VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

వనపర్తి

దళితుల సంఘటిత పోరాటంతోనే హక్కుల సాధన సాధ్యమని డి హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రవీందర్ అన్నారు. వనపర్తి ఆఫీస్ లో డిహెచ్పిఎస్ 20వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. డిహెచ్పిఎస్ జెండాను ఎగిరేసి మాట్లాడుతూ. ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను దళితులకు 50% కేటాయిస్తామని అమలు చేయటం లేదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. దళితులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలి ఇవ్వటం లేదని, రైతు భరోసా బ్యాంకులో రుణాలు రావటం లేదన్నారు. 80 ఏళ్ల స్వాతంత్రంలో దళితులపై దాడులు ఆగటం లేదని కుల వివక్ష, అంటరానితనం కొనసాగుతుందని పాలకుల విధానాలు కారణమన్నారు. చదువుకున్న దళిత నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఉపాధి లేక ఆందోళన చెందుతున్నారు అన్నారు. పాలకులపై పోరాటడమే సమస్యలకు పరిష్కారమని డిహెచ్పిఎస్ లో చేరి దళితులు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. రాజారాం ప్రకాష్ మళ్లీపు నరసింహ బాలిమియా తదితరులు దళితుల సమస్యలపై పాటలు పాడారు. డిహెచ్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శేఖర్, జిల్లా కమిటీ సభ్యుడు చిన్న కురుమన్న, మోష, రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 10 22 at 5.10.38 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top