ప్రజాస్వామ్య స్పూర్తిలో ఓటు హక్కు కీలకం
వనపర్తి
అర్హులైన ఓటర్లు ప్రజాస్వామ్య వ్యవస్థకు స్పూర్తిగా నిలుస్తారు. అర్హులైన ఓటర్ల నమోదు తుది జాబితాలో ఖచ్చితంగా ఉండేవిధంగా కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి మండలంలో పలు గ్రామాలలో సర్ ప్రక్రియ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి బి.ఎల్.ఓ,బి.ఎల్. ఏలకు పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి వెంట కె.మాణిక్యం,రఘువర్ధన్ రెడ్డి,దేవర్ల.నరసింహ,మాధవ్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
