చింతల హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
వనపర్తి
ఆషాఢ మాసం అంత్యంత పవిత్రమైన ‘ముహూర్త శైవయోగం’ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలోని చింతల హనుమాన్ ఆలయంలో ఉన్న పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 13న ఏర్పడిన ఈ పవిత్ర శైవయోగం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారని, పరమశివునికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల సకల పాపాలు తొలగి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ పరమశివుడి కృపాకటాక్షాల వలన ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు
