పల్లె పాటకు ప్రాణం పోసిన గాయకుడు సాయి చంద్
వనపర్తి
ప్రముఖ గాయకుడు సాయిచంద్ వర్ధంతి ప్రభుత్వ ఆసుపత్రిలో బండారు శ్రీనివాస్ అధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాలుగొన్నారు. ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడాడు పల్లె పాటకు ప్రాణం పోసిన గాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ సాయి చంద్ అన్నారు. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా” అంటూ ఉర్రూతలూగించిన స్వరం సాయి చంద్ ఆయన పాట వింటే రైతు నాగలి పట్టుకున్నా నాట్యం చేస్తాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన గొంతు ఒక ఆయుధమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి చందు మూడవ వర్ధంతి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ , ఇబ్రహీం , సానా బేగం, కృష్ణయ్య, మమత, కాసిం, అల్లిబాబు, పద్మ రామకృష్ణ పాల్గొనారు.
