VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి వనపర్తి సకల సదుపాయాలతో రూపొందించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి కోరారు. వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డు ప్రాంతంలో నూతనంగా సకల సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయంలోని మొదటి అంతస్తులో శుక్రవారం రిజిస్ట్రేషన్ అస్యూరెన్స్ కార్యాలయాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అర్చకులు వేద మంత్రాలతో ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయం పూర్తి అయి దాదాపు సంవత్సరం పైగా అవుతున్నప్పటికీ షాపుల అద్దె ఎక్కువగా ఉండటంతో షాపులు తీసుకోడానికి వ్యాపారస్తులు ఎవరు ముందుకు రాలేదన్నారు. పరిస్థిని గమనించి జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని నిర్ణయించిన రేట్లలో సగానికి తగ్గించి ప్రతిపాదనలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను పంపించగా అట్టి ప్రతిపాదనలు ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమీకృత మార్కెట్ లో షాపులు పొంది ప్రార్భోత్సవాలు చేసుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది, దస్తావేజు లేఖరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమీకృత మార్కెట్ సముదాయంలో ఇంకా డిమాండు ఉందని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అవసరమైన వారందరికీ షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమీపంలో ఉన్న టౌన్ హాల్ ను సైతం వినియోగంలోకి తీసుకువస్తామని అదేవిధంగా దాని చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో బంగారు షాపులను నిర్మించి ఇక్కడే గోల్డ్ బజార్ ఏర్పాటుకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, త్వరలోనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయంలో షాపులు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నుండి నిరుపయోగంగా పడిఉన్న సమీకృత మార్కెట్ సముదాయాని శాసన సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల షాపు ధరలు తగ్గించి లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాపుల కేటాయింపు చేయడం జరిగిందన్నారు. సామాన్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న షాపులకు మాత్రమే డిమాండు ఉంటుందనీ కానీ పై అంతస్తులో తీసుకోడానికి సామాన్యంగా ఎవరు ఇష్టపడరు అన్నారు. అందుకే పై అంతస్తులో రిజిస్ట్రేషన్ శాఖ పెట్టడం వల్ల డిమాండు పెరిగి అన్ని షాపులకు డిమాండు పెరిగిందన్నారు. పట్టణం మధ్యలో సమీకృత మార్కెట్ ఉండటం చాలా బాగుందని తెలిపారు. వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు అసంపూర్తిగా వదిలిన భవనానికి దాదాపు 23 లక్షలు అదనంగా ఖర్చు చేసి ట్రాన్స్ ఫార్మా సైతం ఏర్పాటు చేసి నేడు వినియోగంలో తెచ్చినందుకు శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్ర, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి వనపర్తి సకల సదుపాయాలతో రూపొందించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి కోరారు. వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డు ప్రాంతంలో నూతనంగా సకల సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయంలోని మొదటి అంతస్తులో శుక్రవారం రిజిస్ట్రేషన్ అస్యూరెన్స్ కార్యాలయాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అర్చకులు వేద మంత్రాలతో ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయం పూర్తి అయి దాదాపు సంవత్సరం పైగా అవుతున్నప్పటికీ షాపుల అద్దె ఎక్కువగా ఉండటంతో షాపులు తీసుకోడానికి వ్యాపారస్తులు ఎవరు ముందుకు రాలేదన్నారు. పరిస్థిని గమనించి జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని నిర్ణయించిన రేట్లలో సగానికి తగ్గించి ప్రతిపాదనలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను పంపించగా అట్టి ప్రతిపాదనలు ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమీకృత మార్కెట్ లో షాపులు పొంది ప్రార్భోత్సవాలు చేసుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది, దస్తావేజు లేఖరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమీకృత మార్కెట్ సముదాయంలో ఇంకా డిమాండు ఉందని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అవసరమైన వారందరికీ షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమీపంలో ఉన్న టౌన్ హాల్ ను సైతం వినియోగంలోకి తీసుకువస్తామని అదేవిధంగా దాని చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో బంగారు షాపులను నిర్మించి ఇక్కడే గోల్డ్ బజార్ ఏర్పాటుకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, త్వరలోనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయంలో షాపులు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నుండి నిరుపయోగంగా పడిఉన్న సమీకృత మార్కెట్ సముదాయాని శాసన సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల షాపు ధరలు తగ్గించి లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాపుల కేటాయింపు చేయడం జరిగిందన్నారు. సామాన్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న షాపులకు మాత్రమే డిమాండు ఉంటుందనీ కానీ పై అంతస్తులో తీసుకోడానికి సామాన్యంగా ఎవరు ఇష్టపడరు అన్నారు. అందుకే పై అంతస్తులో రిజిస్ట్రేషన్ శాఖ పెట్టడం వల్ల డిమాండు పెరిగి అన్ని షాపులకు డిమాండు పెరిగిందన్నారు. పట్టణం మధ్యలో సమీకృత మార్కెట్ ఉండటం చాలా బాగుందని తెలిపారు. వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు అసంపూర్తిగా వదిలిన భవనానికి దాదాపు 23 లక్షలు అదనంగా ఖర్చు చేసి ట్రాన్స్ ఫార్మా సైతం ఏర్పాటు చేసి నేడు వినియోగంలో తెచ్చినందుకు శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్ర, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజా నాయకునికి రిటైర్డ్ ఉద్యోగికి సతీష్ యాదవ్ సన్మానం వనపర్తి నిత్యం ప్రజల్లో ఉండి పోరాటాలు చేస్తున్న నాయకుడు, తెలుగుదేశం ఎన్నికల అధికార ప్రతినిధి కొత్త గొల్ల శంకర్ జన్మదిన సందర్భంగా ఉదయం ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగిగా రిటైర్డ్ అయిన R.T.C కార్మిక నాయకులు మూర్తి ని మర్రికుంట దగ్గర ఉన్న బెల్లం టీ హోటల్ దగ్గర అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ, ఇద్దరూ కార్మిక నాయకులను సన్మానించడం మా అదృష్టమని అందులో టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్ గారిని, ఆర్టీసీ నాయకుడు మూర్తి ని సన్మానించడం ప్రజల దృష్టిలో ఒక గొప్ప అవకాశం అని భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, నాయిగంటి నరసింహ శర్మ, శివకుమార్, రామస్వామి, నాగరాజు, అశోక్, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వనపర్తి ఖిల్లా ఘణపురం మండలం సల్కేలాపురం గ్రామానికి చెందిన గొల్ల చెన్నయ్య గారి కుమారుడు శ్రీకాంత్ యాదవ్ వివాహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయంలో వివాహ మహోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పెద్దల సమక్షంలో జరిగే వివాహ వేడుకలు కలకాలం అన్యోన్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వనపర్తి ఖిల్లా ఘణపురం మండలం సల్కేలాపురం గ్రామానికి చెందిన గొల్ల చెన్నయ్య గారి కుమారుడు శ్రీకాంత్ యాదవ్ వివాహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయంలో వివాహ మహోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పెద్దల సమక్షంలో జరిగే వివాహ వేడుకలు కలకాలం అన్యోన్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More »

రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీల పోరాటం

నాగర్ కర్నూల్ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు పోరాటం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి పేర్కొన్నారు. నేపాల్ లో జెఎన్ జీ ఉద్యమం. తమిళనాడులో టీవీకే అధికారంలోకి రావడాన్ని గమనిస్తే తెలంగాణలోనూ మెజారిటీ ప్రజలైన బీసీలు పోరాడితే 2029లో అధికారం దక్కడం ఖాయమని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి బుధవారం రోజున ఒక ప్రకటనలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపా, భరాస పార్టీలు సామాజిక న్యాయం పాటించడం లేదని, బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం లేదని పేర్కొన్నారు. జనగణనలో బీసీ కుల గణన చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహిళా బిల్లుల్లో బీసీలకు సబ్ కోటా పెట్టకుండా 40 కోట్ల మంది బీసీ మహిళలను భాజపా అవమానించిందని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ అన్నారు.

రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీల పోరాటం Read More »

రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు

రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు వనపర్తి రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తో మాట్లాడిన డిసిసి చీఫ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిఐకెపి సెంటర్స్, దళారులు తరువు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని రైతులు శివసేన రెడ్డికి విన్నవించారు.వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి చరవాణి ద్వారా సమాచారాన్ని చేరవేసి.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిందిగా కోరడమైనది. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తుంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్ణీతమైన తేమ శాతం ప్రకారం కొనుగోలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేయాలని అధికారులకు సూచించారు. దళారులు మోసం చేసిన రైతులకు తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అందుకు ముందస్తు ప్రణాళికలతో కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తనతకుండా చూడాలని తెలిపారు.

రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు Read More »

రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీల పోరాటం Veta News Wanaparthy : బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారిరాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు పోరాటం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి పేర్కొన్నారు. నేపాల్ లో జెఎన్ జీ ఉద్యమం. తమిళనాడులో టీవీకే అధికారంలోకి రావడాన్ని గమనిస్తే తెలంగాణలోనూ మెజారిటీ ప్రజలైన బీసీలు పోరాడితే 2029లో అధికారం దక్కడం ఖాయమని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి బుధవారం రోజున ఒక ప్రకటనలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపా, భరాస పార్టీలు సామాజిక న్యాయం పాటించడం లేదని, బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం లేదని పేర్కొన్నారు. జనగణనలో బీసీ కుల గణన చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహిళా బిల్లుల్లో బీసీలకు సబ్ కోటా పెట్టకుండా 40 కోట్ల మంది బీసీ మహిళలను భాజపా అవమానించిందని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ అన్నారు

Read More »

whatsapp image 2026 05 06 at 3.56.30 pm

Grow commercial crops and get maximum profits

వాణిజ్య పంటలను సాగు చేసి అత్యధికంగా లాభాలు పొందండి వనపర్తి వనపర్తి :: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం స్థానిక దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా ఉద్యానవనాలు , పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల మార్పిడిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో పాటు ప్రణాళికా సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ 140 కోట్ల మంది జనాభా కలిగిన భారత దేశంలో ప్రజలకు అవసరమైన మేరకు ఆయిల్ గింజలు, పప్పు దినుసులు లేవని వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొవటానికి మన ఫోరెన్సిక్ నిల్వలు బయటి దేశాలకు వెళ్లి పోతున్నాయని చెప్పారు. అందుకే మన దేశంలోనే ఆయిల్ గింజలు సాగు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. నూనె గింజల్లో అత్యధికంగా ఆయిల్ వచ్చే పంట కేవలం పామాయిల్ పంటకే ఉందని, అత్యధికంగా లాభసాటి పంట ఏదైనా ఉందంటే అది పామాయిల్ పంట అని కొనియాడారు. అందుకే రైతులు వరి పంట కాకుండా పామాయిల్, పప్పు గింజలు, కూరగాయల వైపు దృష్టి మళ్లించాలని సూచించారు. తన 90 ఎకరాల పొలంలో 75 ఎకరాలు పామాయిల్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం మొక్కకు సబ్సిడీ నుంచి ఎరువులు, డ్రిప్, గుంతలు తవ్వడానికి, 4 సంవత్సరాల పాటు అంతర్ పంట సాగుకు సైతం ప్రభుత్వం సబ్సిడీనిస్తుందని అన్నారు. రైతులు పామాయిల్ పంట సాగు చేసి దాదాపు 30 సంవత్సరాల పాటు అత్యధికంగా లాభాలు పొందాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ రైతులు తమ భూములను సారవంతంగా ఉంచుకొని వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు అవగాహన కల్పించడానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రైతు భూ సారా కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు రైతు ఉత్పత్తిదారుల సంస్థ (Former Producer Organisation) లో సభ్యత్వం తీసుకోవాలని తద్వార కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే అనేక పథకాలకు అర్హత సాధిస్తారని సూచించారు. అదేవిధంగా ప్రతి రైతు కిసాన్ క్రెడిట్ కార్డు పొందటం, సహకార సంఘంలో సభ్యత్వం తీసుకోవడం వంటివి చేయాలని చెప్పారు. పామాయిల్ పంట వేసుకునేందుందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి పామాయిల్ సాగు చేస్తున్న రైతుల వద్దకు తీసుకువెళ్లి అవగాహన కల్పిస్తామని చెప్పారు. రైతులు వరి మాత్రమే కాకుండా ఇతర పంటల సాగు వైపు దృష్టి సారించాలని కోరారు. రైతు కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, ప్రత్యేక నోడల్ అధికారి ప్రసాద్ రావు, మాజీ జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ కృపాకర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి, వీణా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయ్ భాస్కర్, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.

Grow commercial crops and get maximum profits Read More »

అన్నదాతలకు అధైర్యం వద్దు

వనపర్తి అన్నదాతలు ఎవరు కూడా అధైర్య పడరాదని, వారు సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శ్రీరంగాపూర్ , పెబ్బేరు మార్కెట్ యార్డులో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించవచ్చునని దళారుల మాటలు నమ్మే మోసపోకూడదు అని ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రానివ్వకుండా నిర్వాహకులు ప్రత్యేక దృష్టి దృష్టి సారించాలన్నారు.ధాన్యాన్ని విక్రయించిన అన్నదాతల పేర్లను వెంటనే నమోదు చేయాలని వారికి ధాన్యం విక్రయ సొమ్మును వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన వారికి సూచించారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, పెబ్బేరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు, శ్రీరంగాపురం మండల నాయకులు శ్రీహరి రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

అన్నదాతలకు అధైర్యం వద్దు Read More »

Scroll to Top