VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template
whatsapp image 2026 05 02 at 2.44.26 pm

పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం

cfg vvvv vహైదరాబాద్‌, మే 2 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తక్షణమే పీఆర్సీ నివేదిక అందించాలని అధికారుల కమిటీని ఆదేశించారు. శనివారం తన నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను చాలా వరకు పరిష్కరించామన్నారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. పీఆర్సీ సహా నాలుగు అంశాలపై స్పష్టత ఇచ్చిన సీఎం.. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులను జూన్‌ 1లోగా అందజేస్తామన్నారు. పదవీ విరమణ చేసిన

పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం Read More »

ప్రజల నెత్తిన బిజెపి గ్యాస్ బండ.. తక్షణం ఉపసంహరించాలి: సిపిఐ

వనపర్తి వాణిజ్య సిలిండర్ ధరను రూ. 993 కు పెంచి వినియోగదారుల బిజెపి పాణిజ్య గ్యాస్ బండ వేసిందని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ విమర్శించారు. శనివారం సిపిఐ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.‌ 19 కిలోల సిలిండర్ రూ. 2321 ఉండేదని ఏకంగా రూ. 993 పెంచడంతో రూ. 3315కు పెరిగిందన్నారు. ఒకేసారి సిలిండర్ పై ఇంత ధర పెంపు బిజెపి పాలనలోనే జరిగిందన్నారు. ఇది పరోక్షంగా ప్రజలపైనే భారం పడుతుందన్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఉపయోగించి హోటల్లు రెస్టారెంట్లు టీ దుకాణాల తినుబండారాలు తయారు చేస్తారని, గ్యాస్ ధరపించడంతో వాటి రేట్లు అమాంతం పెంచేసి అవకాశం ఉందన్నారు. వనపర్తి జిల్లాలో మామూలు హోటల్లో అధికంగా ఉంటాయని ఎక్కువమంది గ్యాస్ ను ఉపయోగిస్తారని వారు తయారు చేసే ఉత్పత్తులపై ధర పెంచుతారు అన్నారు. ఈ ధర రూ. 10 ఉందని అమాంతము 15కి పెరిగే అవకాశం ఉందన్నారు. టిఫిన్లు ధరలు రూ. 50 నుంచి 60 ఉన్నాయని రూ. 80 కి పెంచే అవకాశం ఉందన్నారు. తన ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఆసుపత్రులకు వెళ్లేవారు అనివార్యంగా ఓటర్లు రెస్టారెంట్ లోనే భోజనం టిఫిన్ చేయాల్సి వస్తుందని వారందరిపై భారం పడుతుందన్నారు. బిజెపి చెప్పే మాటలకు చేతలకు పొంతనలేదన్నారు. పెంచటం లేదంటూనే ధరలు పెంచుతూ సామాన్యులను నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ సరఫరా లో కేంద్ర విఫలమైందని వాడి ధరలు కూడా పెంచే ఆలోచనలో ఉందన్నారు. వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు కూడా ఎంతో దూరంలో లేదన్నారు. ధరలు పెంచమంటూనే పెంచి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను సమీకరించి ప్రతిఘటించి తీరుతామన్నారు. పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తక్షణం రూ. 2215 కు తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, సీనియర్ నేత పృథ్వినాదం, శేఖర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల నెత్తిన బిజెపి గ్యాస్ బండ.. తక్షణం ఉపసంహరించాలి: సిపిఐ Read More »

ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివి

వనపర్తి ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివని, రెండింటిని సమానంగా ముందుకు తీసుకుపోవడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జెడ్పి సీఈవో యాదయ్య, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కార్యక్రమానికి ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధి పొందుతున్న వారి వివరాలను తెలియజేసారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణ మాఫీ పథకం ద్వారా 29,455 మంది రైతులకు రూ. 201 కోట్ల లబ్ది చేకూర్చడం జరిగింది అన్నారు. రైతు భరోసా కింద 83,964 మంది రైతులకు రూ. 91 కోట్ల పెట్టుబడి సాయం అందించమన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 26,678 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ. 286 కోట్లు వారి ఖాతాల్లో వేసినట్లు తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో 74,846 రేషన్ కార్డులు ఉండగా వాటిలో 35,837 కార్డులు ప్రజా ప్రభుత్వం లో కొత్తగా జారీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గం లో 30,812 లబ్ధిదారులకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించి కరెంటు బిల్లుల భారం తగ్గించిందాన్నారు. అదేవిధంగా నియోజకవర్గం లో మొత్తం 3978 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంతం ఇంటి కల నెరవేర్చమన్నారు. కార్యక్రమం లో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, పెబ్బేరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, సిపిఓ హరికృష్ణ, డిఆర్డిఓ ఉమాదేవి, జిల్లా స్థాయి అధికారులు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివి Read More »

చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు పోరాడాలి : రమేష్

వనపర్తి చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు, నాలుగు లేబర్ కోడెల రద్దుకు పోరాడాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. గోపాల్‌పేట మండల కేంద్రం బస్టాండ్ లో 141 వ సిపిఐ మండల శాఖ నిర్వహించిన మేడే వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కార్మికులను 18 నుంచి 20 గంటలు పని చేయించే వారన్నారు. 8 గంటలకు తగ్గించాలని కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్తో చికాగోలో కార్మికులు ఉద్యమించారన్నారు. అమెరికా పాలకులు జరిపిన కాల్పుల్లో పలువురు కార్మికులు అమరులయ్యారని వారి పోరాట ఫలితంగా 8 గంటల పని దినం అమలులోకి వచ్చిందన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎనిమిది గంటలకు 12 గంటలకు పెంచి, నాటి అమరుల పోరాటాన్ని త్యాగాన్ని పరిహాసం చేసిందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా విభజించి చట్టాలను నిర్వీర్యం చేసిందన్నారు. ఫలితంగా కార్మికులు సమ్మె చేసే హక్కు సంఘం పెట్టుకొని హక్కును కూడా కోల్పోయారన్నారు. బిజెపి ప్రభుత్వం కార్మిక ద్రోహి అని కార్మిక లోకం దీనికి వ్యతిరేకంగా లేబర్ కోడలు రద్దయ్యేదాకా పోరాటం సాగించాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జె చంద్రయ్య, సిపిఐ మండల కార్యదర్శి మంగలి శాంతన్న,పొలికెపాడు గ్రామ శాఖ కార్యదర్శి బుచ్చన్న, నేతలు కురుమూర్తి, అన్న స్వామి, నాగన్న, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు పోరాడాలి : రమేష్ Read More »

చికాగో అమరుల త్యాగాలను పరిహాసం చేస్తున్న కేంద్రం: సిపిఐ

వనపర్తి అమెరికా చికాగో లో కార్మిక అమరుల ప్రాణత్యాగంతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి కేంద్ర బిజెపి ప్రభుత్వం పరిహాసం చేస్తోందని బుద్ధి చెప్పాలని కార్మికలోకానికి సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, వనపర్తి నియోజకవర్గకార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. వనపర్తిలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో 141 వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్రెమ్మ గుడి, పార్టీ ఆఫీస్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్, టీచర్స్ కాలనీ చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో విజయ రాములు, కళావతమ్మ, చంద్రయ్య, పృథ్వి నాదం, ఎర్ర కురుమయ్య ఎర్రజెండాలను ఆవిష్కరించగా స్నేహ ఫుట్పాత్ సెంటర్, జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శాంతన్న, శ్రీను ఏఐటీయూసీ అరుణ పతాకాలను ఆవిష్కరించారు. 18 గంటల పరిధినాన్ని తగ్గించాలని, కనీస వేతనం ఇవ్వాలని అమెరికా చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ఉద్యమించారన్నారు. పాలకులు జరిపిన కాల్పుల్లో చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అందులో ఒక కార్మికుడు తన శరీరం నుంచి కారుతున్న రక్తంలో తన అంగీని తడిపి ఎగరవేశారని అదే నేడు ఎర్రజెండాగా ప్రపంచ కార్మికులకు కష్టజీవులకు అండగా ఉండి పోరాడు పొందన్నారు. అమరుల పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినం ప్రపంచవ్యాప్తంగా అమలవుతుండగా భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను లేబర్ కోడలుగా మార్చి పని దినం 12 గంటలకు పెంచటం దుర్మార్గమన్నారు. కార్మికుల శ్రమను సంపన్నులకు దోచి పెట్టేందుకే నరేంద్ర మోడీ 12 గంటల పని దినం చేశారని వ్యతిరేకంగా పోరాడాలి అన్నారు. స్వాతంత్ర కాలం నుంచి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా విభజించి వేతనం కోసం పోరాడే హక్కు, సంగం పెట్టుకునే హక్కు లేకుండా చేసిన నరేంద్ర మోడీ దుర్మార్గం ప్రభుత్వానికి కార్మికుల ఐక్యమై బుద్ధి చెప్పాలన్నారు. కార్మికులు సంఘటితంగా పోరాడితేనే వారి హక్కులు దక్కుతాయి అన్నారు. సిపిఐ, ఏఐటీయూసీ ఎర్రజెండాల కింద ప్రజలు కార్మికులు ఏకమై పోరాడాలని కోరారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సీనియర్ నేత కళావతమ్మ,సిపిఐ, ఏఐటీయూసీ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డిహెచ్పిఎస్ నేతలు చంద్రయ్య పృథ్వి నాదం గోపాలకృష్ణ ఎర్రకుర్మయ్య శేఖర్ మహేష్ వెంకటయ్య విష్ణు అశోక్ లక్ష్మీనారాయణ రాంబాబు శిరీష జ్యోతి సాయి లీల వంశీ రూప నరేష్ స్వామి శ్రీను నరసింహ శాంతయ్య నరేందర్ లక్ష్మి రాజేష్ శ్రీకాంత్ జలాల్ తదితరులు పాల్గొన్నారు.

