రాజా గారి బంగ్లాలో దేవీ నవరాత్రి పూజలు. రాజా రాందేవరావ్ తో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా సతీష్ యాదవ్, నాయకులు
వనపర్తి
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజా గారి బంగ్లాలో ఆస్థాన మందిరంలో పూజలు చేస్తున్న రాజారాం దేవరావు గారితో పాటు పూజలలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. పూజల అనంతరం రాజావారిని ప్రతి సంవత్సరం లాగే ఐక్యవేదిక నాయకులు శాలువాతో సత్కరించడం జరిగింది. అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తికి బస్టాండ్, బస్ డిపో, పాత బస్టాండు, హై స్కూల్ లకు స్థలాలు, పాలిటెక్నిక్ భవనం తో పాటు 18 ఎకరాల స్థలం, మరియు పార్కులకు స్థలాలు ఇచ్చిన రాజు వారి కుటుంబాలు సేవ చేశారని అందుకే వారిని సత్కరించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల పూజలు చేసి దసరా రోజున దేవునితో పాటు ఊరేగింపు లో పాల్గొని రాజారాందేవరాజు గారితో పాటు వనపర్తి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈసారి కూడా ప్రజలందరూ సంతోషాలతో దసరా ఉత్సవాలు జరుపుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక కోరుతున్నది.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా సతీష్ యాదవ్ తోపాటు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, బిజెపి నాయకులు రవి, లోక్సత్తా నాయకులు రాజ్ కుమార్, గిరిజన సంఘం నాయకులు తిరుపతి నాయక్, రామస్వామి, సుధాకర్, సాయికుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
