VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు గుమ్మడం జయరాములు గారి 41 వర్ధంతి అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో మే 24న జరుపబడును. అందరూ విజయవంతం చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తికి సేవ చేసిన బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలను మర్చిపోయిన ప్రజాప్రతినిధులకు గత పది సంవత్సరాలుగా కళ్ళు తెరిపించిన అఖిలపక్ష ఐక్యవేదిక ముందుకు వచ్చి మాజీ ఎమ్మెల్యేల జయంతులు, వర్ధంతిలు చేసి ప్రజలకు కూడా క్యాలెండర్ ద్వారా తెలిపిందని, అందుకు అనుగుణంగా
మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు గుమ్మడం జయరాములు 41 వర్ధంతి అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో మర్రికుంట పాలకేంద్రం దగ్గర 24వ తారీఖు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు జరుగుతుందని. అన్ని ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటారని, ఈ సందర్భంగా ప్రజలకు, పత్రికా, మీడియా విలేకరులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నామని సతీష్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి ఎన్నికల అధికార ప్రతినిధి కొత్త గొల్ల శంకర్, బిఎస్పి నాయకులు మైబూస్, లోక్సత్తా నాయకులు రాజ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు శివకుమార్ రాములు, రాజనగరం రామస్వామి, చందు, రమేష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 05 20 at 11.12.04 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top