VETA NEWS MEDIA

2026-11-03
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షలకు అనుగుణంగా పాత ఆంజనేయస్వామి, శివాలయాల స్థానంలో రూ.కోటి వ్యయంతో ఆధునిక ఆలయాన్ని నిర్మించేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, శారదరెడ్డి దంపతులు సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు
అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక సంప్రదాయాలను పరిరక్షిస్తూ, భక్తులకు మెరుగైన ఆలయ సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న ఈ నిర్మాణ కార్యక్రమం మంగంపల్లి గ్రామ ప్రజలకు, భక్తులకు ప్రాధాన్యత సంతరించుకుంది
నూతన ఆలయ నిర్మాణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత విస్తరించనుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 10 12 at 2.55.42 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top