అశాస్త్రీయ కనీస వేతనాల పెంపుపై పునాసమీక్షించాలి
వనపర్తి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాల పెంపు హేతుబద్ధంగా లేదని అశాస్త్రియ వేతనాల పెంపు నిర్ణయం పున సమీక్షించి కార్మికులకు కనీస వేతనాలు 26 వేలకు పెంచాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి)రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ఎంసిఎచ్ ఆసుపత్రులలో విడివిడిగా పారిశుద్ధ్య,సెక్యూరిటీ,పేషంట్ కేర్,విభాగాల కార్మికుల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ:-తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడినగా 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాల పెంపు పట్ల హర్షంవ్యక్తం చేస్తున్నమని అయితే పెంచిన వేతనాలు ప్రజల ఆర్థిక కనీస అవసరాలు తీరే విధంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీస వేతన సలహా మండలి సిఫార్సులు ప్రభుత్వం బయట పెట్టాలని అన్నారు.కనీస వేతన మండలి సిఫార్సులు ప్రకారం అన్ స్కిల్డ్ కార్మికులకు 20వేల 250 రూపాయల నుండి పని నైపుణ్యం బట్టి నాలుగు కేటగిరీలగా 28 వేల వరకు కనీస వేతనాలు పెంపు నిర్ణయించాలని ఉన్నప్పటికీ సిఫార్సు అంశాలకు విరుద్ధంగా ఆశాస్త్రీయంగా వేతనాల పెంపు నిర్ణయం ఉన్నదని దీనితో కార్మికులు తీవ్రమైన ఆర్థిక నష్టంతో పాటు శ్రమ దోపిడికి గురి చేసే ద్వంద విధానాలు దాగి ఉన్నాయని విమర్శించారు. కనీస వేతనం 26 వేలకు పెంచాలని కార్మికులు కార్మిక సంఘాలు దశాబ్దం తరబడి అనేక ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తాజాగా పెంచిన కనీస వేతనాలతో కార్మికులకు పెద్దగా ఎలాంటి లబ్ధి చేకూరాదని అన్నారు. కనీస వేతనాలపై ఈనెల ఐదవ తేదీన వనపర్తి జిల్లా కేంద్రంలో సెమినార్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ కనీస వేతన మండలి బోర్డు సభ్యులు ఎం.డి యూసుఫ్, యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, ఇతర ముఖ్య అతిథులు, వక్తలుగా హాజరవుతున్నారని తెలిపారు. కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొని సెమినార్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులు గంధం శ్రీను, నరసింహ,లింగం శేట్టి, నరేందర్,అనిల్,రవి,శ్యాం, షాబాద్,మహేష్, ఆంజనేయులు,శ్రీహరి, అశోక్,ఆనంద్,కిషోర్, భరత్,కళావతి,ఇందిరా,పార్వతమ్మ, కవిత,భాగ్యమ్మ,సంతోష, మంజుల,పెంటమ్మ,నాని,లక్ష్మి ప్రమీల,రాములమ్మ,శ్వేత తదితరులు పాల్గొన్నారు.
