ప్రజా నాయకునికి రిటైర్డ్ ఉద్యోగికి సతీష్ యాదవ్ సన్మానం
వనపర్తి
నిత్యం ప్రజల్లో ఉండి పోరాటాలు చేస్తున్న నాయకుడు, తెలుగుదేశం ఎన్నికల అధికార ప్రతినిధి కొత్త గొల్ల శంకర్ జన్మదిన సందర్భంగా ఉదయం ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగిగా రిటైర్డ్ అయిన R.T.C కార్మిక నాయకులు మూర్తి ని మర్రికుంట దగ్గర ఉన్న బెల్లం టీ హోటల్ దగ్గర అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ, ఇద్దరూ కార్మిక నాయకులను సన్మానించడం మా అదృష్టమని అందులో టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్ గారిని, ఆర్టీసీ నాయకుడు మూర్తి ని సన్మానించడం ప్రజల దృష్టిలో ఒక గొప్ప అవకాశం అని భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, నాయిగంటి నరసింహ శర్మ, శివకుమార్, రామస్వామి, నాగరాజు, అశోక్, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

