా స్థాపించి అణగారిని వర్గాలకు అండగా నిలిచిన అపరమేధావి సురవరం ప్రతాప్ రెడ్డి అని నిరంజన్ రెడ్డి కొనియాడారు. గోల్కొండ పత్రిక స్థాపించి జర్నలిస్టులకు ఆదర్శప్రాయునిగా నిలిచిన సురవరం 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. సురవరం.ప్రతాప్ రెడ్డి గారి పేరు స్థిరస్థాయిగా ఉండాలని వారి పేరిట గ్రంథాలయం,సురవరం పార్కులో వారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేశామని నిరంజన్ రెడ్డి అన్నారు. ఇట్టి సురవరం జయంతి ఉత్సవాలలో ముఖ్యతిధులుగా వారి జీవితంపై పరిశోధన చేసిన గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు మరియు సాగునీటి రంగంలో పరిశోధన చేసి,సాగునీటి రంగంలో పనిచేసి సాగునీటి రంగ నిపుణులుగా పనిచేసిన శ్రీధర్ రావు దేశ్ పాండే సాగునీటి రంగంతో పాటు తెలంగాణ అస్తిత్వవాదంతో పాటు రాజకీయ సామాజిక అంశాలు విశ్లేషణ చేస్తున్న సహచర ఉద్యమకారుడు వి.ప్రకాష్ గారు పాల్గొంటారని కాబట్టి సాహితీవేత్తలు,విద్యావేత్తలు,సమాజం పట్ల పట్టింపు ఉన్న విజ్ఞులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి అని మాజీ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా మాజీ అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస.శంకర్ గౌడ్ సాహితీవేత్తలు వీరయ్య,బలరామ్,బైరోజు.చంద్రశేఖర్,కిరణ్,తిరుమలేశ్,జోహెబ్ హుస్సేన్,కుమార్,తోట.శ్రీను ఉన్నారు.
