VETA NEWS MEDIA

2026-11-03
Offcanvas
Edit Template

వనపర్తి

ప్రపంచ , దేశ చరిత్రలోపోరాటాలతోనే ప్రజా, ఉద్యోగు సమస్యలు పరిష్కారమయ్యాయి, ఎన్ హెచ్ ఎం లు వెనకడుగు వెయ్యకుండా పోరాడాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ కోరారు. శుక్రవారం వనపర్తి పట్టణం మర్రికుంట ధర్నా చౌక్ లో ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని చేస్తున్న ఎన్హెచ్ఎంలకు సిపిఐ పక్షాన మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో, వనపర్తి జిల్లాలో 280 మంది గత 3 రోజులుగా నిలవధిక సమ్మె చేస్తున్న పాలకులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు అదనంగా పనిచేస్తున్నారని కానీ రెగ్యులర్ ఉద్యోగులకు వచ్చిన జీతం లో సగం జీతం కూడా రావటం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు ఏమైందని ప్రశ్నించారు. ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న డాక్టర్లకు రూ. 40,000 జీతం మించటం లేదని రెగ్యులర్ ఉద్యోగులకు లక్ష జీతం వస్తుందన్నారు, ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న ఏఎన్ఎం-2, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డీఈవోలు, ఆపరేటర్లు, ఆయుష్ డాక్టర్లు, డి డిఎంలు టీవీ కోఆర్డినేటర్లు కాంటినెన్సీ వర్కర్లు అందరి ఉద్యోగాల పరిస్థితి రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే ఇదే రకంగా ఉందన్నారు. ప్రభుత్వం ఎన్ హెచ్ ఎం ల శ్రమదోపిడి చేస్తోందన్నారు. కరోనా కాలంలో ఎన్ హెచ్ ఎం లు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులను కాపాడాలని వారి త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. రోజురోజుకు నిత్యవసర వస్తువులధరలు పెరుగుతున్నాయని, జీతాలు మాత్రం పెంచడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఇతర రాష్ట్రాలలో ఎన్ హెచ్ ఎం లను రెగ్యులర్ చేశారని, తెలంగాణలో సాధ్యం కాదని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు.వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేసేదాకా పోరాటం కొనసాగించాలని సిపిఐ పోరాటం విజయవంతమయ్యే దాకా తోడుంటుందని అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి వంక గోపాల్ , చందు చందుతదితరులు విప్లవ గీతాలు ఆలపించారు. సిపిఐ నేతలు పృధ్వినాదం, చిన్న కురుమన్న, వంశీ , ఎన్ హెచ్ ఎం జేయసి నాయకులు పరశురాం, ఖాజా హుస్సేన్, డాక్టర్లు శశాంక్, హేమవర్ధన్, మైధిలి, నిహారిక, సెకండ్ ఏఎన్ఎంలు కృష్ణవేణి సుమిత్ర, టీఎన్జీవో నేతలు మహేశ్వర చారి, గంధం రాజు, కొండా శ్రీనివాసులు, స్టాఫ్ నర్స్లు సరిత, డాటా ఎంట్రీ ఆపరేటర్లు రాఘవేందర్, వెంకటేష్, మదన్, భాగ్యలక్ష్మి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 10 16 at 3.00.35 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top