తెలంగాణ వైతాళికులు,,బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం
వనపర్తి
మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి మొట్టమొదటి ఎం. ఎల్.ఏ సురవరం ప్రతాప్ రెడ్డి గారి 130వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో నిష్ణాతులు,తెలుగు భాష పరిరక్షకుడు, సంఘ సంస్కర్త,సాహితీవేత్త, న్యాయవాది సురవరం.ప్రతాప్ రెడ్డి గారు అని కొనియాడారు. సురవరం గారి జీవిత చరిత్ర సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమములో సాహితీ వేత్తలు,బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.