చికాగో అమరుల త్యాగాలను పరిహాసం చేస్తున్న కేంద్రం: సిపిఐ Read More »

మన అభివృద్ధి సమాజ సేవకు ఉపయోగపడాలి

వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామానికి చెందిన మిద్దె సుదర్శన్ హైదరాబాదులోని రాజేంద్ర నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మన మండలం నుండి హైదరాబాద్ లో వృత్తిరీత్యా స్థిరపడి ఉన్నత స్థానమైన బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం మనకు గర్వకారణం అని అన్నారు. జీవితములో ఉన్నతంగా ఎదిగిన తర్వాత పుట్టిన ఊరికి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూనే సమాజ సేవకు అంకితం కావాలని కోరారు. న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయిలో సుదర్శన్ రాణించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల అశోక్ ఉన్నారు.

మన అభివృద్ధి సమాజ సేవకు ఉపయోగపడాలి Read More »

కాంగ్రెస్ సేవాదళ్ సీనియర్ నాయకుడు సీతారాములు గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

_వనపర్తి పెద్దమందడి మండలం మణిగిల్ల కాంగ్రెస్ సేవాదల్ సీనియర్ నాయకుడు సీతారాములు గౌడ్ ఇటీవలే గుండెపోటుతో అకాల మరణం చెందారు, ఇట్టి విషయాన్ని మణిగిల్ల కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటానని కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మనిగిళ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ సేవాదళ్ సీనియర్ నాయకుడు సీతారాములు గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే Read More »

రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం

వనపర్తి ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత పారదర్శకమైన, బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం “ప్రజావాణి” కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అదనంగా, వెంటనే అమలులోకి వచ్చే విధంగా ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయలలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 4వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభించి, నిరంతరంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన పిటిషన్ల సంఖ్యను అదే రోజు ముగింపు నాటికి సేకరించి, ప్రభుత్వం సూచించిన నమూనా ప్రకారం నివేదికగా పంపించాల్సిందిగా తెలిపారు. ఈ ఫార్మాట్ త్వరలో తెలియజేయబడుతుందని చెప్పారు. అలాగే, ఫిర్యాదుల నమోదు, పరిశీలన, పరిష్కార ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సీజీజీ (CGG) ద్వారా వెబ్ ఆధారిత అప్లికేషన్ అభివృద్ధి చేయబడుతున్నదని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లాలోని ప్రజలు ఆర్ డి వో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు.

రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం Read More »

నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి వనపర్తి పట్టణంలో ఏదుల మండలం మాసుపల్లి గ్రామనికి చెందిన మహేంద్ర ట్రాక్టర్ ఓనర్స్ రాములు రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ట్రాక్టర్ యజమానిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి, పురుషోత్తం, చారి, బుద్ధయ్య, నరసింహ, ఏదుల పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా,,బాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి

వనపర్తి వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో మొదటి సంవత్సరం మార్కులు తెచ్చుకున్న జీవన్ సాయి 536 మార్కులు, గురు రాఘవేంద్ర 519 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో మొదటి మార్కులు తెచ్చుకున్న భారతి 518 మార్కులతో , పోల్కపాడులో ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానం సంపాదించిన విద్యార్థిని మౌనిక లను అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. పోల్కపాడు సర్పంచ్ బంగారయ్య, 22 వార్డు కౌన్సిలర్ భర్త శ్రీనివాసులు, బీఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మై బూస్, టిడిపి నాయకులు కొత్తగొల్ల శంకర్, సుంద రామస్వామి, ఖాజా WNP ZPHS B ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, రవీందర్ గౌడ్, నరేష్,గురు రాజు యాదవ్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో కాకుండా ప్రభుత్వ స్కూల్లోని చదివించాలని వారిని మిగతావారు కూడా అనుసరిస్తారని ఎందుకంటే ప్రభుత్వ స్కూలల్లో నాణ్యవంతమైన టీచర్లు ఉంటారు… విద్యార్థులు డబ్బులు లేకుండా పాస్ అవుతున్నారు…. ప్రైవేట్ స్కూళ్లలో లక్షలు పెట్టి అన్యాయం అవుతున్నారు కనుక హైదరాబాదులో చదివించేవారు ఆలోచించి వనపర్తి లోనే చదివించాలని మేము విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి Read More »

Scroll to Top