విజయదశమిని పురస్కరించుకుని నాగవరం లో నాగవరం ప్రీమియర్ లీగ్ సీజన్ 3
వనపర్తి
విజయదశమిని పురస్కరించుకుని నాగవరం లో నాగవరం ప్రీమియర్ లీగ్ సీజన్ 3 ఆనందోత్సహాల మధ్య నిర్వహించుకున్నామని ఆర్గనైజర్స్ యాదగిరి, శ్రీకాంత్, రాఘవేందర్, శేఖర్, అభిలాష్, భాస్కర్లు తెలిపారు. SKY 11 టీం ట్రోఫీనికైవసం చేసుకుందని, నగదు బహుమతితో పాటు ట్రోఫీని నీరజ్ ముదిరాజ్ స్పాన్సర్ చేశారని వారు వివరించారు. విజేతలకు ముఖ్య అతిధి సీనియర్ జర్నలి స్ట్ బాలస్వామి మల్యాల బహుమతులను ప్రధానం చేశారు. ముఖ్య అతి థి విజేతలను అభినందించారు. రన్నర్స్ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు చెప్పారు. క్రీడాకారులు ఐక్యంగా క్రికెట్ క్రీడలో నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు సాధన చేస్తూ ప్రతిభను కనబరిచే వారిని వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడోత్సవాలను భవిష్యత్తులో కూడా ప్రోత్సహిస్తామని ట్రోఫీ ప్రధాత నీరజ్ ముదిరాజ్ ఈ సందర్భంగా చెప్పారు.ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నీరజ్ ముదిరాజ్, వెంకటేష్ గౌడ్, గోపాల్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
