VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి నియోజకవర్గం లో విద్యాభివృద్ధి కోసం ఇప్పటికే 680 కోట్ల రూపాయలను తీసుకొచ్చినట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఖిల్లా ఘణపురం మండలం మామిడిమడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం పాదపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు వనపర్తి నియోజకవర్గ పరిధిలోని నాలుగు ఉన్నత పాఠశాలలను మొదటి విడతగా తీసుకొని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తున్నానని అందులో ఖిల్లా ఘణపురం మండల మామిడి మాడ ఉన్నత పాఠశాల, ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, వనపర్తి హరిజనవాడ ఉన్నత పాఠశాల, పెబ్బేరు ఉన్నత పాఠశాలలో ఉన్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. మామిడి మాడ పాఠశాల అభివృద్ధి కోసం కోటి రూపాయల కార్పస్ పండును జమ చేస్తున్నట్లు అందుకు గ్రామస్తులు పూర్వ విద్యార్థులు అందరూ సహకరించవలసిందిగా ఆయన కోరారు. ఎమ్మెల్యే గారి పిలుపుమేరకు కార్యక్రమానికి వచ్చిన పలువు అక్కడికక్కడే విరాళాలు ఇవ్వడంతో దాదాపు 20 లక్షల రూపాయలు సమకురాయి ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ఏర్పాటు చేస్తుందన్నారు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అయిన TPS తెలంగాణ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మొదటి విడతగా రాష్ట్రంలో 70 పాఠశాలను ఎంపిక చేశారని అందుకుగాను 1000 కోట్ల రూపాయలను డిపాజిట్ చేశారని అందులో ఇప్పటికే 793 కోట్లు ఖర్చు చేస్తూ పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలోని టిపిఎస్ పాఠశాల నిర్మాణానికి పనులు కొనసాగుతున్నాయన్నారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పలు పాఠశాలలకు ఇప్పటికే నిధులు కేటాయించి అదనపు గదులు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్ ప్లాంట్ల నిర్మాణం, విద్యార్థులకు టేబుల్లు, లాంటి పలువ మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న కాలంలోనూ మరో కోటి రూపాయలతో పాఠశాలల అభివృద్ధి చేస్తున్నట్లు అందుకు సంబంధించిన నిధులు సైతం ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.తాను విద్యను అభ్యసించిన మామిడి పాఠశాలను అభివృద్ధి చేసుకోవడం తనకి ఎంతో సంతృప్తికరంగా ఉందని పాఠశాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని అది ప్రైవేట్ పాఠశాలలో సాధ్యపడదని ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను పంపే తల్లిదండ్రులు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం తమవంతుగా కృషి చేయాలని సూచించారు. మన ఇంట్లో అయ్యప్ప స్వామి మాలాధారణ ఆంజనేయ స్వామి మాలాధారణ లాంటి అనేక మాలలు వేసుకుని ఎంత నిష్టగా ఉంటామో అదేవిధంగా ఒక్క నెల రోజులు మిస్టేక్ గా ఉండి ఖర్చులన్నీ తగ్గించి ఆ ఆధా చేసిన డబ్బులను పాఠశాల కనిపించాల్సిందిగా ఎమ్మెల్యే గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక గ్రామాలకు తాను ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తానని వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్న మేఘా రెడ్డి గారి లాగా ఉన్న ఎమ్మెల్యేలను తాను చూడలేదని పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల చదువుల అభివృద్ధి కోసం ఇంతగా తప్పించి పోయే ఎమ్మెల్యే ఉండడం వనపర్తి ప్రజల అదృష్టమని ఆయన పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, శుద్ధి నీటి కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షులు నవనీత క్యామ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెన్నప్ప, విజయ భాస్కర్ రెడ్డి, వెంకట్రావు సర్పంచు లింగం, సాయిచరణ్ రెడ్డి, మండలాధ్యక్షులు కృష్ణయ్య, ఉపసర్పంచ్ భద్రయ్య, మాజీ సర్పంచ్ మోహన్ జి, జితేందర్ రెడ్డి శ్యాంసుందర్రావు, meo జయశంకర్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు యువకులు, విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 10 24 at 5.56.24 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top