VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

ఈ విద్యా సంవత్సరం ఇంటర్ యధావిధి అడ్మిషన్లు సీఎం ప్రకటన పట్ల వనపర్తి ప్రభుత్వ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం -475 హర్షం ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల అడ్మిషన్లు గత సంవత్సరం మాదిరిగా యధావిధిగా కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మాత్యులు, రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల వనపర్తి జిల్లా ప్రభుత్వ గజిటెడ్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. 10 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యభవిష్యత్తు నిర్ణయంపై ఎలాంటి ఆలోచన చేయకుండా ఇంటర్ విద్య విలీనంపై తొందరపడవద్దని భాగస్వామ్య పక్షాలతో మేధావులతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ విద్యా సంవత్సరంలో యధావిధిగా గత సంవత్సరం మాదిరిగా అడ్మిషన్ నిర్వహించాలని తమ సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని వనపర్తి జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య కార్యదర్శి వెంకటరెడ్డి తెలియజేస్తూ, విద్యార్థుల డ్రాప్స్ కి కారణం ఇంటర్ విలీన మార్గం ఒక్కటే కాదని ,తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క ఆలోచన, ఆర్థిక ,సామాజిక కారణాలు అనేకం ఉన్నాయని వీటి గురించి చర్చించకుండా ఇంటర్ విలీనమే అన్ని సమస్యలకు మార్గమని చెప్పటం ఏకపక్షంగా ఉంటుందని తెలియజేస్తూ ,సీబీఎస్సీ చదువుతున్న స్కూల్లో టెన్త్ తర్వాత 11 వచ్చే ముందు డ్రాప్స్ ఉందో లేదో ఒక సర్వే నిర్వహించాలని కోరారు. అదేవిధంగా సిబిఎస్ స్కూల్ అనేవి మధ్యతరగతి పై వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని , గ్రామప్రాంత విద్యార్థులకు సీబీఎస్సీ స్కూల్స్ , సిలబస్ అందుబాటులో ఉండకపోవటంతోపాటు ఆ సంస్కృతి, సిలబస్ తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరి కాదని తెలిపారు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో రాష్ట్ర పరిధిలో ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సాధించడానికి సరైన మార్గం అవలంబించాలని అవసరమైతే విద్యార్థులు మేధావులతో చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని అప్పిలు చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి విద్యార్థులు ,తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళన గమనించి యధావిధిగా ఇంటర్ అడ్మిషన్లకు అనుమతించడం పట్ల మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా అధికారుల కొంతమంది ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారని ,అదేవిధంగా ఇంటర్ విద్యలో ఒక్క సంఘాన్నే ప్రోత్సహించకూడదని, మెజార్టీ సభ్యులతో కూడిన సంఘాలు కూడా ఉన్న విషయాన్ని ప్రభుత్వం, అధికారులు గమనించాలని కోరారు. ఈ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు సంఘాల యొక్క ఆందోళన ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు చాలా సహకరించాయని వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వనపర్తి జిల్లా తెలంగాణ ప్రభుత్వ గజిటెడ్ అధ్యాపకుల సంఘం 475 , అధ్యక్షులు సి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి తెలిపారు.

whatsapp image 2026 05 10 at 4.20.06 pm
whatsapp image 2026 05 10 at 4.20.07 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top