జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న/చోరికి గురైన (65 లక్షల విలువ గల) 236 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేత జిల్లా ఎస్పీ సునిత రెడ్డి
వనపర్తి
ప్రజల కష్టార్జిత ఆస్తిని తిరిగి వారికి చేర్చడం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత కూడా. ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ సీఈఐఆర్ వ్యవస్థ ద్వారా పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందించడం వనపర్తి జిల్లా పోలీసుల సేవాభావానికి నిదర్శనమని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ లేనిదే ఎలాంటి పని జరగని సందర్భంలో మన కు అత్యంత విలువైనది, తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే సాంకేతిక పరికరం మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్లో అన్ని వివరాలు, అన్ని జ్ఞాపకాలు, అన్ని లావాదేవీలకు సంబంధించిన అప్లికేషన్లు ఉంటాయి, సాధారణంగా ప్రజలు మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగలించబడటం జరుగుతుంది. తిరిగి వాటిని సంపాదించాలంటే, తిరిగి వాటిని సంపాదించాలంటే, ఈ సందర్భంలో బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్ లో లేదా దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్లో సంప్రదించాలని ఎస్పీ గారు తెలియజేశారు. శుక్రవారం రోజున జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ బాధితులు దాదాపు మధ్యతరగతి కుటుంబీకులు, బీదవారు వారు ఎంతగానో కష్టపడి కొనుకుని వివిధ రూపాల్లో పోగొట్టుకున్న, దొంగలించబడిన, మొబైల్ ఫోన్లను తిరిగి సంపాదించడం కోసం జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ప్రత్యేక చొరవతో వనపర్తి సిసిఎస్ సీఐ, పవార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని కొత్తకోట, వనపర్తి, ఆత్మకూరు, 3సర్కిళ్ళ నుంచి 10మంది అధికారుల సిబ్బందితో కలిసి 3 ప్రత్యేక రికవరీ బృందాలను ఏర్పాటు చేసి నెల రోజుల వ్యవధిలో దాదాపు వివిధ రాష్ట్రాల నుండి జిల్లాలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న, చోరీకి గురైనటువంటి బాధితులకు 236 మొబైల్ ఫోన్లు (దాదాపు 65 లక్షల విలువ చేసే ) వివిధ ప్రాంతాల నుండి తెప్పించి బాధితులకు తిరిగి అందజేశారు, అట్టి మొబైల్ ఫోన్లు, తెలంగాణ -196 (ఫోన్లు), ఆంధ్రప్రదేశ్ -15, కర్ణాటక- 08 , కేరళ-02 , మధ్యప్రదేశ్-06, మహారాష్ట్ర – 09 , రాష్ట్రాల నుండి ఈ మొబైల్స్ ను రికవరీ చేశారు. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేయడం జరిగింది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్లను తిరిగి రాబట్టి బాధితులకు అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. బాధితులు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఫిర్యాదుకు ఎలాంటి మీసేవ సెంటర్లలో చలాన్లు కట్టవలసిన అవసరం లేదని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నాం, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు, మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతున్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై DOT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్) CEIR పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ గారు వివరించారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారు. పోలీసు ప్రజల ఆస్తుల రక్షణలో అనుక్షణం ప్రజల పక్షాన పని చేస్తుంది, తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు, నేరాలకు పాల్పడే వారికి ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు, సామాన్యుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు నమోదుచేసి , సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇచ్చి మొబైల్ ను బ్లాక్ చేయించాలన్నారు. ప్రజలు, వినియోగదారులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పోలీసుశాఖ కృత నిచ్చయంతో పనిచేసి ఈరోజు పెద్దమొత్తంలో ఫోన్స్ రికవరీ చేసి ఇక్కడ భాదితులకు అందించడం జరిగినది జిల్లా ఎస్పీ అన్నారు. పోలీసుశాఖకు ధన్యవాదాలు తెలిపిన మొబైల్స్ పొందిన బాధితులు.. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ చోరీ మొబైల్స్ రికవరీలో ప్రతిభ చూపిన సీసీఎస్, పోలీసు మరియు ప్రత్యేక పోలీసు బృందాలు సిసిఎస్ సీఐ, పవార్ అశోక్ కుమార్, ఎస్సై, రామరాజు, ఏఎస్సై, తిరుపతిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు: ఎన్.రాజగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, రాఘవేందర్, కానిస్టేబుళ్లు: బెద్దడి స్వామి, మురళి కృష్ణ, సమరసింహారెడ్డి, మురళి, సత్యనారాయణ, భూపాల్ లను ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేసి ప్రత్యేకంగా అబినధించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, వనపర్తి డిసిఆర్భీ డిఎస్పీ, బాలాజీ నాయక్, సిసిఎస్ సీఐ, పవార్ అశోక్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, వనపర్తి సీఐ, సుగంధర రత్నం, కొత్తకోట సీఐ, రాంబాబు, ఆత్మకూరు సీఐ, శివకుమార్, వనపర్తి సిసిఎస్ ఏఎస్సై, తిరుపతి రెడ్డి, ప్రత్యేక బృందం పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
